• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, September 5, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఎపిక్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా

Maari by Maari
September 5, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘ఎపిక్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా

Share and Enjoy !

Shares
Twitter

* థియేటర్లన్నీ వైబ్‌తో ఊగిపోవాలి. ‘ఎపిక్’ మంచి విజయం సాధించాలి – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శివ నిర్వాణ

* ‘ఎపిక్’ అందమైన చిత్రం, అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘నా పేరు ఆనంద్.. సారీ సారీ.. ఆదిత్య.. నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది.. సినిమాలో ఓ మ్యాజిక్ ఉంది.. ఓ మంచి సినిమా, మన సినిమా తీయాలని ఉంది’ అంటూ సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఆ తర్వాత విదేశాలకు హీరో వెళ్లడం, అక్కడ జరిగే సన్నివేశాలు యూత్‌ని కట్టి పడేసేలా ఉన్నాయి. హీరో, హీరోయిన్ల సన్నివేశాలు, లవ్ ట్రాక్ ఇవన్నీ కూడా రీఫ్రెషింగ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్‌లో కళ్యాణ్ శంకర్ కనిపించిన సీన్, ఆయన చెప్పిన డైలాగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

‘లోన్ ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఎందుకు పంపడం లేదు రా‘ అని తల్లి అడగడం.. ‘కన్నప్పుడు కాలేజ్ ఫీజ్ కూడా కట్టకుంటే ఇంకెందుకు మమ్మీ’ అని హీరో అనే డైలాగ్‌తో ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ‘బ్రేకప్ అవ్వాలంటే.. ఇలా తిట్టుకుంటూ, ఎవరో ఒకర్ని బ్లేమ్ చేసుకుంటూ బ్రేకప్ అవ్వాలా’ అని హీరో చెప్పే డైలాగ్, ఆ తర్వాత హీరోయిన్ చెప్పే మాటలు అన్నీ కూడా ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చూడబోతోన్నామనే హింట్‌ను ఇచ్చేలా ఉన్నాయి. ఒక రిలేషన్‌షిప్ ఎప్పుడు ఎపిక్ అవుతుందో తెలుసా?.. అని హీరో అనడం.. ట్రైలర్‌లోని చివరి డైలాగ్స్ అన్నీ కూడా యూత్‌ని మెప్పించేలా ఉన్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

రష్మిక మందన్నా మాట్లాడుతూ .. ‘‘ఎపిక్’ ట్రైలర్ నాకు నచ్చింది. ఆనంద్ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. సినిమా కోసమే కష్టపడుతుంటాడు. కడలి పాత్ర గొప్పగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంతో వైష్ణవికి గొప్ప పేరు వస్తుంది. ఆదిత్యను చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. ‘90స్’ తర్వాత ఆయనపై బాధ్యత పెరిగిపోయింది. హేషమ్ గారి మ్యూజిక్ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. శివాజీ గారిని ఇక్కడ చూడటం, కలవడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ రాబోతోంది. సెప్టెంబర్ 10న ప్రీమియర్లు వేస్తున్నారు. టీంతో కలిసి నేను సినిమాని చూస్తాను. ‘ఎపిక్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ .. ‘‘ఎపిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన మా వదినమ్మ రష్మికకు థాంక్స్. ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచే వదినమ్మ దొరకడం నా అదృష్టం. ‘ఎపిక్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. మన జీవితంలో ఎన్నో ఎపిక్ మూమెంట్స్ ఉంటాయి. మనం బాధల్లో ఉంటే భాగస్వామి వచ్చి పట్టుకున్నా, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా ఎపిక్ మూమెంట్ అవుతుంది. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. కొత్త దర్శకులు ఇండస్ట్రీలోకి కొత్త ఐడియాలు తీసుకువస్తారు. ఆదిత్య అందరి జీవితాల్ని నిశితంగా పరిశీలిస్తుంటాడు. ఈ సినిమా అందరికీ ఓ థెరపీలా ఉంటుంది. ఇదొక ఎమోషనల్ సినిమా. మనల్ని మనం తెరపై చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇదొక అందమైన చిత్రం. అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. అందరినీ ఆకట్టుకుంటుంది. ‘ఏమాయ చేశావే’, ‘ప్రేమలు’ కలిపితే వచ్చే ఓ అందమైన కథలా ‘ఎపిక్’ ఉంటుంది. మాకు హేషమ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కడలి పాత్రలో వైష్ణవి అద్భుతంగా నటించింది. ఆమె తన పర్ఫామెన్స్‌తో అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. వైష్ణవి ఇంకా ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలి. సెప్టెంబర్ 11న మా చిత్రం రానుంది. మా సినిమా అందరినీ కదిలిస్తుంది’ అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘మా ‘ఎపిక్’ కోసం వచ్చిన రష్మిక గారికి, శివ నిర్వాణ గారికి థాంక్స్. సితార బ్యానర్‌లో నేను సినిమాలు చేస్తూనే వస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యానర్‌లో ‘ఎపిక్’ని చేయడం ఆనందంగా ఉంది. మున్ముందు మరిన్ని మంచి చిత్రాల్ని చేయాలని కోరుకుంటున్నాను. ఆదిత్య గారు నా ఫేవరేట్ డైరెక్టర్, ఫ్రెండ్. కడలి పాత్రలో నన్ను చూసి, నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఆదిత్య గారికి థాంక్స్. అజీమ్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. ప్రతీ ఫ్రేమ్‌ని అందంగా మలిచారు. హేషమ్ గారు మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘బేబి’ నుంచి ఆనంద్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడూ, ఇప్పుడూ ఆనంద్ ఒకేలా ఉన్నాడు. ఆనంద్‌లో ఎప్పుడూ ఒకేలా ఉండటం అనే ఆ లక్షణమే నాకు ఇష్టం. పక్కన వారు ఎదుగుతుంటే ఆనంద్ ఎక్కువగా సంతోషిస్తాడు. నాకు కళ్యాణ్ శంకర్ గారు ఈ సినిమాతో మంచి ఆర్టిస్ట్‌గా బిజీ అవుతారు. ‘ఎపిక్’ చిత్రం మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు.

