• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

admin by admin
September 15, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో నేడు సినిమా దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్ మీడియాతో ముచ్చటించి మీడియా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానాలు తెలిపారు.

* మీ గురించి, మీ నేపథ్యం చెప్పండి..
నా పేరు శివ సాయి వర్ధన్. మాది నెల్లూరు. సినిమాల్లోకి రావాలని ఇంజనీరింగ్ అప్పుడు ఫిక్స్ అయ్యాను. ఫైనాన్షియల్ సమస్యల వల్ల ఐటి జాబ్ చేశాను మొదట. ఐటి జాబ్ చేస్తూ 2016లో గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ చేశాను. అది మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత పెళ్లిగోల సిరీస్ రెండు సీజన్స్ చేశాను. ఆ తర్వాత ఆహాలో గీత సుబ్రహ్మణ్యం సిరీస్ రెండు సీజన్స్ చేశాను. ఆ తర్వాత నిహారిక గారు పిలిచి హలో వరల్డ్ ఇచ్చారు. ఇవన్నీ ఐటి జాబ్ చేస్తూనే చేశాను. 2020 లో జాబ్ మానేసి ఫుల్ గా ఫోకస్ పెడదాం అనుకున్నాను. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడు మా ఆవిడ జాబ్ చేస్తూ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో భలే ఉన్నాడే సినిమా చేసాను మారుతీ గారి సపోర్ట్ తోనే. కానీ పలు కారణాలతో ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత మారుతి గారే పిలిచి ఈ సినిమా ఇచ్చారు.

* ఈ కథ ఎవరు రాశారు? మీ దగ్గరకు ఎలా వచ్చింది..?
ఈ కథ మారుతీ గారు పిలిచి నాకు ఇచ్చారు. దీన్ని సుబ్రహ్మణ్యం గారు అనే జర్నలిస్ట్ రాసారు. ఆయనే డైరెక్ట్ చేయాలి కానీ వేరే వాళ్లకు ఇమ్మనడంతో జీ వాళ్ళు నన్ను ప్రపోజ్ చేశారు నా వర్క్ నచ్చి. మొదటిసారి నేను వేరే వాళ్ళ కథకు పనిచేసాను. దాంతో నేను వారం రోజులు కథని అర్ధం చేసుకున్నాను.

*మీ పాత సిరీస్ లలో క్యూట్ రొమాన్స్ సీన్స్ ఉంటాయి, ఇందులో అలాంటివి ఉంటాయా?

నేను చాలా ట్రై చేస్తాను అదొక్కటే అని కాకుండా. దీంట్లో కూడా రిలేటిబులిటీ ఎక్కువ ఉంటుంది. హీరో – హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది గీతా సుబ్రహ్మణ్యం లాగే. సినిమాలో ఒక మంచి డ్రామా నడుస్తుంది. బోర్ కొట్టదు. నిన్న ఈవెంట్లో మాట్లాడిన వాళ్లంతా సినిమా చూసి అంతా బాగా మాట్లాడారు. ఇందులో అన్ని పాత్రలకు రిలేట్ అవుతాము. హీరోయిన్ ని చూస్తే పక్కింటి అమ్మాయి అనిపిస్తుంది. మొదట వేరే అమ్మాయి అనుకున్నాం కానీ ఆమె హీరోయిన్ లాగా కనిపిస్తుంది పక్కింటి అమ్మాయిలా లేదని మార్చేసాము.

*అంకిత్ ఛాయిస్ ఎవరిది? అతను సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు?

