• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, October 24, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రివ్యూ: ఈ తరానికి సందేశం ఇచ్చే… జయహో రామానుజ(Jayaho Ramanuja Review)

Maari by Maari
October 24, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, Reviews, special, sports
0
రివ్యూ: ఈ తరానికి సందేశం ఇచ్చే… జయహో రామానుజ(Jayaho Ramanuja Review)

Share and Enjoy !

Shares
Twitter

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “జయహో రామానుజ”(Jayaho Ramanuja). సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక ఈ సినిమాను నిర్మించారు. అమెరికాకు చెందిన నటి జో శర్మ ఇందులో హీరోయిన్ గా నటించారు. సుమన్, ప్రవళ్లిక, గురురాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సమాజంలో కుల మతబేధాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని లోకానికి చాటిచెప్పిన శ్రీ రామానుజాచార్యుల వారి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని తెరక్కెన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలావుందో రివ్యూలో చూద్దాం పదండి.

కథ: 11వ శతాబ్దంలో భూలోకంలో కులమతబేధాలతో మానవులు ఒకరినొకరు కొట్టుకుంటూ… చంపుకుంటూ నిత్యం కలహాలతో జీవనం సాగిస్తుంటారు. ఇది చూసిన శ్రీమహావిష్ణువు… మానవులంతా ఒక్కటే… వీరి మధ్య తారతమ్మ బేధాలు లేకుండా చేసి… వారిని సుఖంగా ఉంచాలనే తలంపుతో… ఆయన అంశతో తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో శ్రీరామానుజాచార్యుల వారిని ఓ సాంప్రదాయ బ్రాహ్మణ దంపతులు చేసిన పుత్రకామేష్ఠి యాగం ఫలితంగా జన్మించేలా చేస్తాడు. అలా జన్మించిన శ్రీ రామానుజాచార్యులు తండ్రి సంరక్షణలోనే వేదాలను పఠిస్తాడు. ఆ తరువాత కంచికి యాదవ ప్రకాశుల వద్ద వేదాలను పఠించడానికి బయలుదేరుతారు. అలా బయలుదేరిన శ్రీరామానుజాచార్యుల వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? ఆయనకు ఎదురైన అడ్డంకులు ఏంటి? సమాజంలో మానవులంతా ఒక్కటే… అన్ని కులాలు, మాతాలు ఒక్కటే అని చాటి చెప్పడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆయన అనుకున్నది చివరకు ఎలా సాధించగలిగారు అనేది తెలియాలంటే ఈ పౌరాణిక సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: రామానుజాచార్యుల వారి జీవితం గురించి ఈ తరానికి తెలియకపోవచ్చేమో గానీ… పాత తరానికి ఆయన జీవితం తెరిచిన పుస్తకం. అలాంటి మహానుభావుడి జీవితకథను తెరమీద ఆవిష్కరించడం అంటే గొప్ప సాహసమే అనుకోవాలి. ఈ చిత్రంలో ప్రధాన టైటిల్ పాత్ర పోషించిన లయన్ సాయి వెంకట్ తనే దర్శకత్వం వహించి రామానుజా చార్యుల వారి జీవితాన్ని తెరమీద ఎంతో ఆధ్యాత్మికంగా తెరమీద ఆవిష్కరించారు. ఆయన జీవితాన్ని నేటి యువతకు తెలియజేయాలనే తలంపుతో ఎంతో శ్రమించి సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారనేదాన్ని కొన్ని ముఖ్యగట్టాలను ఎంచుకుని తెరమీద చూపించారు.
ముఖ్యంగా కంచి రాజుకుమార్తే ఓ దుష్టశక్తి వల్ల పీడించబడుతుంటే… ఆ దుష్టశక్తి నుంచి ఆమెను కాపాడే ఘట్టం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందుకోసం గ్రాఫిక్స్ కూడా చాలా క్వాలిటీగా చేయించారు. ఎక్కడా అసహజత్వం లేకుండా ఉన్నతంగా ఈ సీన్ ను తీర్చిదిద్దారు. అలాగే శ్రీమహా విష్ణువు దశావతారాలను కూడా చాలా ఎఫెక్టివ్ గా చూపించారు. అలాగే ప్రీ క్లైమాక్స్ లో చంద్రగిరి మహారాజు సమక్షంలో కలియుగదైవం అయిన శ్రీవేంకటేశ్వరుడు ఏ వర్గానికి చెందిన వారని శ్రవైష్ణవులకు, శివ భక్తులకు మధ్య జరిగే వాదనను అష్టాదశపురాణాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ… చివరకు శ్రీ వేంకటేశ్వరుడు ఏ వర్గానికి చెందిన వారనేదాన్ని చాలా బాగా చంద్రగిరి మహారాజు చేత చెప్పించి… బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయండనే చెప్పే ఘట్టం కూడా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇలాంటివి ఇందులో చాలానే వున్నాయి. చరిత్రలో దాగి వున్న ఇలాంటి సున్నితమైన, సంక్లిష్టమైన అంశాలను అన్ని వర్గాల వారు ఆమోదించేలా ‘జయహో రామానుజ’ మూవీలో చూపించారు.

