సందీప్ సరోజ్, సాత్విక జంటగా తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘వేట’ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఎస్ఆర్‌డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అశోక్ కోటిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
పూజా కార్యక్రమానికి కొణిదెల నాగబాబు, కేఎస్ రవికుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందించగా, కేఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ..
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన సందీప్ సరోజ్.. ‘వేట’ తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని తెలిపారు. చిరంజీవి గారి సినిమాకు సంబంధించిన టైటిల్ అయినప్పటికీ, తమ కథకు ఈ పేరు సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ఈ సినిమాకు ప్రేక్షకులందరి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ..
దర్శకుడు అశోక్ కోటిపల్లి ఫోన్‌లో కథ చెప్పినప్పుడే తనకు ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని కేఎస్ రవికుమార్ తెలిపారు. సినిమాలో తాను గ్రామంలో పెద్ద రాయుడు తరహా పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా జెన్-జీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ..
‘వేట’ తన తొలి సినిమా కావడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు అశోక్ కోటిపల్లి తెలిపారు. కథ చెప్పగానే కేఎస్ రవికుమార్ గారు అంగీకరించడం తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ..
ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న తమ మూడో ప్రాజెక్ట్ ‘వేట’ అని నిర్మాత ఫణి అడపాక తెలిపారు. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తుండగా, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారని చెప్పారు.
‘కమిటీ కుర్రోళ్లు’ తరహాలోనే ఇది కూడా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న సినిమా అని, అయితే సహజత్వంతో పాటు కమర్షియల్ అంశాలను మేళవించి తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఈ ప్రయాణంలో తమకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
హీరోయిన్ సాత్విక మాట్లాడుతూ..
‘వేట’ తన కెరీర్‌లో ఒక గొప్ప ప్రారంభంగా నిలుస్తుందని సాత్విక అన్నారు. తనకు ఈ మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ కోటిపల్లి, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
సాంకేతిక బృందం
బ్యానర్: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్
ప్రొడక్షన్: ఎస్ఆర్‌డీ & ఈటీవీ విన్ ఒరిజినల్
నిర్మాతలు: ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ కోటిపల్లి
DOP: వాజిద్ బేగ్
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఫైట్స్: ఏ. విజయ్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
ఎడిటర్: రాఘవేంద్ర తిరుణ్
లిరిక్స్: శ్రీ హర్ష ఏమని, సురేశ్ బనిశెట్టి, పూర్ణ చారి
పీఆర్వో: నాయుడు – ఫణి (బియాండ్ మీడియా)
ప్రధాన నటీనటులు: సందీప్ సరోజ్, సాత్విక జంపా, కేఎస్ రవికుమార్, రాజీవ్ కనకాల, రఘుబాబు, రవీంద్ర విజయ్, ప్రభావతి, ప్రమోదిని, వికాస్ వశిష్ట తదితరులు.









