• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, October 10, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

Maari by Maari
October 10, 2026
in Cinema, Latest News, Movies, news, special, sports
0
“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

Share and Enjoy !

Shares
Twitter

“రణబాలి” గ్రేట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది, ఎమోషనల్ గా ఈ చిత్రంతో ఎంగేజ్ అవుతారు, మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో విజయ్ దేవరకొండ.

– పెళ్లి చూపులు తర్వాత నేను కంఫర్ట్ గా ప్రమోషన్ చేస్తూ, రెండు మూడు సార్లు కాపీ చెక్ చేసుకుని, రిలీజ్ కు తీసుకొస్తున్న సినిమా ఇది. మా మూవీ బ్యాక్ డ్రాప్ లోనే చాలా సీజీ వర్క్ ఉంది. ప్రీ ప్రొడక్షన్ టైమ్ లోనే మాకు సీజీ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. ఫిబ్రవరి టైమ్ లోనే సీజీ సీన్స్ అన్నీ ఇచ్చేశాం. సెన్సార్ సర్టిఫికెట్ సోమవారం వస్తుందని అనుకుంటున్నాం. సర్టిఫికెట్ ఏది ఇచ్చినా ఫర్వాలేదు. ఒక్కో సినిమా ఒక్కో కారణం వల్ల చేస్తాం. ఈ సినిమాను ఒక పర్పస్ కోసం చేశాం. రీసెంట్ గా చెన్నైలో ఒక సీనియర్ జర్నలిస్ట్ తో మాట్లాడుతున్నప్పుడు అప్పట్లో బెంగాల్ లో సంభవించిన కరువు గురించి చెప్పారు. ఎంతోమంది ప్రజలు ఆకలితో చనిపోయారట. కొన్ని అమెరికన్ పత్రికల ద్వారా భారతదేశ పరిస్థితి తెలుసుకున్న అమెరికన్లు బ్రిటీషర్లు ఎలాంటి దారుణ పరిస్థితులు సృష్టించారో తెలుసుకుని తమ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం ప్రారంభించారట. మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని ఆ పాత్రికేయుడు నాతో చెప్పాడు.

– చరిత్రలో మన ప్రజలకు జరిగిన అన్యాయాల గురించి తెలుసుకుంటుంటే ఇవన్నీ నిజమా, ఇంత దారుణంగా జరిగాయా అని షాక్ కు గురవుతాం. కొందరికి మనమంటే అసలు లెక్కే కాదు. చెట్లు పుట్టల్లా మనం కూడా వాళ్లకు ఒకటే. అంత తక్కువగా చూసేవాళ్లు. మన దేశ భవిష్యత్ గురించి మనం ఆలోచించాలంటే చరిత్ర తెలియడం ముఖ్యం. ఈ సినిమాను మేము కరెక్ట్ గా అటెంప్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి సినిమాలు వస్తాయి. మన చరిత్రలో రహస్యంగా మనకు తెలియకుండా మిగిలిపోయిన అధ్యాయాలను సినిమా మాధ్యమం ద్వారా వెలికితీసే ప్రయత్నాలు జరుగుతాయి. లేదంటే ఇంకెవరూ ఇలాంటి కథల్ని ముట్టుకోరు. అందుకే ఒక బాధ్యతగా, చాలా జాగ్రత్తగా ఈ సినిమాను రూపొందించాం.