లయన్ సాయి వెంకట్ ప్రధాన పాత్రలో బాగా ఒదిగిపోయారు. అలాగే శ్రీమహావిష్ణువు పాత్రలో ఆధ్యాత్మికంగా కనిపించి మెప్పించారు. అలాగే దశావతారాలను పోషించి ఆయన పలికిన సంభాషణలు బాగున్నాయి. ఆయనతో పాటు నటించిన జోశర్మ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. ఢిల్లీ సుల్తాన్ పాత్రలో సుమన్ కూడా ఆకట్టుకున్నారు. ఇలాంటి పాత్రను సుమన్ పోషించడం కొంచం సాహసమే అయినా… సుమన్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. అలాగే ప్రవల్లిక కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. నిర్మాత గురురాజ్ కూడా సమాజంకోసం తిరు మంత్రోపదేశం ఉపదేశించే గురువు పాత్రలో నటించి సినిమాను మరింత రక్తికట్టించారు. మిగతా పాత్రల్లో నటించిన వారంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఈ చిత్రానికి కథానాయకుడే దర్శకుడు, ఆయన కుటుంబ సభ్యులే నిర్మాత కావడంతో సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. శ్రీరామానుజాచార్యుల వారి జీవిత చరిత్రను ఏదైతే వెండితెరపై చూపించాలనుకున్నారో… దాన్నే చక్కగా… ఆధ్యాత్మికతను జోడించి ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చూపించారు. ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను బేస్ చేసుకుని తెరమీద చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి పాటలు చాలా ప్లస్. ఆయన మహత్మ్యాన్ని తెలియజేసేలా పాటలున్నాయి. అవి సినిమాను ముందుకు నడిపించడంలో ఎంతో ఉపయోగపడతాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ జర్కులు లేకుండా ఇంకాస్త బాగా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీరామానుజాచార్యుల వారి జీవితాన్ని ఈతరానికి పరచయం చేయడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ఈచిత్రానికి ‘అవతార్ రామానుజ2’ పేరుతో సీక్వెల్ కూడా ఉన్నట్టు చివర్లో హింగ్ ఇచ్చారు.ఈ వారం విడుదలైన ఈ పౌరాణికత్వం మేళవించిన నిర్మించిన ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని ఓసారి వెళ్లి చూసేయండి.
రేటింగ్: 3/5

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రివ్యూ: ఈ తరానికి సందేశం ఇచ్చే… జయహో రామానుజ(Jayaho Ramanuja Review)

రివ్యూ: ఈ తరానికి సందేశం ఇచ్చే… జయహో రామానుజ(Jayaho Ramanuja Review)

by Maari
October 24, 2026
0

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
October 24, 2026
0

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

by Maari
October 24, 2026
0

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

by Maari
October 24, 2026
0

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

by Maari
October 24, 2026
0

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

by Maari
October 23, 2026
0

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
October 22, 2026
0

‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియ‌ర్ ల‌వ్ స్టోరి.. మ‌ళ్లీ అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియ‌ర్ ల‌వ్ స్టోరి.. మ‌ళ్లీ అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

by Maari
October 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.