• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, March 10, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేసే కథ, కథనాలే ఈ సినిమా హైలైట్‌

Maari by Maari
September 19, 2023
in Cinema, Movies, news
0
ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేసే కథ, కథనాలే ఈ సినిమా హైలైట్‌

Share and Enjoy !

Shares
Twitter

` దర్శక, నిర్మాతలు బాబా పి.ఆర్‌., మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. సూర్య, విషిక జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ‘బేబి’ చిత్రంతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు సాయి రాజేష్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. రీసెంట్ గా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ సినిమాలోని ‘ ఐయామ్ విత్ యూ’ సాంగ్ లాంచ్ చేశారు. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘అష్టదిగ్బంధనం’ దర్శక, నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు బాబా పి.ఆర్‌. మాట్లాడుతూ…

అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌ కదా.. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు?
అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌ అన్నది నిజమే. ఈ సినిమాలో దాన్ని జస్టిఫై చేసేలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నాం. టైటిల్‌కు తగ్గట్టుగానే ఇందులోని ప్రతి క్యారెక్టర్‌ అవతలి వారిని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంటారు. ఇలా పలువురు వ్యక్తుల స్వార్ధంతో కూడిన జీవితాలకు సంబంధించినదే ఈ కథ.

ట్రైలర్‌లో హింస ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది?
ఇది యాక్షన్‌, థ్రిలర్స్‌ను ఎక్కువగా ఇష్టపడే వారికి బాగా కనెక్ట్‌ అవుతుంది. అలాగని ఇతర వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోలేదు అని కాదు. అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. మొదటి ట్రైలర్‌లో కొంత యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువగా చూపించడం వల్ల మీకు హింస ఎక్కువ అనిపిస్తోంది. నెక్ట్స్‌ ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకునే అంశాలు ఉంటాయి.

మీ తొలి చిత్రం ‘సైదులు’కి దీనికి ఉన్న తేడా?
నా తొలి చిత్రం ‘సైదులు’ అయినా.. ఈ ‘అష్టదిగ్బంధనం’ అయినా కథను నమ్మే చేశాను. ఒక టెక్నీషియన్‌గా ఈ రెండు సినిమాలకే కాదు.. భవిష్యత్తులో నేను చేయబోయే సినిమాలకు కూడా ఒకే విధంగా కష్టపడతాను.

కొత్త ఆర్టిస్ట్‌లతో రిస్క్‌ అనిపించలేదా?
కథలో విషయం ఉంటే, ఆర్టిస్ట్‌లు ఆటోమేటిక్‌గా పెర్ఫార్మ్‌ చేస్తారు. ఇందులో కూడా కొత్తవారైనా ఆర్టిస్ట్‌లు అందరూ ఎక్స్‌పీరియెన్స్‌డ్‌గా కనిపిస్తారు.

సంగీత దర్శకుడిగా జాక్సన్‌ విజయన్‌ను ఎంపిక చేసుకోవటానికి కారణం?
ఆయన మలయాళ చిత్రాల్లో ఎంత మంచి టెక్నీషియనో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన తాజా సూపర్‌హిట్‌ ‘ట్రాన్స్‌’ ఎంతటి విజయం సాథించిందో అందరికీ తెలుసు. మా సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ముఖ్యం. అందుకే ఆయన్ను ఎంచుకున్నాం. వెరీ నైస్‌ పర్సన్‌. ఇందులో మూడు పాటలు ఉంటాయి వాటికి కూడా ఆయన మంచి సంగీతం ఇచ్చారు.

నిర్మాత గురించి చెప్పండి ?
మా నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ గారు బిజినెస్‌ మ్యాన్‌. సినిమాల మీద కూడా ఇంట్రస్ట్‌ ఉంది. ఈ కథ చెప్పగానే బాగా ఇంప్రెస్‌ అయ్యారు. కథ కోసం నేను ఏది అడిగితే అది అరేంజ్‌ చేశారు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
ఫైనల్‌గా ప్రేక్షకులకు ఏం చెప్పదల్చుకున్నారు?
నేను ప్రేక్షకులకు చెప్పేది ఒక్కటే.. ఈనెల 22న మీరు థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. మీరు కొన్న టిక్కెట్‌ రేట్‌కు మరిన్నిరెట్లు సంతృప్తినిస్తుంది.

నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ…

నిర్మాతగా తొలి ప్రాజెక్ట్‌కే ఇంత రిస్క్‌ సబ్జెక్ట్‌ ఎంచుకోవడం వెనుక?
ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా. ఈ కథను వినగానే చాలా ఎగ్జైట్‌ ఫీలయ్యా. ఇలాంటి కథతో నిర్మాతగా మారుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక రిస్క్‌ అంటారా.. కథలో ఉన్న బలం ఆ రిస్క్‌ను తీసుకోవటానికి నన్ను ఎంకరేజ్‌ చేసింది. ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేసే కథ, కథనాలు సినిమా హైలైట్‌.

బడ్జెట్‌ విషయంలో ఎక్కడైనా అష్టదిగ్బంధనంకు గురయ్యారా?
లేదండి. ముందే ఈ సినిమాకు బడ్జెట్‌ ఎంత అనేది ఫిక్స్‌ అయ్యాం. దాన్ని బట్టి ముందుకు వెళ్లాం. ఎక్కడా ఓవర్‌ బడ్జెట్‌ అవలేదు.

సినిమా అనేది కళాత్మక వ్యాపారం కదా.. మీరు ఇందులో కళను చూసి నిర్మాణం చేపట్టారా? వ్యాపారం చూసి దిగారా?
బేసిక్‌గా నేను వ్యాపారస్తుణ్ణి. ముందు అయితే ఇది కూడా ఒక వ్యాపారం అనే భావనతోనే దిగాను. ఆ తర్వాత ఇది 24 క్రాఫ్ట్స్‌తో కూడిన కళాకారుల క్రియేటివిటీకి దర్పణం అని అర్ధమైంది. అక్కడి నుంచి దీన్ని కళాత్మక వ్యాపారంగానే చూడటం మొదలు పెట్టాను.

ఇవాళ చిన్న సినిమాలు విడుదల కావడమే కష్టమైపోయింది. మీరు ఏ ధైర్యంతో ఇంత బడ్జెట్‌ పెట్టారు?
కేవలం కథ మీద ఉన్న నమ్మకమే నన్ను ముందుకు నడిపింది. సినిమాను సినిమాగా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. వారికి కావాల్సిన అన్ని అంశాలు జాగ్రత్తగా ఇమడ్చగలిగితే ఖచ్చితంగా సక్సెస్‌ వస్తుంది. దర్శకుడు బాబాగారు ముందు చెప్పిన దానికన్నా అద్భుతంగా తీశారు.

ఏ పాయింట్‌లు సినిమా సక్సెస్‌కు దోహం చేస్తాయని భావిస్తున్నారు?
ఇందులో ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. మంచి సస్పెన్స్‌, పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్‌, ఫొటోగ్రఫీ ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అవే సినిమాను సక్సెస్‌ చేస్తాయని నా నమ్మకం.

బిజినెస్‌ సైడ్‌ నుంచి రెస్పాన్స్‌ ఎలా ఉంది?
చాలా బాగుంది. ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు 150 నుంచి 200 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ గురించి?
ప్రస్తుతం ఒక సినిమా సెట్స్‌ మీద ఉంది. త్వరలో దాని వివరాలు తెలియజేస్తాం.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘డెవిల్’ నుంచి ఫస్ట్ సాంగ్ ‘మాయే చేశావే’ విడుదల

Next Post

స్త్రీ ఆత్మ గౌరవానికి విలువనిచ్చే చిత్రం… నచ్చినవాడు – లక్షణ్ చిన్న

Next Post
స్త్రీ ఆత్మ గౌరవానికి విలువనిచ్చే చిత్రం… నచ్చినవాడు – లక్షణ్ చిన్న

స్త్రీ ఆత్మ గౌరవానికి విలువనిచ్చే చిత్రం... నచ్చినవాడు - లక్షణ్ చిన్న

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

by Maari
March 6, 2026
0

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

by Maari
March 5, 2026
0

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

by Maari
March 5, 2026
0

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

by Maari
March 5, 2026
0

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

by Maari
March 5, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

by Maari
March 4, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.