• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, October 24, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

Maari by Maari
October 24, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

Share and Enjoy !

Shares
Twitter

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “రణబాలి” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో “రణబాలి” రణభేరి ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – ఈ రోజు మా రణభేరి ఈవెంట్ కు భారీ సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మా రణబాలి సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మన సినిమా జనాల్లో ఉంది అని మా డిస్ట్రిబ్యూటర్ శశి గారు, మా ప్రొడ్యూసర్ రవి గారు చెప్పడం సంతోషంగా ఉంది. అన్నారు.

నటి ఈశ్వరీరావు మాట్లాడుతూ – వందలమంది కష్టపడితే దక్కిన విజయం ఇది. ఎవరెన్ని నెగిటివ్ ప్రచారాలు చేసినా అసలైన విజయాన్ని ప్రేక్షకులే మాకు అందించారు. మీ అందరికీ మా సినిమా టీమ్ అంతా రుణపడి ఉంటాం. అన్నారు.

ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ – రణబాలి విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. మనం చేసిన సినిమా హిట్ అయి, ప్రశంసలు తీసుకొచ్చి, మంచి వసూళ్లు అందిస్తే అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆ విజయం కోసమే మేమంతా పనిచేసేది. రణబాలిని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. ఇలాంటి కథ చెప్పాలనేది మా డైరెక్టర్ రాహుల్ విజన్. రణబాలి పాత్రకు పూర్తి న్యాయం చేశారు మా హీరో విజయ్ దేవరకొండ. జయమ్మగా రశ్మిక జీవించారు. ఇది రెగ్యులర్ మూవీ కాదు. ఒకరకంగా ప్రయోగాత్మక చిత్రం. మా మూవీ మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా సాయంత్రం నుంచి పుంజుకుంది. ఇంకా చాలా రోజుల థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ కాబోతోంది. విజయ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రణబాలి నిలిచింది. మేము విజయ్ గారితో చేసిన డియర్ కామ్రేడ్, ఖుషి కంటే రణబాలి పెద్ద విజయాన్ని సాధిస్తోంది. కలెక్షన్స్ తో పాటు అప్రిషియేషన్స్ రావడం రణబాలి విషయంలో జరుగుతోంది. అన్నారు.

ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ – అనంతపురంలో మన సినిమా ఈవెంట్ పెట్టాలనేది విజయ్ గారి కోరిక. ఆయనే పట్టుదలగా ఇక్కడ వేడుక జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులకు, మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడం వల్లే ఈ రోజు రణబాలి ఇంత బాగా వచ్చింది. రణబాలి సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే రాయలసీమ నుంచి ఓవర్ ఫ్లోస్ వస్తున్నాయి. మీరు అంతగా మా సినిమాపై ప్రేమ చూపిస్తున్నారు. అన్నారు.

హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – మీ అందరినీ ఈవెంట్ లో మిస్ అవుతున్నా. బాంబేలో ఒక షూటింగ్ లో ఉండిపోయి అనంతపురం రాలేకపోయాను. రణబాలి సినిమాపై మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. మీరు సోషల్ మీడియాలో చేస్తున్న రీల్స్, పోస్టులు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. జయమ్మ పాత్రను మీరు ఎంతో ఇష్టపడుతుండటం సంతోషంగా ఉంది. అన్నారు.

డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ – నేను పుట్టి పెరిగింది చదువుకుంది రాయలసీమలో. ఇక్కడే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చూశాను. నేను సినిమాలను ఎంజాయ్ చేసిన థియేటర్స్ లో నా దర్శకత్వంలో వచ్చిన సినిమా హౌస్ ఫుల్స్ తో ప్రదర్శింపబడటం చాలా సంతోషంగా గర్వంగా ఉంది. సీమ ఆడియెన్స్ సినిమాను ఎంతో ప్రేమిస్తారు. చరిత్రలో మరుగున పడిన ఘటనలను సినిమాగా తెరకెక్కించడం అరుదు. హిస్టరీని నేపథ్యంగా తీసుకుని ఇలాంటి పెద్ద స్టార్స్ ను పెట్టుకుని కమర్షియల్ భారీ సినిమా రూపొందించడం సులువైన పని కాదు. మా టీమ్ అందరి సపోర్ట్ తో నేను చేయగలిగాను. ఎంతోమంది మినిమమ్ సెన్స్ లేకుండా మా సినిమాను నెగిటివ్ చేయాలని చూశారు. అయినా మంచి సినిమాను ఎవరూ ఆపలేరని మరోసారి ప్రూవ్ అయ్యింది. అన్ని ప్రాంతాల నుంచి మా సినిమాకు మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. నా జ్ఞాపకాలు అన్నింటినీ పెట్టి రాసిన స్క్రిప్ట్ ఇది. అందుకే మా సినిమాలో మన కల్చర్ అంత అందంగా కనిపిస్తోంది. నేను పుట్టిన నేల రుణం రణబాలి ద్వారా కొంత తీర్చుకున్నానని భావిస్తున్నా. రణబాలిగా విజయ్ దేవరకొండ ఎంత గొప్పగా పర్ ఫార్మ్ చేశాడో మీరంతా చూశారు. చిరంజీవి, బాలకృష్ణ గారు సీమ యాసను ఎంత అవలీలగా చెప్పారో విజయ్ గారు కూడా అలాగే చెప్పారు. ఆయన డైలాగ్స్ కు విజిల్స్ పడుతున్నాయి. అన్నారు