– బ్రిటీషర్స్ ఇక్కడ ఉండిపోదామని రాలేదు. వ్యాపారం కోసం వచ్చారు. ఇప్పటికీ మనలో కొందరు ఇండియన్ రైల్వేస్ బ్రిటీష్ వారు మన కోసం చేశారని అనుకుంటారు. వాళ్లు మన ప్రయాణ సౌకర్యం కోసం రైల్వే లైన్స్ నిర్మించలేదు. మన ధాన్యం, పత్తి, బంగారం..ఇలా మన సంపద దోచుకునేందుకు, రవాణా చేసుకునేందుకు అన్ని ప్రధాన నౌకాశ్రయాలకు రైల్వే లైన్స్ నిర్మించుకున్నారు. 1876 నుంచి 1878 మధ్య కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ లో వచ్చిన కరువు వల్ల 80 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే కావొచ్చు. పాశ్చాత్యులు తయారు చేసిన సాంకేతికత మనకు నిజాలు చెప్పదు. వాళ్ల కోణంలోనే చరిత్రను తెలియజేస్తుంది. ట్రావెన్ కోర్ ప్రాంతంలోనే 65 లక్షల మంది కరువుతో చనిపోయారు. ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఇంత దారుణమైన కరువు వస్తే, ఇంకా చరిత్రలో మనకు తెలియకుండా చేసిన బీహార్, బెంగాల్..ఇలా ఎన్నో కరువు ఘటనలు ఉన్నాయి. వర్షపాతం కారణంగా వచ్చే కరువు వేరు. అప్పుడు స్థానికంగా ఉండే పాలకులు, పెద్దలు రైతులకు, ప్రజలకు పన్నుల భారం తగ్గించేవారు. కానీ బ్రిటీషర్స్ వచ్చాక కరువు ప్రాంతాల్లో రెట్టింపు పన్నులు వసూళ్లు చేయడం ప్రారంభించారు. ఆ ట్యాక్స్ కట్టకుంటే భారీ ప్రాజెక్ట్ లు, రైల్వే లైన్స్ నిర్మించే దగ్గరకు వారిని తరలించి కఠోరమైన పని చేయించేవారు. దానికి నామమాత్రంగా ధాన్యం ప్రతిఫలంగా ఇచ్చేవారు. పనిచేయని వారికి ఆకలితో చావే గతి. చరిత్రలో జరిగిన ఈ దారుణాలు తెలుసుకుంటే మనసు వికలమై పోతుంది.

– ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక సొసైటీగా మన కల్చర్, మన నమ్మకాలు మనల్ని ఒక్కటిగా నిలబెట్టాయి. కాపాడాయి. కరువు వచ్చినప్పుడు గ్రామ దేవతలను కొలిచి, జాతరలు చేసి వచ్చే ఏడాది బాగుంటుంది అని నమ్మేవాళ్లం. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం కావాలనే భావన ప్రజల్లో లేదు. మా ఊరికి ఎవరో విదేశీయులు వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు. మా ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు అంటూ ఎదురుతిరిగేవారు. మన చరిత్రలో ప్రజల కోసం నిలబడిన ఎంతోమంది గొప్ప వీరులు ఉన్నారు. ఈ వీరులంతా మూడు పదుల్లోనే చనిపోయారు. వారే రణబాలికి స్ఫూర్తి. చరత్రలో మరుగుపర్చిన ఈ వీరుల కథలను మన జానపదాల్లో పాడటం వల్ల ప్రజలకు తెలిసింది. ఆ తర్వాత మన దేశ రచయితలు కొందరు వాటిని పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు. ఆ వీరుల గొప్పదనం, మన పూర్వీకులు ఎదుర్కొన్న దారుణాలు, మనం ఒక సొసైటీగా అప్పుడు చేసిన తప్పేంటి, బ్రిటీషర్స్ ఈ విశాల దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు..ఇలా అన్నింటినీ మేము రణబాలి సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించబోతున్నాం.

– వ్యాపారం చేసే కంపెనీల రూపంలో దేశంలోకి వచ్చిన బ్రిటీషర్స్ ఒక రాజు గురించి మరొకరికి చెడుగా చెబుతూ వారి మధ్య గొడవలు పెట్టించి మన అనైక్యతతో ఒక్కో రాజ్యాన్ని సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో మన స్వదేశీయుల దురాశ, తప్పులు, కుట్రలు కూడా ఉన్నాయి. మనకు చరిత్ర పాఠాల్లో ప్లాసీ యుద్ధం, మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరాలు తేదీల గురించి టెన్షన్ పెడుతుంటారు గానీ అప్పుడు మన ప్రజలు పడిన బాధల గురించి తెలుసుకునేలా చేయరు. మనం గతంలో మనకు ఏం జరిగిందో తెలుసుకుని ఫ్యూచర్ లో జరగకుండా చేసుకోవాలి. చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుంటుంది. ఇప్పటికీ అనేక దేశాలు పరస్పరం యుద్ధాలు చేసుకుంటున్నాయి. మన మధ్య కులం, మతం, ప్రాంతం పేరుతో ఉన్న అడ్డుగోడలు ఇంకా ఉన్నాయి.

