మూవీ రివ్యూ: ‘రోమాంచకం’(Romanchakam Review): ప్రేమ, హాస్యం, సస్పెన్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్!
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’(Romanchakam) సినిమాపై విడుదలకు ముందే మంచి ఆసక్తి ఏర్పడింది. సందీప్ రెడ్డి వంగా(Sandeepreddy vanga) తన తమ్ముడు ప్రణయ్ రెడ్డి(Pranay Reddy)తో కలిసి ఈ లవ్ స్టోరీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారనే వార్తలతో పాటు ప్రభాస్(Prabhas), విజయ్ దేవరకొండ(Vijaydeverakonda) వంటి స్టార్స్ ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మరి ప్రేక్షకుల ముందుకు ఈరోజే వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే..
కథ
అన్వేష్ (సుమంత్ ప్రభాస్)(Sumanth Prabhas)తన స్నేహితులతో కలిసి కొత్తగా ‘రోమాంచకం’ అనే డేటింగ్ యాప్ స్టార్టప్ ప్రారంభించాలని ప్రయత్నిస్తుంటాడు. రీసెర్చ్‌లో భాగంగా మరో డేటింగ్ యాప్ ద్వారా చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్ కుమార్)(Ananthika sanil Kumar)తో పరిచయం ఏర్పడుతుంది.
ఫోన్‌లో మొదలైన వీరి పరిచయం క్రమంగా సాన్నిహిత్యంగా మారుతుంది. మైథిలి పుట్టినరోజున ఆమెను సర్‌ప్రైజ్ చేయడానికి అన్వేష్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తాడు. అయితే అక్కడ ఊహించని విధంగా మైథిలి అతని నంబర్‌ను బ్లాక్ చేస్తుంది.
కొంతకాలం తర్వాత మైథిలి అనూహ్యంగా అన్వేష్‌కు ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నానని, రెండు రోజులు అతనితో ఉంటానని చెబుతుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.
మైథిలి ఎందుకు అన్వేష్‌ను బ్లాక్ చేసింది? హైదరాబాద్‌కు ఎందుకు వచ్చింది? ఆమె ఎక్కడికి వెళ్లింది? ఆమెను వెతికే క్రమంలో అన్వేష్, అతని స్నేహితులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? చివరకు అన్వేష్, మైథిలి ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిందే.
కథనం – విశ్లేషణ
సాధారణ లవ్ స్టోరీకి ఫ్రెండ్‌షిప్, కామెడీ, సస్పెన్స్‌ను జోడించి కొత్త ట్రీట్‌మెంట్‌తో చెప్పడం ‘రోమాంచకం’కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో హీరో స్టార్టప్ ప్రయత్నాలు, హీరోయిన్‌తో పరిచయం, వారి మధ్య సన్నిహిత సన్నివేశాలు, ఫ్రెండ్స్‌తో జరిగే సరదా సంఘటనలు హాయిగా సాగిపోతాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ ట్రాక్ సినిమాకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది.
మైథిలి అన్వేష్‌ను బ్లాక్ చేయడం, తిరిగి హైదరాబాద్ రావడం, ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో సినిమా ఇంటర్వెల్ సమయానికి మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. హీరో, అతని ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.
సెకండాఫ్‌లో అమ్మాయి కోసం ఫ్రెండ్స్ చేసే వెతుకులాట, ఎదురయ్యే పరిస్థితులు కథకు మరింత వినోదాన్ని జోడిస్తాయి. పోలీస్ ఎపిసోడ్ కూడా కామెడీ యాంగిల్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు, ట్విస్టులు సినిమాకు మంచి ముగింపును అందిస్తాయి.
‘ప్రేమ – హాస్యం – ఉత్కంఠ’ అనే సబ్‌టైటిల్‌కు తగ్గట్టుగా సినిమా మూడు అంశాలను మిక్స్ చేసి యూత్‌కి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ, హీరో–హీరోయిన్ మధ్య క్యూట్ మూమెంట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
నటీనటులు
సుమంత్ ప్రభాస్ అన్వేష్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్రస్ట్రేషన్, కన్ఫ్యూజన్, కామెడీ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది.
అనంతిక సనీల్ కుమార్ మైథిలి పాత్రలో చాలా క్యూట్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది.
ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో నాగేంద్ర (Nagendra)తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేకంగా నవ్వించాడు. మని, సాయి సోహాన్, కమల్ తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. దర్శకుడు అనుదీప్(Director Anudeep)చివర్లో ఇచ్చిన గెస్ట్ అప్పీరెన్స్ కూడా నవ్వులు పూయిస్తుంది.
సాంకేతిక విభాగం
సినిమాకు సినిమాటోగ్రఫీ ప్రధాన బలాల్లో ఒకటి. కలర్‌ఫుల్ విజువల్స్, ఫ్రెష్ ఫ్రేమింగ్‌తో సినిమా యూత్‌ఫుల్‌గా కనిపిస్తుంది.
వాసుకి వైభవ్(music director Vasuki vaibhav)అందించిన సంగీతం సినిమాకు మంచి ఎనర్జీని తీసుకొచ్చింది. ముఖ్యంగా పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా సాగింది.
ఎడిటింగ్ కూడా కథనానికి అనుగుణంగా ఉంది. దర్శకుడు పాత తరహా లవ్ స్టోరీకి ఫ్రెండ్‌షిప్, కామెడీ, సస్పెన్స్ అంశాలను జోడించి తనదైన ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. సినిమా విజువల్స్ చూస్తే నిర్మాతలు మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించిన విషయం అర్థమవుతుంది.
చివరగా..
‘రోమాంచకం’ ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ కంటే ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయగల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. సుమంత్ ప్రభాస్–అనంతిక కెమిస్ట్రీ, ఫ్రెండ్స్ కామెడీ, క్యూట్ లవ్ సీన్స్, ఆసక్తికరమైన ట్విస్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణలు.
ఇద్దరి మధ్య ఏర్పడే లవ్ స్టోరీని కొత్త తరహా ట్రీట్‌మెంట్‌తో చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం. యూత్, ఫ్రెండ్స్ గ్యాంగ్, లవ్ అండ్ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘రోమాంచకం’ మంచి టైమ్‌పాస్‌ను అందిస్తుంది.
ప్రేమ, స్నేహం, కామెడీ, సస్పెన్స్ కలగలిసిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్!
రేటింగ్: 3/5









