• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, August 29, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

Maari by Maari
August 29, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

Share and Enjoy !

Shares
Twitter

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

* సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
.
ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల మాట్లాడుతూ – ‘ధర్మస్థల నియోజకవర్గం’ చాలా మంచి మూవీ. సెప్టెంబర్ 4న రిలీజ్ కు వస్తోంది. థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఏలేందర్ మాట్లాడుతూ – ఈ సినిమాకు మంచి సాంగ్స్ చేసే అవకాశం కలిగింది. మొత్తం ఐదు పాటలు ఉంటాయి. పాటలన్నీ మా గురువు గారు చంద్రబోస్ రాశారు. ఆయన ఈ చిత్రం కోసం రాసిన ఆరంభం అనే పాట అద్భుతంగా ఉంటుంది. ఈ పాటలోని రెండు లైన్స్ లోనే మొత్తం మా కథ సారాంశం రాశారు. సెప్టెంబర్ 4న మీ ముందుకు వస్తున్నాం. ప్రేక్షకుల ఆశీస్సులు మా సినిమాకు కావాలి. అన్నారు.

ప్రొడ్యూసర్ మేరుం భాస్కర్ మాట్లాడుతూ – మా మూవీని ఎంతో క్లారిటీతో రూపొందించారు దర్శకుడు జై జ్ఞాన ప్రభ. 45 రోజుల్లో మొత్తం షూటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అనుకున్నట్లుగా 45 రోజుల్లోనే మొత్తం ప్యాచ్ వర్క్ తో సహా షూటింగ్ కంప్లీట్ చేశారు. సినిమా ఔట్ పుట్ మీ అందరికీ నచ్చేలా వచ్చింది. థియేటర్స్ లో మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

యాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ – సినిమాను ప్యాషన్ తో నిర్మించే బ్యానర్ ఇది. ఇలాంటి బ్యానర్స్ బాగుంటే అందరూ బాగుంటాయి. ఈ చిత్రంలో ఒక బ్యూటిఫుల్ రోల్ చేశాను. డైరెక్టర్ కొత్త వారైనా ఎవరికీ అలా అనిపించలేదు. చాలా క్లారిటీతో సినిమాను రూపొందించారు. అన్నారు.

హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ – ఈ చిత్రంలోని పాటలు విన్న తర్వాతే కథ విన్నాను. పాటలు, కథ బాగా నచ్చి ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చాను. డైరెక్టర్ గారికి ఫస్ట్ సినిమా అయినా బ్రిలియంట్ గా రూపొందించారు. ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇచ్చాను. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టే మూవీకి ఒప్పుకున్నాను. ఈ చిత్రాన్ని మీతో పాటే థియేటర్స్ లో చూసేందుకు వెయిట్ చేస్తున్నా. సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతున్న మా సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ మాట్లాడుతూ – మా మూవీలో మంచి కథతో పాటు మంచి సాంగ్స్ కూడా కుదిరాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు. అలాగే చంద్రబోస్ గారి సాహిత్యం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. ప్రొడ్యూసర్ భాస్కర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. ప్రతి ఆర్టిస్ట్ మా మూవీకి సపోర్ట్ చేశారు. ఇందులోని నటీనటులు అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరికీ మంచి పేరొస్తుందని నమ్ముతున్నాం. నాలాంటి కొత్త దర్శకుడికి ఇలాంటి మంచి టీమ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. నా వెనక వీళ్లంతా ఉన్నారనే ధైర్యం ముందుకు నడిపించింది. మా సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపర్చదు. తప్పకుండా మీ అందరినీ ఎంగేజ్ చేసేలా ఉంటుంది. సెప్టెంబర్ 4న థియేటర్స్ కు వెళ్లి చూడాలని కోరుతున్నా. అన్నారు.

యాక్టర్ నటరాజ్ మాట్లాడుతూ – నాకు ఈ చిత్రంలో అవకాశం కల్పించిన మా దర్శక నిర్మాతకు థ్యాంక్స్. మా సినిమాకు చంద్రబోస్ గారు మంచి సాంగ్స్ రాశారు. డైరెక్టర్ జ్ఞాన ప్రభ గారు గతంలో నాలుగైదు సినిమాలు చేసి మాకు చెప్పకుండా దాచారేమో అనిపిస్తోంది. అంత అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ సినిమాను రూపొందించారు. వితిక, శివకుమార్ కాంబినేషన్ లో నాకు ఎక్కువ సీన్స్ ఉన్నాయి. శివకుమార్ తో మంచి ఫైట్స్ కుదిరాయి. ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాం. అన్నారు.

లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ – ఈ సినిమాలో ఐదు మంచి సాంగ్స్ రాసే సందర్భాలు కల్పించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్. నాకు రంగస్థలం తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని సంతోషాన్ని కలిగించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం రంగస్థలం తర్వాత ఈ సినిమాకే దక్కింది. ఈ సినిమా మనసంతా నిండి నా భుజాలపై మోసేదాకా వచ్చింది. ఈ చిత్రంలో న్యాయం చేయరా దేవుడా, ధర్మో రక్షతి రక్షిత:, ఆరంభం, కొడుకో కొడుకో, కాలం ..ఇలా ఐదు పాటలు భిన్నమైన సందర్భాల్లో వస్తాయి. ఎంతో ఆనందంగా ఈ పాటలు రాశాను. మహావీర్ తన సంగీతంతో నా పాటలకు ప్రాణం పోశాడు. ఈ సినిమాతో మహావీర్ కు ఎన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. శివ, నటరాజ్ కు ఈ సినిమాతో మంచి పేరు రావాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతికి ఎలాంటి క్యారెక్టర్ లభించిందో ఈ చిత్రంలో వితికకు అలాంటి పవర్ ఫుల్ రోల్ లభించింది. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంటుంది. ఒక రైట్ టైమ్ లో వితికకు రైట్ క్యారెక్టర్ వచ్చింది. డబ్బులు వచ్చేలా చేస్తేనే మంచి సినిమా అనే నమ్మకాన్ని వదిలి మంచి సినిమా చేస్తే డబ్బులు వస్తాయని మనసారా నమ్మి ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు జై జ్ఞాన ప్రభ. ఎన్నో మంచి కథలు ఆయన దగ్గర ఉన్నాయి. ఫ్యూచర్ లో మంచి సినిమాలు చేయబోతున్నాడు. ఈ చిత్రానికి మీ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు

నటీనటులు – సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి

లిరిక్స్: చంద్రబోస్,
సింగర్: సునీత,
డి ఓ పి: వెంకట హనుమ,
ఫైట్స్: నందు మాస్టర్,
కొరియోగ్రఫీ: శ్రష్టి వర్మ,
డైలాగ్స్: అస్లాం,
ఎడిటింగ్: సాయిబాబు తలారి,
సంగీతం: మహావీర్ ఏలేందర్
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల ,
పి ఆర్ ఓ: బి. వీరబాబు,
నిర్మాత: మేరుం భాస్కర్,
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

by Maari
August 29, 2026
0

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

by Maari
August 28, 2026
0

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

by Maari
August 28, 2026
0

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

by Maari
August 27, 2026
0

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

by Maari
August 26, 2026
0

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు – ముఖ్య అతిథిగా దిల్ రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు – ముఖ్య అతిథిగా దిల్ రాజు

by Maari
August 26, 2026
0

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

by Maari
August 25, 2026
0

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by Maari
August 24, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.