ఈ కథలోకి అంకిత్ ముందే వచ్చాడు. నాకు ముందే అంకిత్ పరిచయం ఉన్నాడు. నిహారిక గారికి హలో వరల్డ్ చేసేటప్పుడు అంకిత్ కి కూడా ఒక పాత్ర అనుకున్నాను కానీ అతనికి కుదరలేదు. ఒక అంకిత్ తప్ప ఈ సినిమాలో అందర్నీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అంకిత్ నాతో బాగా ట్రావెల్ అయ్యాడు. రియాల్టీగా నటించాడు. ఒక షాట్ లో కింద పడితే నిజంగానే పడాలి, ఎలాంటి సేఫ్టీ లేకుండానే నిజంగానే పడ్డాడు. అంకిత్ సినిమాని తన భుజాల మీద మోస్తున్నాడు.

*ఒక లైన్ లో ఈ సినిమా కథ చెప్పాలంటే ఏం చెప్తారు?

ఒక మధ్య తరగతి అమ్మాయి గురించి చెప్పాలి. ఇప్పుడు అందరూ మన జీవితం కాకుండా పక్కనోళ్ళ జీవితం చూసి కంపారిజన్ చేసుకుంటున్నారు. మా అమ్మాయి కూడా వాళ్ళు కొంటున్నారు నాకు కావాలి అని కంపేర్ చేస్తుంది. ఇందులో హీరోయిన్ కూడా టీనేజర్స్ లాగా పక్కనోళ్ళతో కంపేర్ చేసుకొని తన కుటుంబ స్థితి మర్చిపోయి అది కావాలి ఇది కావాలి అంటారు. మనం స్థితికి మించి వాళ్ళని చదివిస్తాం అయినా వాళ్ళు పక్కనోళ్ళతో కంపేర్ చేసుకుంటారు. మనం ఎంత చేసినా చిన్న లోటు కనిపిస్తే దాన్ని హైలెట్ చేస్తారు పిల్లలు. అదే కథాంశంతో ఉంటుంది. ఇప్పుడు అందరూ నేను ఎంజాయ్ చేయలేదు, నా పిల్లలు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇది ఇంకా తప్పు. ఈ సినిమాలో నాన్న క్యాబ్ డ్రైవర్ అయినా ఆయన స్థితి మించి చేస్తున్నా కూతురికి తెలీదు. ఇందులో క్లాస్ లు పీకడాలు ఏమి లేవు. ఒక జీవితం చూపిస్తాను. ఈ కథలో జీవితం చూపిస్తున్నాం అందుకే నేను కనెక్ట్ అయ్యాను.

*మీరు భలే ఉన్నాడే సినిమా అయ్యాక బాధపడ్డారు అని మారుతీ గారు అన్నారు. సినిమా రిజల్ట్ ని ఎలా తీసుకుంటారు?

నేను కొంచెం ఎమోషనల్. నాకు ఆ సినిమా ప్రివ్యూ దగ్గరే అర్థమైంది సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వలేదని. ముందే తెలిసింది భలే ఉన్నాడే సినిమా గురించి. అది ఫెయిల్ అయ్యాక ఒక గంట సేపు బాత్రూంలో కూర్చొని ఏడిచాను. తర్వాత అక్కడితో వదిలేసి మూవ్ అయ్యాను. ఆ సినిమాకు కొన్ని వర్కౌట్ అవ్వలేదు.

*ఈ సినిమాలో లవ్ కాకుండా థ్రిల్లింగ్ కూడా ఉందనిపిస్తుంది..?

ఈ సినిమాలో లవ్ స్టోరీ మాత్రమే కాదు థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఒక కపుల్ ఏమి లేకుండా బయటకు వచ్చేస్తే వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు అని చూపించాను.

*బేబీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దీనికి చేసాడు. ఎలా ఇచ్చారు మ్యూజిక్?

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ కుమ్మేసాడు. ప్రెట్టీ సాంగ్ ముందే ఉంది. మిగిలిన సాంగ్స్ అన్ని నేను వచ్చాకే రాసారు. బ్యాక్ గ్రౌండ్ మీరు సినిమా చూడండి నచ్చేస్తుంది. నేను కొన్ని మార్చమని చెప్పాను కానీ ఆయన నన్ను నమ్ము అన్నారు. ఫైనల్ చూస్తే అదిరిపోయింది.

