• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, October 27, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“కిల్లర్” ఫీమేల్ సెంట్రిక్ మూవీ… మూవీ చూసాక ఒడిస్సీతో పోల్చుకుంటారు- డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Maari by Maari
October 27, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
“కిల్లర్” ఫీమేల్ సెంట్రిక్ మూవీ… మూవీ చూసాక  ఒడిస్సీతో పోల్చుకుంటారు- డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Share and Enjoy !

Shares
Twitter

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. “కిల్లర్” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో “కిల్లర్” మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

– “కిల్లర్” రిచ్ కంటెంట్ ఉన్న సినిమా. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూశాక సెన్సార్ వాళ్ల మొహాలు ఆహ్లాదకరంగా కనిపించాయి. అంటే మా మూవీ వారికి నచ్చిందని అనుకున్నాం. మా సినిమాలో బ్లడ్ షెడ్ లేదు. రక్తం చూస్తే నాకే కళ్లు తిరుగుతాయి. కథలో హింస ఉన్నా, అది పాత్రలు ఎదుర్కొనే దాంట్లో కనిపించాలి గానీ పాత్రలను చిత్రహింసలు పెట్టినట్లు చూపించడం నాకు నచ్చదు. వాంపైర్ పాత్రను కూడా అలాగే అందరు చూసేలా ట్రీట్ చేశాం. మూవీలో టెర్రరిస్ట్ పాత్ర పది నిమిషాలు కనిపిస్తుంది మళ్లీ కనిపించదు. స్పై, వాంపైర్ పాత్రలు కూడా అలాగే ఉంటాయి. మళ్లీ ఆ పాత్రలు ఎక్కడా కనిపించవు.

– మా సినిమా టీమ్ లోని వారు మా కిల్లర్ మూవీని క్రిస్టోఫర్ నొలన్ ఒడిస్సీ సినిమాతో పోల్చారు. అది కొంచెం అతి అనిపించవచ్చు కానీ మా మూవీ చూసి బయటకు వచ్చాక ఒడిస్సీతో మీరే పోల్చుకుంటారు. మా సినిమాను ఒడిస్సీతో పోల్చడం ఒక స్పాయిలర్ కూడా. కొన్నేళ్ల కిందట నేను స్క్రూడ్ అనే కాన్సెప్ట్ తో కథ రాసుకున్నాను. అది అప్పటికి నాకున్న రిసోర్సెస్ కు రూపొందించడం కుదరలేదు. అదే స్క్రిప్ట్ ను ఇప్పుడున్న ఆడియెన్స్ టేస్ట్ కు తగినట్లు మార్పులు చేసి కిల్లర్ సినిమా రూపొందించాను. విజువల్ గా ప్రేక్షకులు తెరపై చూసే ఏదైనా మంచి క్వాలిటీతో ఉండాలనేది మేకర్ గా నా అభిప్రాయం. సినిమాకు కంప్లీట్ స్క్రిప్ట్ అయ్యాకే మిగతా వాటి గురించి ఆలోచిస్తా. ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ.

– కిల్లర్ సినిమాలో ప్రతి పాత్ర ఆర్ లెటర్ తోనే స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ రూట్ అనే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. హీరోయన్ జ్యోతి చేసిన రక్తిక, రనైన, రియా..ఇలా పేర్లు ఆర్ తో ఉంటాయి. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, నటుడిగా మూడు బాధ్యతలు తీసుకున్నాను. ఏ పని చేస్తున్నప్పుడు ఆ బాధ్యతనే నిర్వర్తించాను. చిత్ర పరిశ్రమలో నాకున్న అనుభవం ఈ మూడు రోల్స్ ప్లే చేసేలా ఉపయోగపడ్డాయి. ఇంకో ఆరేడు క్రాఫ్ట్స్ డీల్ చేయాలన్నా చేస్తాను. అది సినిమా మేకింగ్ మీద నాకున్న ప్యాషన్.

– నేను రూపొందించిన మాస్టర్ పీస్, మాటరాని మౌనమిది, శుక్ర సినిమాల్లో కొత్తవాళ్లకే అవకాశాలు కల్పించాను. ఈ సినిమాలో ఒక పాత్ర నేను చేయాలనిపించింది. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. స్కూల్ లో కల్చరల్ ఈవెంట్స్ చేసేప్పుడు వాటిలో పర్ ఫార్మ్ చేసేవాడిని. నేను పార్టిసిపేట్ చేస్తే కలిసొస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఈ సినిమాకు ఆ పాజిటివ్ నెస్ కూడా పనిచేస్తుందని భావిస్తున్నా. ఈ సినిమాలో నా పాత్రకే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి.

