• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, October 24, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

Maari by Maari
October 24, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

Share and Enjoy !

Shares
Twitter

* డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “ఇడుపు కాయితం” సినిమా నుంచి ‘గడప..’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

లిరిసిస్ట్ అలరాజు మాట్లాడుతూ – నేను చిత్ర పరిశ్రమలో ఇప్పటిదాకా వంద పాటలకు సాహిత్యం అందించాను. ఆ వంద పాటలు ఒకెత్తు ఈ సినిమాలో శ్రీలత సాంగ్ మరో ఎత్తు. అంత గుర్తింపు నాకు తీసుకొచ్చిందా పాట. ఈ అవకాశం కల్పించిన మా దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అన్నారు.

లిరిసిస్ట్ అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ – ఈ సినిమా గడప సాంగ్ రాసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భం అన్ని సినిమాల్లో ఉండదు. గడప అనేది మన వారసత్వానికి చిరుమానా లాంటిది. ఈ పాటను సురేష్ బొబ్బిలి ఎంతో అందంగా కంపోజ్ చేశారు. అన్నారు.

సింగర్ తేలు విజయ మాట్లాడుతూ – నేను వేల ఫోక్ సాంగ్స్ పాడాను. ఊళ్లలో పెళ్లిల్లలో కూడా పాటలు పాడాను. కానీ నాకు ఈ పాట మంచి గుర్తింపు తీసుకొస్తోంది. ఈ పాట నేను పాడితే బాగుంటుందని తమ్ముడు సురేష్ బొబ్బిలి అవకాశం ఇచ్చాడు. ఈ పాటలో లిరిక్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అన్నారు.

సింగర్ శంకర్ బాబు మాట్లాడుతూ – ఈ సినిమాలో శ్రీలత సాంగ్ పాడాను. పుష్పలో సాంగ్ పాడిన తర్వాత మళ్లీ ఒక మంచి సాంగ్ పాడే అవకాశం వస్తే బాగుండేది అనుకున్నాను. అదే టైమ్ లో సురేష్ బొబ్బిలి పిలిచి శ్రీలత సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు. అన్నారు.

యాక్టర్ మైమ్ మధు మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాను. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ సినిమా సెట్ ను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. ఆ వాతావరణంలోకి వెళ్లగానే నిజంగా ఆ కథ జరిగే ప్రాంతానికి వెళ్లిన ఫీల్ కలిగింది. అలాగే మా డైరెక్టర్ రాసుకున్న బ్యూటిఫుల్ స్క్రిప్ట్ నటులుగా మమ్మల్ని తట్టిలేపింది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. అన్నారు.

యాక్టర్ వినోద్ బాల మాట్లాడుతూ – నేను ఇటీవల కొంతకాలంగా నటనకు విరామం ఇచ్చాను. దర్శకుడు వంశీరెడ్డి వచ్చి ఈ కథలో ముఖ్యమైన పాత్ర మీదేనని చెప్పి ఒప్పించాడు. ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించాను. షూటింగ్ టైమ్ లో తెలంగాణ మట్టి వాసన, ఆ మంచి వాతావరణాన్ని మా టీమ్ అంతా ఫీల్ అయ్యాం. అన్నారు.

యాక్టర్ అభినవ్ గోమటం మాట్లాడుతూ – ఈ సినిమా తెలంగాణ నేపథ్యంగా సాగే మంచి కుటుంబ కథా చిత్రం. ఇందులోని శ్రీలత సాంగ్ నాకు చాలా ఇష్టం. నేను బీట్ ఓరియెంటెడ్ సాంగ్స్ వింటుంటా కానీ ఈ చిత్రంలోని సాంగ్స్ లిరికల్ గా కూడా ఆకట్టుకున్నాయి. ప్రియదర్శి మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు. ఆయన బలగం, కోర్ట్ చిత్రాల్లా ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – “ఇడుపు కాయితం” అనే గొప్ప సినిమాకు వర్క్ చేసే అవకాశం కల్పించిన మా దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. శ్రీలత సాంగ్ కు అలరాజు ఎంత మంచి లిరిక్స్ అందించారో ఈ గడప పాటకు అభినయ శ్రీనివాస్ అంతే మంచి లిరిక్స్ అందించారు. మా విజయ అక్క బాగా పాడారు. ఈ సినిమా సాంగ్స్, మ్యూజిక్ మీకు ఒక స్పెషల్ మెమొరీగా గుర్తిండిపోతాయి. అన్నారు.

డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ – మా ప్రొడక్షన్ హౌస్ సహకారంతో 31 రోజుల ఔట్ డోర్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాం. ప్యాషన్ ఉన్న యంగ్ టీమ్ అంతా మా మూవీకి హార్డ్ వర్క్ చేశారు. షూటింగ్ ఎలా జరుగుతోంది, సీన్స్ ఎలా వస్తున్నాయి అని బన్నీ వాస్ గారు రోజూ అడిగి తెలుసుకునేవారు. సినిమా కోసం ఏది కావాలన్నా మా ప్రొడ్యూసర్స్ మీ ఇష్టం అనేవారు. అంత సహకారం అందించారు. ఈ వేదిక మీద తెలంగాణ కళాకారులను అందరినీ చూస్తుంటే ఎమోషనల్ అవుతున్నా. మా అందరిలో సహజంగానే తెలియని ఉద్వేగం ఉంటుంది. మా కళాకారులను ఈ వేదిక మీద చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మా మూవీ టైటిల్ గురించి కూడా చాలా వివాదాలు వచ్చాయి. అయినా ఏ రోజూ మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా కోసం ఎవరినీ తీసుకున్నా నన్ను ప్రశ్నించలేదు. అన్నారు.

హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ – “ఇడుపు కాయితం” సినిమాకు వర్క్ చేస్తున్న క్రమంలో ఇది నాకొక ముఖ్యమైన రోజు అనుకుంటున్నా. గడప సాంగ్ మీ అందరికీ కనెక్ట్ అయ్యిందని నమ్ముతున్నాను. ఇంట్లో ఏ పనిచేసినా అమ్మ నీకు పెళ్లై అత్తవారింటికి వెళ్తే తెలుస్తుంది అనేది ఆ మాట ఈ సినిమాలో శ్రీలత పాత్రలో నటిస్తున్నప్పుడు గుర్తొచ్చేది. గడప సాంగ్ ప్రోమో రిలీజ్ కాగానే మా నాన్న ఫోన్ చేసి బాగా నటించావు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగదుర్గ నుంచి శ్రీలతగా మారేందుకు చాలా కష్టపడ్డాను. ఆ కష్టాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. శ్రీలత అంటే మా ఇంటి అమ్మాయి మీ ఇంటి అమ్మాయి అందరి ఇళ్లలో ఉండే అమ్మాయి. ప్రాంతీయ బేధం లేకుండా నా పాత్రను మీరంతా ఇష్టపడతారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – “ఇడుపు కాయితం” సినిమా పూజా కార్యక్రమాలు చేసి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ గా చాలా మంది స్పందించారు. ఈ సినిమాకు సబ్ టైటిల్స్ వేస్తారా, తెలుగులో డబ్ చేస్తారా అని కామెంట్స్ చేశారు. ఆ టైమ్ లో మేము తప్పు చేస్తున్నామా అని అనిపించిది. ఈ నెగిటివిటీ చూసి బాధకు లోనయ్యాం. కానీ మీడియా నుంచి ఇండస్ట్రీ నుంచి చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చారు. వారి సపోర్ట్ తో నెగిటివ్ ను పాజిటివ్ చేసుకోవచ్చు అనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే ఈరోజు మీ అందరినీ మా గడప లోకి ఆహ్వానిస్తున్నాం. మా అమ్మ తన ఇంటి గడప దాటి మా ఇంటికి వచ్చింది, అలాగే నా సోదరి, నా భార్య..