*మారుతీ గారు ఏమన్నా ఛేంజెస్ చెప్పారా సినిమా చూశాక?

ఇటీవల సినిమా నిడివి విషయంలో ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. మారుతీ గారు సినిమా చూసి ఒక 5 నిముషాలు కట్ చేస్తే బాగుండు అని అన్నారు. ఆయన చెప్పాక నేను కూడా చూసి ఒక ఏడు నిమిషాల వరకు కట్ చేశాను.

*టైటిల్ బ్యూటీ అని ఎందుకు పెట్టారు?

ఈ సినిమాలో హీరోయిన్ ఇన్నర్ బ్యూటీ కంటే ఔటర్ బ్యూటీ కి ఎక్కువ విలువ ఇస్తుంది. అది కాదు ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి. బ్లాక్, వైట్ అంటూ ఏమి ఉండదు ఇన్నర్ బ్యూటీ ఉండాలి.

*చిన్న సినిమా కాబట్టి బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయా?

బడ్జెట్ లిమిట్ ఉంటేనే బాగుంటుంది. లిమిట్ బడ్జెట్ ఇవ్వకపోతే డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. కానీ అవసరం అయితే ఇస్తారు. ఈ సినిమాలో ఒక షిప్ సీన్ ఉంది. అది కావాలి అని మారుతీ గారికి చెప్పాను. ఎందుకు అని అడిగితే ఆయన్ని కన్విన్స్ చేయాలి, చేశాను. వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్ ఇస్తారు.

*అంకిత్ నిన్న ఈవెంట్లో సినిమా నచ్చకపోతే జీరో రేటింగ్ ఇవ్వండి అన్నాడు. ఏంటి అంత కాన్ఫిడెన్స్?

గట్స్. అనుకోకుండా చెప్పలేదు. సినిమా బాగుంది అందుకే కాన్ఫిడెంట్ తో చెప్పాడు. నిజంగా జీరో రేటింగ్ ఇచ్చినా మేము తీసుకుంటాం కానీ ఇవ్వరు. ఈ నెలలో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. వాటికి డబ్బులు పెట్టిన ప్రేక్షకులు మా సినిమాకు కూడా డబ్బులు పెట్టాలి అంటే మంచి సినిమానే ఇవ్వాలి. ఇస్తున్నాం.

*నరేష్ – వాసుకి గారి గురించి చెప్పండి?

వాళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్. వాళ్ళు సెట్ లో మంచి ఎనర్జీ ఇస్తారు. వాసుకి గారు సపోర్ట్ చేసారు చాలా. అందుకే నా ఛాయస్ కరెక్ట్. మొదట వాసుకి గారు నరేష్ గారికి వైఫ్ అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ఇటీవల సుందరకాండ సినిమాలో నరేష్ గారికి కూతురిగా వాసుకి గారు నటించారు. ఇందులో భార్యగా చేశారు. సినిమా చూశాక సెట్ అవ్వలేదు అనిపించదు. పర్ఫెక్ట్ గా ఎమోషన్ ని పండించారు.

*సినిమా చూసిన వాళ్ళు ఏం అన్నారు?

అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మారుతీ గారికి బాగా నచ్చింది కాబట్టే ఆయన నిన్న ఈవెంట్లో అంత బాగా మాట్లాడారు. ఒక డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ హాఫ్ అయ్యాక బానే ఉంది అన్నారు. సెకండ్ హాఫ్ అయ్యాక ఏడుస్తూ బయటకి వచ్చారు. నేను సాధించాను అనిపించింది. కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ చూసారు. సినిమా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చూసి చెప్పాలి. మన వాళ్ళు చూస్తే సినిమా బాగుంది అనే అంటారు. ముందే ప్రీమియర్స్ వేస్తాము.

