• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, September 3, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

Maari by Maari
September 3, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

Share and Enjoy !

Shares
Twitter

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్, అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 25న “జయహో రామానుజ” సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. బుధవారం ఈ చిత్ర సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత, నటి ప్రవళ్లిక మాట్లాడుతూ – “జయహో రామానుజ” సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నిర్మాణ బాధ్యతల వహిస్తూనే పాటు కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించాను. ఈ చిత్రంతో సమ సమాజం కోసం పాటుపడిన రామానుజాచార్యుల వారి గురించి ఈ తరం వారికి మరింతగా తెలియజేసే ప్రయత్నం చేశాం. ఈ సినిమా జర్నీ నాకు ఎన్నో విషయాలు నేర్పింది. అదంతా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మీరంతా తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నా. అక్టోబర్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కు తీసుకొస్తున్నాం అన్నారు.

టీఎఫ్ పీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – రామానుజాచార్యుల వారి ఘనతను ఈ తరానికి తెలియజేయడంలో చినజీయర్ స్వామితో పాటు మా సాయి వెంకట్ కూడా అభినందనలు అందుకుంటున్నారు. ఆయన కావాలనుకుంటే ఏదైనా కమర్షియల్ సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ మనుషులంతా ఒక్కటేననే సందేశాన్ని చాటిన మహనీయుడు రామానుజాచార్యుల వారి జీవిత కథను ఈ తరం వారికి చూపించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం అన్నారు.

నటుడు, దర్శకుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – కులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే, సమానమే అని చెప్పిన గొప్ప మహనీయుడు రామానుజాచార్యులు. ఈ సినిమా రూపొందిస్తున్న సమయంలో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. టీటీడీకి 20 లక్షల రూపాయలు విరాళం ఇవ్వగలిగాను అంటే అది రామానుజాచార్యుల వారి మహిమే. ఈ సినిమాను భారీ ప్రచారం చేసి ఘనంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ లో హై క్వాలిటీ తీసుకు వచ్చే ప్రయత్నంలో రిలీజ్ కాస్త ఆలస్యమైంది. అప్పట్లో బ్రాహ్మణులకు మాత్రమే దేవాలయాలకు ప్రవేశం ఉండేది. అలాంటి టైమ్ లో ఒక ఆధ్యాత్మిక విప్లవం తీసుకొచ్చారు రామానుజాచార్యులు. మనుషులంతా ఒక్కటే కదా అలాంటప్పుడు మిగతా వారికి ఆలయ ప్రవేశం ఎందుకు లేదు అని ప్రశ్నించాడు, అందరిలో చైతన్యం తీసుకొచ్చాడు. అందరికీ ఓం నమో నారాయణ మంత్రాన్ని నేర్పించి, ఇక నుంచీ ప్రతి ఒక్కరు బ్రాహ్మణులే వైష్ణవులే అని చాటాడు. మా సినిమాను అక్టోబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా అన్నారు.

డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ – రామానుజాచార్యుల వారు పదో శతాబ్దంలో జీవించారు. సమాజంలో అంతా ఒక్కటే అని చాటారు. అలాంటి మహనీయుడి కథతో సినిమా రూపొందించి సాయి వెంకట్ తన జన్మ చరితార్థం చేసుకున్నారు. అక్టోబర్ 25న రిలీజ్ కు వస్తున్న ఈ సినిమా ఆయనకు గొప్ప పేరు తీసుకురావాలి, మంచి విజయాన్ని అందించాలని కోరుతున్నా అన్నారు.

ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ మాట్లాడుతూ – రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తుకువస్తారు. సాయిబాబా, ఏసుప్రభు అంటే విజయచందర్ గుర్తుకువస్తారు. అలా వెండితెరపై రామానుజాచార్యులు అంటే మా సాయి వెంకట్ గుర్తుకువస్తారు. ఇది నిజమైన పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో పదకొండు క్యారెక్టర్స్ లో నటించారు సాయివెంకట్. ఇది మామూలు విషయం కాదు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఒక్కసారి చూసి తమ జీవితం సార్థకం చేసుకోవాలని కోరుతున్నా అన్నారు.

ప్రొడ్యూసర్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ – సాయి వెంకట్ నా మిత్రుడే కానీ ఈ కార్యక్రమానికి వస్తూ పోస్టర్ మీద ఆయనను చూసి మైమరచి దండం పెట్టాను. రామానుజాచార్యులుగా ఆయన అంత సహజంగా కనిపించారు. ఈ సినిమా మా సాయి వెంకట్ కు గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బోర్డ్ మెంబర్ డా లక్ష్మీ నారాయణ, ఓబీసీ కన్వీనర్ మల్లేష్, అన్నపూర్ణ, ప్రొఫెసర్ కిరణ్, శ్రీనివాస్, నిర్మాత మోహన్ గౌడ్, నటుడు రాంకీ, సత్యనారాయణ, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు – లయన్ సాయి వెంకట్, జో శర్మ, సుమన్, ప్రవళ్లిక అశ్వాపురం వేణుమాధవ్, అప్పం పద్మ, తదితరులు

టెక్నికల్ టీమ్
ప్రెజెంట్స్ : సుదర్శనం హేమలత
బ్యానర్ : సుదర్శనం ప్రొడక్షన్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ : లయన్ సాయి వెంకట్
నిర్మాతలు : సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళ్లిక
పి.ఆర్.ఓ : చందు రమేష్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

మూవీ రివ్యూ: ‘రోమాంచకం’(Romanchakam Review): ప్రేమ, హాస్యం, సస్పెన్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

by Maari
September 3, 2026
0

మూవీ రివ్యూ: ‘రోమాంచకం’(Romanchakam Review): ప్రేమ, హాస్యం, సస్పెన్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్!

మూవీ రివ్యూ: ‘రోమాంచకం’(Romanchakam Review): ప్రేమ, హాస్యం, సస్పెన్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్!

by Maari
September 3, 2026
0

“రోమాంచకం” ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ, సినిమా చూస్తున్నంత సేపు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు – హీరో సుమంత్ ప్రభాస్

“రోమాంచకం” ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ, సినిమా చూస్తున్నంత సేపు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు – హీరో సుమంత్ ప్రభాస్

by Maari
September 2, 2026
0

అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ చేతుల మీదుగా “చకోర- లూనార్ లవ్ బర్డ్” మూవీ ‘అద్దంలా చేయనా..’ సాంగ్ రిలీజ్

అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ చేతుల మీదుగా “చకోర- లూనార్ లవ్ బర్డ్” మూవీ ‘అద్దంలా చేయనా..’ సాంగ్ రిలీజ్

by Maari
September 1, 2026
0

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మ్యూజికల్ జర్నీ మరింత వైబ్రెంట్.. నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మ్యూజికల్ జర్నీ మరింత వైబ్రెంట్.. నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

by Maari
September 1, 2026
0

“రోమాంచకం”(Romanchakam) యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనింగ్ మూవీ  – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా

“రోమాంచకం”(Romanchakam) యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనింగ్ మూవీ  – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా

by Maari
September 1, 2026
0

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్.. ముఖ్యఅతిథులుగా హాజరైన హీరో నందు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్.. ముఖ్యఅతిథులుగా హాజరైన హీరో నందు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క

by Maari
September 1, 2026
0

చిరంజీవి ‘వేట’ టైటిల్‌తో సందీప్ సరోజ్ కొత్త సినిమా.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్

చిరంజీవి ‘వేట’ టైటిల్‌తో సందీప్ సరోజ్ కొత్త సినిమా.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్

by Maari
August 31, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.