– రణబాలి సినిమా విజయం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అదే నమ్మకంతో బాగా ప్రమోట్ చేసుకుంటున్నాం. డైరెక్టర్ రాహుల్ అనంతపూర్ లో జరిగే ఒక జాతరలో చేసిన జానపద వీడియో పంపాడు. ఆ వీడియోలో వాళ్లు ఎంతోమంది చారిత్రక వీరుల గురించి గొప్పగా చెబుతూ జానపదాలు చెప్పారు. మా సినిమా కూడా అలాంటి జానపదంతోనే ప్రారంభమవుతుంది. అప్పట్లో మన ఊర్లలో ఉండే వాతావరణం, మన కల్చర్, మన వీరుల గొప్పదనం, చరిత్రలో జరిగింది ఏంటి అనేవి చెబుతూ ఆద్యంతం ఒకే పర్పస్ కోసం ఈ సినిమా చేశాం. ప్రమోషన్స్ లో కూడా మేము ఊరికే హైప్ ను క్రియేట్ చేసేందుకు ప్రయత్నించడం లేదు. జెన్యూన్ గా ట్రైలర్ కట్ చేశాం. మా మూవీకి వెళ్లి థియేటర్ లో కూర్చుంటే ఐదు నిమిషాల్లో ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. మూవీలో టకా టకా సీన్స్ కట్ చేసుకుంటూ వెళ్లడం కాదు ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది.

– ఆ కాలంలో ఉన్న వయలెన్స్ నేపథ్యంగా మా మూవీలో యాక్షన్ సీక్వెన్సులు రూపకల్పన చేశాం. అయితే జరిగినవి ఇంకా ఎక్కువ వయలెంట్ గా ఉండేవి. మేము మా సినిమా కథకు ఎంత కావాలో అంతే డిజైన్ చేసుకున్నాం. అప్పట్లో ఇలా కూర్చుని మాట్లాడుకోవడాలు ఉండేవి కావు. విబేధాలు వస్తే ప్రాణాల మీదకే వచ్చేది. ఇది సాఫ్ట్ గా చెప్పే కథ కాదు, సాఫ్ట్ గా చూపించే ప్రపంచం కాదు. మా సినిమాలో కేవలం యాక్షన్ కోసమే యాక్షన్ సీన్సులు చేయలేదు. అప్పట్లో మనుషులు చాలా మొరటుగా ఉండేవాళ్లు. ఆ స్థాయి హింసను మా సినిమాలో చూపించలేదు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉంటుంది. రణబాలి పాత్రలో నేను కనిపించే విధానం, మాట్లాడే విధానం అన్నీ సహజంగా ఉంటాయి. డైరెక్టర్ రాహుల్ అలా డిజైన్ చేశాడు. మాస్, రియలిస్టిక్ అప్రోచ్ లో రాహుల్ ఈ సినిమా రూపొందించాడు. నేను పదేళ్ల పుట్టపర్తిలో చదువుకున్నా కాబట్టి నాకు రాయలసీమ యాస కొంత పరిచయమే. ఈ సినిమా కోసం పర్పెక్ట్ గా ఉండేలా నేర్చుకున్నాను. తెలంగాణ యాసకు రాయలసీమ యాస దగ్గరగా ఉంటుంది. 2 నుంచి 3 నెలల పాటు యాస, డైలాగ్స్ మీద సాధన చేశాను.

– జయమ్మగా రశ్మిక పేరును డైరెక్టర్ రాహుల్ సూచించాడు. నాకు కూడా ఆమె అయితేనే బాగుంటుంది అనిపించింది. గతంలోనూ నా సినిమాల్లో హీరోయిన్ గా రశ్మిక ప్రస్తావన వచ్చినా ఆ సినిమాలకు తను కరెక్ట్ కాదు అనిపించింది. మేము కలిసి చేసే సినిమా స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. రణబాలి సినిమాలో మా ఇద్దరి మధ్య అలాంటి మంచి డ్రామా ఎమోషన్ ఉంది. మేము కలిసి చేయడం వల్ల ఈ పాత్రలకు ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ వచ్చింది. ఎందుకంటే ఆ పాత్రలపై మా రియల్ లైఫ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు.