*నెక్స్ట్ కథలు ఏంటి? సిరీస్ లు మళ్ళీ చేస్తారా?

మట్టి వాసన కథలు చెప్పాలి. ఒక మార్షల్ ఆర్ట్స్ కథ రాసుకున్నా. దాని గురించి ట్రైనింగ్ నేర్చుకున్నా. మనలోంచి కథలు రావాలి. అలాంటి కథలే రాస్తాను. జనాల్ని గమనించి రాసుకుంటాను. నాకు యాక్షన్ కూడా ఇష్టమే. సిరీస్ లు కూడా చేస్తాను. బతకడానికి డబ్బులు కావాలి. డబ్బుల కోసం చేస్తాను. గీత సుబ్రహ్మణ్యం, పెళ్లిగోల సీక్వెల్స్ కి పిలిస్తే వెళ్తాను. అమెజాన్ తో ఒకటి డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Beauty is not just a love story, It has thrilling moments too, Distributors moved to tears: Director JSS Vardhan

Ankith Koyya and Nilakhi Patra lead as hero and heroine in ‘Beauty’, a film jointly produced by Vijaypal Reddy Adidhala and Umesh Kumar Bhansal. The movie is a collaboration between Zee Studios, Maruthi Team Product, and Vanara Celluloid. JSS Vardhan, renowned for his work in ‘Geetha Subramanyam’, ‘Hello World’, and ‘Bhale Unnade’, has penned the dialogues and directed the film. The story and screenplay were written by RV Subrahmanyam. The film is set to hit theatres on September 19th. The teaser, trailer, and songs released so far have created much anticipation. As the release date draws near, director JSS Vardhan spoke to the media, sharing his thoughts and answering various questions.

*Tell us about yourself and your background:*
My name is Shiva Sai Vardhan, and I hail from Nellore. The desire to work in films began during my engineering days. Due to financial constraints, I initially took up an IT job. While working in IT, I made ‘Geetha Subramanyam’ series in 2016, which earned me considerable recognition. I subsequently did two seasons of the ‘Pelligola’ series, followed by two seasons of ‘Geetha Subramanyam’ on Aha. Niharika then gave me the chance to work on ‘Hello World’. All of this was while I continued my IT job. In 2020, I decided to leave my job to focus entirely on filmmaking. There was a brief gap during this transition, but my wife supported me by working during that time. Afterwards, I made the film ‘Bhale Unnade’ with Raj Tarun under Maruthi’s guidance. However, for various reasons, the film did not turn well. After it was completed, Maruthi sir called me again and offered me this film.

*Who wrote the story for ‘Beauty’ and how did it come to you?*
Maruthi sir approached me with the story, which was originally written by journalist Subrahmanyam sir. He was supposed to direct it, but for various reasons, Zee suggested me for the project after they liked my work. This was my first time working on a story written by someone else. I spent a week immersing myself in the narrative.

*Your previous series featured cute romance and engaging scenes. Can we expect the same here?*
I always strive to bring something relatable and avoid repeating myself. This film emphasizes relatability as well. The chemistry between the leads, much like in ‘Geetha Subramanyam’, has come out very well. The drama runs strong throughout, and there’s no room for boredom. Everyone who attended the recent pre-release event spoke highly after watching the film. All the characters are relatable, and the heroine feels like the girl-next-door. Initially, we considered someone else for the role, but later realized she didn’t fit the ‘girl-next-door’ image and changed the casting.

*How did Ankith get selected, and how hard did he work for the role?*
Ankith was on board from the start. I was already acquainted with him. During ‘Hello World’ with Niharika, Ankith was considered for a role but couldn’t take it up. Apart from Ankith, I personally selected the rest of the cast. Ankith has travelled this journey closely with me and has performed realistically. In one shot, he even fell without any safety measures, demonstrating his dedication. He’s truly carried the film on his shoulders.

