శ్రీ పెద్దిస్ క్రియేషన్స్ పతాకంపై ఉమా హర్నాథ్ నిర్మిస్తున్న చిత్రం “దేవుళ్ళారా దీవించండి”. ఈ చిత్రం ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని త్వరలో ఆడియో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ పాటలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. త్వరలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నామని దర్శకుడు తెలిపాడు.
నిజమైన సంఘటనలతో తీస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు. తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ తాను హీరోగా చేయడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
“దేవుళ్ళారా దీవించండి – మనం మొక్కిన మొక్కులు తీరిస్తే ఆ భగవంతుడు మన వెంటే ఉంటాడు” అన్నదే ముఖ్య సారాంశం.
ఇందులో ఒక ప్రముఖ హీరో కూడా నటించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో సౌజన్య, శ్వేత, ఉమా మహేశ్వరరావు, ఆనంద్ స్టైలిష్, మాస్టర్ అకుల్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 18వ తారీఖున విడుదల చేయబోతున్నారు.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: కిషన్ కవాడియా
ఎడిటింగ్: సామ్రాట్
రచయిత: రవీందర్ ఆల్వాలా
కెమెరామెన్: పిట్ట హర్షారెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పెద్ది కె. ఈశ్వర్