– మా సినిమా సెకండాఫ్ లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాం. ఇది ప్రమోషనల్ స్టంట్ అనుకుంటారు. ఒక మనిషిని నమ్మడానికి కొన్నేళ్లు పడుతుంది. దీని మీద ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. హైకోర్టు లాయర్స్ కూడా అందులో పాల్గొంటారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమియర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్ లో ఎల్ ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తాం. మా సినిమాకు ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని చెప్పాను. కానీ పదీ పదిహేను కోట్లు అని కూడా చెప్పొచ్చు. విజువల్స్, వీఎఫ్ఎక్స్ అంత రిచ్ గా ఉన్నాయి. మేము చెప్పినదానికంటే ఇంకా కొన్ని లక్షలు ఎక్కువే బడ్జెట్ అయ్యింది. మేము కోటి రూపాయల గిఫ్ట్ అనౌన్స్ చేయడం జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. మా సినిమా స్టోరీ చెబుతూ నాకు ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే అంత ఈజీగా క్లూ అందదు.

– ఈ నెల 30న రిలీజ్ అవుతున్న సినిమాల్లో రిచ్ కంటెంట్ ఉన్న సినిమా మాది అని చెబుతున్నాం. ట్రైలర్ రిలీజ్ చేశాక కూడా మా సినిమా స్టోరీ ఎవరికీ అందడం లేదు. అది సినిమాలోనే చూడాలి. కొత్తగా చేశామని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. వీళ్లు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుసుకునేందుకైనా ఆడియెన్స్ మాకు ఒక ఛాన్స్ ఇస్తారని నమ్ముతున్నాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ తో పాటు ఆనంద్ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. అలాంటి సందర్భాలు మనకు ఉన్నాయి. మేము ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేస్తున్నాం. బాగా లేకుంటే నెగిటివ్ చేయడం ఈజీ. వీఎఫ్ఎక్స్ ఆలస్యం వల్లే మా మూవీ రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది.

– నా ప్రతి సినిమాకు బౌండెడ్ స్క్రిప్ట్ చేసుకుంటా. ఒక సీన్ రాస్తే, ఆ సీన్ ఎన్ని నిమిషాలు ఉంటుందనేది రాసుకుంటా. సినిమా ఎంటైర్ స్క్రీన్ ప్లే కట్ నేను చేసిందే. మరో ఇద్దరు ఎడిటర్స్ కూడా వర్క్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ మీద నేను రాసింది 2 గంటల 10 నిమిషాలు. ఔట్ పుట్ వచ్చింది 2 గంటలు. న్యూరోలింక్ మీద ఎలాన్ మస్క్ పరిశోధనలు చేస్తున్నాడు. అయితే మిషిన్స్ మీద చేస్తున్నాడు. మనిషి మీద చేస్తే ఎలా ఉంటుందనేది మా సినిమా కాన్సెప్ట్. అయితే ఎంటర్ టైనింగ్ గా చెబుతున్నాం కాబట్టి ప్రతి సీన్ ప్రేక్షకులకు సులువుగా అర్థమవుతుంది. ఈ సినిమాను ఇరవై ఐదు రోజుల్లో చిత్రీకరించాను.

– మా లైన్ ప్రొడ్యూసర్ అయినాబత్తిన ధశరధ కమెడియన్ రామచంద్రకు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా ఉంది. ధశరధ నాకు బాగా కావాల్సిన వ్యక్తి. మాస్టర్ పీస్ సినిమా నుంచి దాదాపు ఆరేళ్లుగా నాకు దగ్గరగా ఉంటూ వర్క్ చేస్తున్నారు. సినిమా కోసం రాత్రీ పగలు కష్టపడతారు. ధశరధ నాకు సోదరుడి లాంటివారు. ధశరధ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఫ్రెండ్ రోల్ చేస్తున్నారు. ఈ పాత్ర ముందు నువ్వు చేయి తర్వాత చూద్దాం అన్నాను. ధశరధ బాగా పర్ ఫార్మ్ చేశాడు. నా తదుపరి చిత్రంలో ధశరధ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. ఒక డిఫరెంట్ లుక్ లో ధశరధ క్యారెక్టర్ చూస్తారు.