*If you had to sum up the story in one line, what would it be?*
It’s about a middle-class girl. Nowadays, people tend to compare their lives with others rather than living for themselves. The protagonist also constantly compares herself to others, wanting what they have. This tendency is prevalent among teenagers—comparing themselves and wanting more, oblivious to their own situation. Parents provide beyond their means, yet children highlight even minor shortcomings. That’s the core of this story. Many people today want their children to enjoy what they themselves couldn’t, which can lead to unrealistic expectations. In the film, even though the father is a cab driver and works beyond his means for his daughter, she remains unaware. There aren’t any stereotypical class distinctions here. The narrative is simply about life, which is why I connected with it.

*Maruthi sir mentioned you were upset after ‘Bhale Unnade’. How do you handle film results?*
I tend to be emotional. At the premiere of ‘Bhale Unnade’ itself, I realized the second half hadn’t worked. Once it was clear that the film wouldn’t succeed, I sat in the bathroom and cried for an hour, but then I moved on. Some things in that film didn’t work out.

*Is ‘Beauty’ solely a love story, or is there a thriller element as well?*
It’s not just a love story; there are thrilling moments too. The film presents an emotional drama, showing the hardships faced by a couple when left house with nothing.

*How did music director Vijay Bulganin, fresh from ‘Baby’, deliver for this film?*
Vijay Bulganin has done a fantastic job. The ‘Pretty’ song was completed first. The rest of the songs were written after I came on board. The background score is sure to impress viewers. While I suggested some changes, he asked me to trust him—and the final result is outstanding.

*Did Maruthi sir suggest any changes after watching the film?*
Currently, film length is a commonly discussed topic. After watching the film, Maruthi sir suggested trimming five minutes. I also felt the same and ended up cutting about seven minutes.

*Why did you choose the title ‘Beauty’?*
In this story, the heroine initially values outer beauty over inner beauty. The film emphasizes that true beauty is internal, beyond labels of black or white.

*Were there budget limitations because this is a small film?*
Working within a budget is actually beneficial. Without limits, a director might overindulge, but necessary provisions are always made. For instance, for a ship scene in the film, I convinced Maruthi sir of its necessity, and he approved the budget.

*At the event, Ankith publicly said people could rate the film zero if they didn’t like it. Why such confidence?*
It’s pure guts. He didn’t say it lightly; he genuinely believes in the film. Even if someone did rate it zero, we’d accept it, but we don’t expect that to happen. All the films released this month have been hits, so for audiences to spend money on our film too, we have to offer quality—and we believe we have.

*Tell us about Naresh and Vasuki’s pairing.*
Their combination is wonderful. Both bring a lot of energy on set, and Vasuki has been incredibly supportive. Initially, there was hesitation in casting Vasuki as Naresh’s wife; she recently played his daughter in ‘Sundarakanda’. But here, as his wife, their performances convincingly delivered the emotions and will resonate well.

*What has been the audience’s response?*
The response has been overwhelmingly positive. Maruthi sir praised the film highly at the recent event. One distributor told me at interval that the film was good, and by the end, he left the auditorium in tears — that felt like a true achievement. Some cab drivers also watched and related to the story. Screenings will be open to the public as well, not just industry insiders.

*What’s next for you—films or series?*
I want to tell earthy, real stories. I have written a martial arts story and am learning more about the craft. Stories should come from our own experiences and surroundings. I also enjoy action and am open to working on series again, as making a living is important. If called for sequels of ‘Geeta Subramanyam’ or ‘Pelligola’, I’ll definitely go. There have also been discussions with Amazon.

Previous Post

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

Next Post

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

Next Post
‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

'ఓజీ' సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

by admin
September 16, 2025
0

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

by admin
September 15, 2025
0

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

by admin
September 15, 2025
0

“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

by admin
September 11, 2025
0

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

by admin
September 10, 2025
0

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

by admin
September 5, 2025
0

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

by admin
September 4, 2025
0

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

by admin
September 3, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.