– ఈ సినిమా కోసం నేను సీమ యాస నేర్చుకోవడం, హార్స్ రైడింగ్ కోసం కష్టపడ్డాను. నా పాత్ర ఎలా మాట్లాడాలి అనేది రాహుల్ చాలా రీసెర్చ్ చేసి నిర్ణయించాడు. మనం చూస్తుంటాం కొన్ని హీరో క్యారెక్టర్స్ చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాయి. కానీ రణబాలి అలా కాదు అప్పట్లో వీరులు ఎలా మాట్లాడేవారే అంత గట్టిగా మాట్లాడుతుంటాడు. ఈ విషయంలో రాహుల్ చాలా పర్టిక్యులర్ గా ఉన్నాడు. నేను ఏ సినిమాలో నటించినా ఇది నా నిజ జీవిత పాత్ర అని అనుకునే నటిస్తాను. నేను చేసే ప్రతి సినిమా వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపిస్తుంటుంది, నన్ను మారుస్తుంటుంది. రణబాలి ప్రభావం కూడా నాపై వ్యక్తిగతంగా ఉంది.

– రణబాలి సినిమా మీకు గ్రేట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. ఒక ఎమోషనల్ హై ఇస్తుంది. ఆద్యంత ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక మన చరిత్ర, కల్చర్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ డైరెక్టర్ రాహుల్. నేను, ప్రొడ్యూసర్స్ మా ఇన్ పుట్స్ ఇస్తుంటాం కానీ ఆయన అన్నీ తానై చూసుకున్నారు. ప్రతి పాత్రకు పర్పెక్ట్ కాస్టింగ్ పెట్టుకున్నాడు రాహుల్. ఆర్నాల్డ్ వోస్లూ మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. నా కాలేజ్ రోజుల్లో టికెట్ హైక్ వల్ల కొన్ని సినిమాలు చూడలేక బాధపడ్డాను. ఒక హీరోగా నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచడం నాకు ఇష్టం ఉండదు. రణబాలి నుంచి నా రాబోయే ఏ సినిమాకూ టికెట్ హైక్స్ ఉండవు. రాజమౌళి గారితో సినిమా చేస్తే తప్ప నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచము. రాహుల్ సంకృత్యన్ నాతో రాయలసీమ యాసలో సినిమా చేస్తే, రవి కిరణ్ కోలా గోదారి జిల్లా నేపథ్యంతో సినిమా చేస్తున్నాడు. వాళ్ల యాసలో నన్ను హీరోయిక్ గా చూపిచడానికి ఆ దర్శకులు ఇష్టపడుతున్నారు. డివోషనల్ గా ఏదైనా బయోపిక్ చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

by Maari
October 10, 2026
0

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

by Maari
October 10, 2026
0

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

by Maari
October 10, 2026
0

చకోర మూవీ రివ్యూ: ప్రేమ, మిస్టరీతో ఆకట్టుకుందా?

చకోర మూవీ రివ్యూ: ప్రేమ, మిస్టరీతో ఆకట్టుకుందా?

by Maari
October 9, 2026
0

అనకాపల్లి మూవీ రివ్యూ: రా అండ్ రస్టిక్ లవ్‌కి యాక్షన్, ఎమోషన్ జోడించిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

అనకాపల్లి మూవీ రివ్యూ: రా అండ్ రస్టిక్ లవ్‌కి యాక్షన్, ఎమోషన్ జోడించిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

by Maari
October 3, 2026
0

తెల్లకాగితం(Thella Kaagitham Review)రివ్యూ:మంచి సందేశం ఇచ్చే ఎమోషనల్ టీనేజ్ ప్రేమకథ!

తెల్లకాగితం(Thella Kaagitham Review)రివ్యూ:మంచి సందేశం ఇచ్చే ఎమోషనల్ టీనేజ్ ప్రేమకథ!

by Maari
October 2, 2026
0

తత్వం(Tatwam Movie Review) మూవీ రివ్యూ: మిస్టరీతో పాటు మనిషి ఆలోచనలను ప్రశ్నించే ఆసక్తికరమైన థ్రిల్లర్!

తత్వం(Tatwam Movie Review) మూవీ రివ్యూ: మిస్టరీతో పాటు మనిషి ఆలోచనలను ప్రశ్నించే ఆసక్తికరమైన థ్రిల్లర్!

by Maari
October 2, 2026
0

‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ విడుదల

‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ విడుదల

by Maari
September 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.