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – తెలుగు గడ్డ ఎంతో గొప్పది, అందమైనది, ఎంతో చరిత్ర ఉన్నది. రకరకాల పండుగలు, పద్దతులు, యాసలు, మనుషులు ఉన్న నేల మనది. నేను పుట్టిన తెలంగాణలో ఒక ఆవేశం ఉంటుంది, తిరగబడే పోరాటం ఉంటుంది, ఫోక్ సాంగ్స్ లో మజా ఉంటుంది. ఆంధ్ర వెళ్తే చక్కటి వాతావరణం, మంచి మనుషులు, ఆప్యాయత, వాళ్లు జరుపుకునే అందమైన పండుగలు, మంచి ఫోక్ సాంగ్స్ ఉంటాయి. సీమకు వస్తే రణబాలిలో రాయలు ఏలిన సీమ గడ్డ అంటూ ఒక పాట ఉంది. అది నాకు చాలా ఇష్టం. ఈ నాలుగు లైన్ల పాట మన సీమ ఎలాంటిదో చూపిస్తాయి. ఈ రాయలసీమ నాకు ఎంతో ఇచ్చింది. నేను చదువుకుంది ఇక్కడే. ఇక్కడ కొత్త చెరువు అనే ఊరిలో ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ లో సినిమాలు చూశాను. ఇప్పుడు మా రణబాలి సినిమా అదే కొత్త చెరువు థియేటర్ లో హౌస్ ఫుల్స్ అవుతుంటే ఎంత అనందంగా ఉందో చెప్పలేను. నేను ప్రయాణం చేసిన అనంతపురం, కర్నూలు, కడప లోనే మా సినిమా షూటింగ్ చేశాం. చిత్రీకరణ సమయంలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేవి. రణబాలి సినిమాను ఒక నటుడిగా చేయలేదు. ఈ నేల కథను చెప్పాలనే బాధ్యతతో చేశాను. నాకు ఎంతో ప్రేమను పంచిన రాయలసీమ రుణం తీర్చుకోవాలనే కృతజ్ఞతతో రణబాలి సినిమా చేశాను. ఒక పెద్దాయన మా వీరుల కథ చెప్పావు బిడ్డా అని చేయి పట్టుకుని మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. మమ్మల్ని మేము తెరపై చూసుకున్నట్లు ఉందని మీరంతా చెబుతున్నారు. మీ ఆదరణతో వచ్చే తృప్తి ఏ డబ్బూ, ఏ అవార్డు ఇవ్వదు. రణబాలి సినిమాను మీరు ఇంతగా అక్కున చేర్చుకోవడం నటుడిగా నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది. తెలుగు సినిమా గర్వపడేలా రణబాలి ఉంటుందని చెప్పాను. ఆ మాటను మీరు నిజం చేశారు. రాహుల్ ఎంత గొప్ప సినిమా చేశాడో భవిష్యత్ లో అందరికీ అర్థమవుతుంది. జయమ్మపై మీరు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు నాపై పదేళ్లుగా ప్రేమ చూపిస్తున్నారు. ఇటీవల ఆ ప్రేమను మరింతగా చూస్తున్నా. అన్నారు

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

Next Post

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

Next Post
‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

'ఆదర్శ కుటుంబం' సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
October 24, 2026
0

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

by Maari
October 24, 2026
0

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

by Maari
October 24, 2026
0

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

by Maari
October 24, 2026
0

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

by Maari
October 23, 2026
0

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
October 22, 2026
0

‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియ‌ర్ ల‌వ్ స్టోరి.. మ‌ళ్లీ అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియ‌ర్ ల‌వ్ స్టోరి.. మ‌ళ్లీ అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

by Maari
October 17, 2026
0

ఆలోచింపజేసే సరికొత్త కథాంశంతో ‘3 2 1’.. అక్టోబరు 23న గ్రాండ్ రిలీజ్

ఆలోచింపజేసే సరికొత్త కథాంశంతో ‘3 2 1’.. అక్టోబరు 23న గ్రాండ్ రిలీజ్

by Maari
October 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.