• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, February 13, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

Maari by Maari
January 16, 2026
in Cinema, Latest News
0
ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

Share and Enjoy !

Shares
Twitter

మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతఙ్ఞతలు: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ మీట్ లో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక.

భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని.. ‘అనగనగా ఒక రాజు’ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.

స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. “అందరీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు పేరుపేరునా కృతఙ్ఞతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో మైలురాయి లాంటి చిత్రాలను అందించారు. అలాంటి సంస్థ నుంచి ఇటీవల ఒకట్రెండు సినిమాలు ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో ‘అనగనగా ఒక రాజు’ రూపంలో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ ను అందించడం.. మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా నాగవంశీ గారి ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను.

మా గురువు గారు త్రివిక్రమ్ గారు, చినబాబు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడు ఆ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో మొదటి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఆగకుండా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్ లో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాము. నాకు రాజ్‌కుమార్ హిరానీ గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాము. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది.

కథానాయకుడిగా నాకిది కేవలం నాలుగో సినిమా. నా మొదటి సంక్రాంతి సినిమా. పోటీలో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను.

దర్శకుడిగా మారి సహకారం మరువలేనిది. రచనలోనూ తనదైన సహకారం అందించాడు. యాక్సిడెంట్ అయిపోయి ఈ కథ రాస్తున్న సమయంలో నేను కాస్త నిరుత్సాహంతో ఉన్నాను. ఆ సమయంలో మా కో-రైటర్ చిన్మయి నాలో ప్రేరణ నింపింది. మీనాక్షి చౌదరి, రావు రమేష్ గారు అద్భుతంగా నటించారు. అద్భుతమైన సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ గారికి ధన్యవాదాలు.

ఒక రైటర్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, డైరెక్టర్ కి కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నాగవంశీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చారు, సినిమా అద్భుతంగా ఉందని.. ఎందరో సినీ ప్రముఖులు మాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ‘అనగనగా ఒక రాజు’ చూడనివారు వెంటనే టికెట్ బుక్ చేసుకొని చూడండి. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో మీడియా నుంచి వచ్చిన అపారమైన మద్దతుకు ధన్యవాదాలు. ఎందరో సినీ నిర్మాతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించింది. అలాగే, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతగానో మద్దతు తెలుపుతున్నారు. ఆ అభిమానులంతా సంతోషపడే భారీ ప్రకటన త్వరలోనే రాబోతుంది.

ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ.. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ తగినన్ని థియేటర్లను మాకు కేటాయించి ఎంతో అండగా నిలిచారు. అందుకే రెండు రోజుల్లోనే రూ.41 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది ఈ చిత్రం. నన్ను, నవీన్ ని నమ్మి మా కోసం థియేటర్లు ఉంచిన డిస్ట్రిబ్యూటర్లకు కృతఙ్ఞతలు.

సంక్రాంతి సమయంలో సినిమా విడుదల చేసి హిట్ కొట్టడం నాకు ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకమైన విజయంలో భాగమై, తన పూర్తి మద్దతు ఇచ్చిన నవీన్ కి ధన్యవాదాలు. ఏడాది పాటు వేరే సినిమాలు ఒప్పుకోకుండా.. మా సినిమాకు పూర్తి సమయం కేటాయించిన మీనాక్షి చౌదరికి కృతఙ్ఞతలు. స్క్రిప్ట్ పరంగా నాకు ఎలాంటి సందేహాలు ఉన్నా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయితో చర్చించేవాడిని. ఈ సినిమా విజయం సాధిస్తే.. మా బ్యానర్ లో దర్శకురాలిగా పరిచయం చేస్తానని మాట కూడా ఇచ్చాను.

త్రివిక్రమ్ గారు ముందే ఈ సినిమా చూసి, బాగుందని చెప్పారు. ఆయన స్టాంప్ పడటం నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. అయితే విడుదలకు ముందు కొంత ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో మా బాబాయ్ రాధాకృష్ణ గారు నాకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. పదేళ్లుగా నా సినీ ప్రయాణంలో వెన్నెముకగా నిలిచిన సుధీర్ కి, అలాగే నేనున్నానని భరోసా ఇచ్చిన మా వ్యాపార భాగస్వామి రామ్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు.

సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అది బాగుంది, ఇది బాగుంది అని సాధారణంగా చెప్పడు. అలాంటి మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి నేపథ్యం సంగీతం చేస్తూ.. సినిమా ఘన విజయం సాధిస్తుందని చెప్పాడు. డీఓపీ యువరాజు మా లక్కీ చార్మ్. తనతో ఇది రెండో బ్లాక్ బస్టర్. మా సినిమాని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకొని వెళ్ళడానికి మా పీఆర్ఓ వేణుగోపాల్ గారు, వంశీ కాక, సందీప్ ఎంతో కృషి చేశారు. ఆరేళ్ళ తర్వాత ప్రేక్షకులు నాకు మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందించారు. ఇలాగే ఈ చిత్రాన్ని ఆదరిస్తూ మరింత పెద్ద విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అందరూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. టీమ్ లోని ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. నాకు ఈ సినిమా ప్రత్యేకమైనది. నన్ను ఇందులో భాగం చేసిన నాగవంశీ గారికి, నవీన్ గారికి కృతఙ్ఞతలు.” అన్నారు.

దర్శకుడు మారి మాట్లాడుతూ.. “ముందుగా అందరీ సంక్రాంతి శుభాకాంక్షలు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సందర్భంగా.. మా టీమ్ అందరికీ శుభాకాంక్షలు. ఒక సినిమా అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చడం అనేది ప్రత్యేకం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసినవారు.. వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి ఈ సినిమా చూడమని చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ స్పందన.. మా అందరి కష్టాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేసింది. నవీన్ గారికి వరుసగా నాలుగో విజయం దక్కడం సంతోషంగా ఉంది. ఆయన వల్లే నేను ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. మా చిత్ర బృందం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది మా టీమ్ అందరికీ మరిచిపోలేని సంక్రాంతి.” అన్నారు.

ప్రముఖ నటుడు రావు రమేష్ మాట్లాడుతూ.. “అనగనగా ఒక రాజు సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి, ఈ సంక్రాంతికి మాకు ఆనందాన్ని పంచిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. దర్శకుడిగా మొదటి విజయాన్ని అందుకున్న మారి గారికి శుభాకాంక్షలు. నవీన్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్. ఇందుగలడు అందుగలడు అన్నట్టుగా అన్నీ తానై చూసుకొని, ఈ సినిమాని తన భుజాలపై మోశాడు. ఎన్నో భారీ విజయాలను అందించిన సితార సంస్థ నిర్మించిన ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.” అన్నారు.

రచయిత్రి, క్రియేటర్ డైరెక్టర్ చిన్మయి మాట్లాడుతూ.. “మా కష్టాన్ని గుర్తించి, మాకు ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. కష్టపడితేనే విజయం వస్తుంది. కష్టపడకుండా విజయం రాదు. అదే ఈ చిత్ర కథ ద్వారా చెప్పాము. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టమే ఇంతటి విజయానికి కారణమైంది.” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాకుడు యువరాజు, కళా దర్శకుడు గాంధీ, నటుడు చంద్ర తదితరులు పాల్గొని చిత్ర విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

చిత్రం: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘అనగనగా ఒక రాజు’ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు-నవీన్‌ పొలిశెట్టి

Next Post

ఈనెల 23న విజయ్, సమంతల సినిమా ‘పోలీసోడు’ రీ-రిలీజ్

Next Post
ఈనెల 23న విజయ్, సమంతల సినిమా ‘పోలీసోడు’  రీ-రిలీజ్

ఈనెల 23న విజయ్, సమంతల సినిమా ‘పోలీసోడు’ రీ-రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

by Maari
February 12, 2026
0

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
February 11, 2026
0

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
February 11, 2026
0

లవ్ స్టోరీలో ఇది కె.జి.ఎఫ్. లాంటి చిత్రం: నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

లవ్ స్టోరీలో ఇది కె.జి.ఎఫ్. లాంటి చిత్రం: నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

by Maari
February 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.