– నా సినిమాలు రిలీజైనప్పుడు ఏదో ఒక ప్రకృతి విపత్తు వస్తూనే ఉంది. శుక్ర టైమ్ కు థియేటర్స్ క్లోజ్ చేశారు. ఓటీటీలో బాగా పే చేసింది. మాటరాని మౌనమిది కూడా బాగా ఆదరణ పొందింది. ఇప్పుడు కిల్లర్ రిలీజ్ అవుతున్నప్పుడు అర్నాబ్ అని తుఫాన్ లు వస్తున్నాయి. ఏది అయితే అది అయ్యింది అని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నాం. భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ రేట్స్ పెంచడం ఓకే కానీ అన్ని సినిమాలకు టికెట్ రేట్స్ పెంచడం సబబు కాదు. అది ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. సుకుమార్ గారు గొప్ప డైరెక్టర్. ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లర్ లాంటి సినిమాలు ఆయన నుంచి వచ్చేవి. కానీ కమర్షియల్ దారిలోకి వెళ్లడం వల్ల ఆ ఛాన్స్ మనకు మిస్ అయ్యింది.

– థ్రిల్లర్ సినిమాలంటే ప్రీ క్లైమాక్స్ వరకు మిమ్మల్ని హుక్ చేసి ఉంచే కంటెంట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతూ సర్ ప్రైజ్ చేస్తాయి. మా కిల్లర్ కూడా అదే తరహా మూవీ. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అనే పాయింట్ ను మాస్ ఎలిమెంట్స్ తో కలిపిన కథతో మీకు కన్విన్సింగ్ గా చూపించే చిత్రమిది. మా సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్ తో పాటు చిన్న స్మైల్ కూడా మీకు వస్తుంది. కథలోని అసలైన పాయింట్ కు షాక్ అవుతారు. ఇలా కూడా సినిమాను తీయొచ్చా అనుకుంటారు.

– జ్యోతి పూర్వజ్ కిల్లర్ సినిమాలో పూర్తిగా కొత్తగా చూస్తారు. ఆమె డిఫరెంట్ రోల్స్ లో ఆకట్టుకుంటారు. సింగిల్ టేక్ లో యాక్షన్ సీక్వెన్సులు చేశారు జ్యోతి. ఆమె ప్రతి పాత్రకు తగినట్లు మేకోవర్ అయ్యారు. ఆడియెన్స్ ఆమెను తెరపై చూస్తూ థ్రిల్ అవుతారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ త్రివిక్రమ్ గారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది: కథానాయిక శ్రీనిధి శెట్టి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“కిల్లర్” ఫీమేల్ సెంట్రిక్ మూవీ… మూవీ చూసాక  ఒడిస్సీతో పోల్చుకుంటారు- డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

“కిల్లర్” ఫీమేల్ సెంట్రిక్ మూవీ… మూవీ చూసాక ఒడిస్సీతో పోల్చుకుంటారు- డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

by Maari
October 27, 2026
0

‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ త్రివిక్రమ్ గారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది: కథానాయిక శ్రీనిధి శెట్టి

‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ త్రివిక్రమ్ గారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది: కథానాయిక శ్రీనిధి శెట్టి

by Maari
October 26, 2026
0

రివ్యూ: ఈ తరానికి సందేశం ఇచ్చే… జయహో రామానుజ(Jayaho Ramanuja Review)

రివ్యూ: ఈ తరానికి సందేశం ఇచ్చే… జయహో రామానుజ(Jayaho Ramanuja Review)

by Maari
October 24, 2026
0

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
October 24, 2026
0

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

“ఇడుపు కాయితం”కథలోని సహజత్వమే మా అందరినీ బాగా ఆకట్టుకుంది – నిర్మాత బన్నీ వాస్

by Maari
October 24, 2026
0

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది: విక్టరీ వెంకటేష్

by Maari
October 24, 2026
0

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

“రణబాలి”  సినిమాతో నా రాయలసీమ రుణం తీర్చుకున్నా – అనంతపురం రణభేరి ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ

by Maari
October 24, 2026
0

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

‘జో జో’రూరల్ కామెడీ డ్రామా నుంచి ఇంట్రెస్టింగ్ కాషన్ 2 వీడియో రిలీజ్‌

by Maari
October 23, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.