శివాజీ మాట్లాడుతూ.. ‘‘‘ఎపిక్’లో మంచి పాత్రను ఇచ్చిన ఆదిత్యకి, నాగవంశీ గారికి థాంక్స్. ఇదంతా కూడా ఆదిత్య క్రియేట్ చేసిన ప్రపంచం. ‘90స్’ అనేది నా కెరీర్‌లో ఓ మిరాకిల్. ఆదిత్య గొప్పగా కథను నెరేట్ చేస్తాడు. ఈ కథలన్నీ కూడా ఆదిత్య జీవితంలోంచి వచ్చినవే (నవ్వుతూ). ప్రేక్షకులకి గుర్తుండిపోయే పాత్రలు, సినిమాల్ని చేయాలని ఫిక్స్ అయ్యాను. నా పాత్రకు ప్రాధాన్యంతో పాటు కథ బాగుందా? లేదా? అన్నది చూస్తున్నాను. ట్రైలర్‌లో చూపించినట్టుగా కాకుండా.. సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంటుంది. ఇది జెన్ జీ సినిమా మాత్రమే కాదు. ప్రతీ తరం ఈ మూవీని గుండెల్లో పెట్టుకుంటుంది. విదేశాల్లో చదువుకునే కుర్రాళ్లు, ఆ కుర్రాళ్లకు సంబంధదించిన కుటుంబాలకు మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. రొమాన్స్, బ్రేకప్స్ అనేవి ఈ కథలో భాగంగా వస్తాయి. ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించాలనే ఉద్దేశంతో మాత్రం సీన్లను రాసుకోలేదు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సెప్టెంబర్ 11న అందరూ థియేటర్లకు రండి. చాప్టర్ 2 నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది’ అని అన్నారు.

ఆదిత్య హాసన్ మాట్లాడుతూ .. ‘‘ఎపిక్’ ట్రైలర్ చూసి అందరికీ కల్చరల్ షాక్ కలిగే ఉంటుంది. 90స్ వరల్డ్ నుంచి వస్తున్నా కూడా కొంత షాకింగ్‌గా ఉంటుంది. ఇది కేవలం అట్రాక్షన్ కోసం చేసింది కాదు. ఇందులో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. ఆ విషయం సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థం అవుతుంది. అందరికీ ‘ఎపిక్’ సినిమా నచ్చుతుంది. ఈ మూవీలో అమాయకత్వం ఉంటుంది. ఆనంద్, వైష్ణవి, శివాజీ గారు, వాసుకి గారు అద్భుతంగా నటించారు. హేషమ్ పాటలు, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అజీమ్ విజువల్స్ గొప్పగా ఉంటాయి. ‘ఎపిక్’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘యంగ్ డైరెక్టర్స్ అందరినీ ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆదిత్య రైటింగ్ బాగుంటుంది. ఆనంద్, వైష్ణవి కలిసి చేసిన ‘బేబి’ గొప్ప విజయాన్ని సాధించింది. మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో ఆదిత్య చేస్తుండటం, ఆ సినిమాతో ఎక్కడా పోలికలు రాలేకపోవడం గొప్ప విషయం. ఆ విషయంలో మాత్రం ఆదిత్య సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. జెన్ జీ ఆడియెన్స్‌కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. హేషమ్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఆనంద్ నన్ను ఎప్పుడూ సొంత అన్నలా చూసుకుంటాడు. ఆనంద్ తన సినిమాలు, యాక్టింగ్‌తో గ్రౌండ్ లెవెల్‌కి వెళ్లాడు. వైష్ణవి గ్రోత్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ‘కోర్ట్’, ‘దండోరా’ అంటూ శివాజీ గారు ప్రతీ సినిమాతో అదరగొడుతున్నారు. థియేటర్లన్నీ వైబ్‌తో ఊగిపోవాలి. ‘ఎపిక్’ మంచి విజయం సాధించాలి’ అని అన్నారు.