ఇలా మన ఇంటిలో గడప గురించి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి గడపను సెలబ్రేట్ చేసే పాట ఉంది. మీరు నేటివిటీ గురించి ఆలోచించినా మావైపు ఒకసారి చూడండి. ఈ పాట వినండి. మీ ఆ ప్రేమను ఫీల్ అవుతారు. డిసెంబర్ 11న మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఏ ప్రాంతమైనా భాషైనా మీకు మా సినిమా నచ్చుతుంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ బన్నీవాస్ మాట్లాడుతూ – ఈ రోజు నాకు ప్రత్యేకమైన రోజు. శ్రీలత సాంగ్ ను మీతో పాటు తెరపై చూశాను. ఆ పాటలో నా కూతురు కూడా ఉంది. తనను స్క్రీన్ మీద చూడటం ఇదే తొలిసారి. వినోద్ బాల పాత్రకు ప్రతి భర్త కనెక్ట్ అవుతాడు. వినోద్ బాల ప్రియదర్శికి తండ్రి పాత్రలో నటించాడు. ఆయన చెప్పే ఎక్సిపీరియన్స్ తో చెప్తున్నారా వెళ్లకు అనే డైలాగ్ ఫేమస్ అవుతుంది. నేను గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాను. దర్శకుడు వంశీరెడ్డి ఈ కథ చెబుతున్నప్పుడు తెలంగాణ నేపథ్యం అనేది గుర్తుకురాలేదు. నాకు నా చిన్నప్పుడు చూసిన ఊరి, ఇంటి వాతావరణం కళ్లకు కట్టినట్లు కనిపించింది. కొత్తగా పెళ్లయిన ఇంట్లో ఏం జరుగుతుంది. ఒక నీటి పంపు దగ్గర ఏం జరుగుతుంది. ఇలా.. మన ఇంటి కథ చెప్పినట్లు అనిపించింది. కథ విన్న వింటనే ఇది సినిమా కథలా లేదు మన ఇంట్లో జరిగే కథలా ఉంది అని చెప్పాను. ఈ సినిమా కథ, మాటలు, నేపథ్యంలోని సహజత్వమే మా అందరినీ ఆకట్టుకుంది. సుకుమార్ గారు, తబిత గారి సపోర్ట్ లేకుంటే ఈ సినిమా ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యేది కాదు. నా కెరీర్ లోనే వేగంగా నిర్మించిన సినిమా ఇది. అది నా గొప్పదనం కాదు ఈ సినిమాకు వర్క్ చేసిన యంగ్ స్టర్స్ గొప్పదనం. కొత్తగా పెళ్లయ్యే ఏ అమ్మాయినైనా గడప సాంగ్ లోని లిరిక్స్ బాగా ఆకట్టుకుంటాయి. కొత్త జంటలు మీ అత్తా మామను తీసుకుని డిసెంబర్ లో మా సినిమా చూసేందుకు రండి. థియేటర్ నుంచి బయటకు వెళ్లేప్పుడు వాళ్లు మీ భుజాలపై చేయి వేసి తీసుకెళ్తారు. మీ పెళ్లైన కొత్తలో మా “ఇడుపు కాయితం” సినిమా చూస్తే మీరు ఇంకెప్పుడు ఇడుపు కాయితం గురించి ఆలోచించరు. అన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

Next Post

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Next Post
‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
October 24, 2026
0

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

by Maari
October 24, 2026
0

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

by Maari
October 24, 2026
0

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

by Maari
October 24, 2026
0

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

by Maari
October 23, 2026
0

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
October 22, 2026
0

‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియ‌ర్ ల‌వ్ స్టోరి.. మ‌ళ్లీ అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియ‌ర్ ల‌వ్ స్టోరి.. మ‌ళ్లీ అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

by Maari
October 17, 2026
0

ఆలోచింపజేసే సరికొత్త కథాంశంతో ‘3 2 1’.. అక్టోబరు 23న గ్రాండ్ రిలీజ్

ఆలోచింపజేసే సరికొత్త కథాంశంతో ‘3 2 1’.. అక్టోబరు 23న గ్రాండ్ రిలీజ్

by Maari
October 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.