శైలేష్ కొలను మాట్లాడుతూ.. ‘ఆదిత్య పేరు చూసి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లొచ్చు. ‘90స్’ నాకు ఎంతో ఇష్టం. అదే ప్రపంచంలోంచి మళ్లీ ‘ఎపిక్’ రాబోతోంది. ఆదిత్య రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆనంద్, వైష్ణవి ‘బేబీ’తో అద్భుతం చేశారు. మళ్లీ ఈ జంటకి గొప్ప విజయం దక్కాలి. విజువల్స్ బాగున్నాయి. హేషమ్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఎపిక్’ విషయంలో ముందుగా ఆదిత్యకే థాంక్స్ చెప్పాలి. ‘ఎపిక్’ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది. ఆనంద్, వైష్ణవి చేసిన ఈ చిత్రం ‘బేబీ’ కంటే పెద్ద హిట్ అవుతుంది. శివన్నతో నటించడం గొప్పగా అనిపించింది. సినిమా అద్భుతంగా ఉంటుంది. ఆదిత్య చివరి వరకు సినిమా కోసం కష్టపడుతూనే ఉంటాడు’ అని అన్నారు.

* వినోద్ అనంతోజు మాట్లాడుతూ .. ‘‘ఎపిక్’ మూవీని ఆల్రెడీ చూశాను. ఆదిత్య అద్భుతంగా రాశాడు, తీశాడు. ఆద్యంతం వినోద భరితంగా సాగుతూనే ఎమోషనల్‌గానూ టచ్ చేస్తుంది. వైష్ణవి పాత్ర గొప్పగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆనంద్‌తో చేసిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కరోనా వల్ల ఓటీటీలోకి వచ్చింది.

*ప్రముఖ దర్శకుడు సాయి మార్తాండ్ మాట్లాడుతూ* .. ‘‘ఎపిక్’లో వైష్ణవి, ఆనంద్ నటన అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్‌లో శివాజీ గారు అదరగొట్టేశారు. ఆదిత్య నిర్మించిన ‘లిటిల్ హార్ట్స్’ వచ్చి ఏడాది అవుతోంది. ‘లిటిల్ హార్ట్స్’ కంటే ‘ఎపిక్’ పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ* .. ‘‘తెలుగులో నాకు మంచి అవకాశాల్ని ఇస్తున్న అందరికీ థాంక్స్. ‘ఎపిక్’ మూవీలో ఛాన్స్ ఇచ్చిన ఆదిత్యకు థాంక్స్. సినిమా అద్బుతంగా వచ్చింది. ‘ఎపిక్’ టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఆనంద్, వైష్ణవి అద్భుతంగా నటించారు. ‘ఎపిక్’ సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా ఎపిక్ విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

*శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ* .. ‘‘ఎపిక్’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అదిరిపోతుంది. ఇండస్ట్రీలో గుర్తుండిపోయే లవ్ స్టోరీస్‌లో ‘ఎపిక్’ కూడా ఉంటుంది. కడలి, ఆదిత్య అందరికీ గుర్తుండిపోతారు’ అని అన్నారు.

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి, రోహన్ తదితరుల

సాంకేతిక బృందం
బ్యానర్‌ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ & సాయి సౌజన్య
రచయిత & దర్శకుడు: ఆదిత్య హాసన్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రాఫర్: అజీమ్ మహ్మద్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో : లక్ష్మీవేణుగోపాల్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఎపిక్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా

‘ఎపిక్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా

by Maari
September 5, 2026
0

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

సినిమా రివ్యూ: మా రాముడు అందరివాడు

by Maari
September 5, 2026
0

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

by Maari
September 5, 2026
0

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

by Maari
September 4, 2026
0

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

by Maari
September 4, 2026
0

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

by Maari
September 4, 2026
0

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

by Maari
September 4, 2026
0

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..  ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

by Maari
September 3, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.