• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, March 10, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైన డార్క్ క్రైమ్ ఎంటర్ టైనర్ “భ్రమర” మూవీ

Maari by Maari
September 20, 2023
in Cinema, Movies, news, special
0
అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైన డార్క్ క్రైమ్ ఎంటర్ టైనర్ “భ్రమర” మూవీ

Share and Enjoy !

Shares
Twitter

జి.యం.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నికితశ్రీ, సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి , పృద్వి రాజ్(పెళ్లి), నాగమహేష్, జయవాణి,మీసాల లక్ష్మణ్, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, దువ్వాసి మోహన్, పసునూరి శ్రీనివాస్, మాణిక్యం, టార్జాన్ నటీ నటులుగా టి.వి రవి నారాయణన్ దర్శకత్వంలో జి.మురళీ కృష్ణ నిర్మాణ సారద్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం “భ్రమర”. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..తెలంగాణ ఎఫ్.డి.సి.
చైర్మన్ అనిల్ కుర్మచలం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో

గెస్ట్ గా వచ్చిన హైకోర్ట్ అడ్వకేట్ సుంకర నరేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అయితే ప్రజలను అవగాహన పరస్తూ ప్రజలలో చైతన్యం తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాతలు డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్స్ లో “భ్రమర” అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ టైటిల్ లో ఎటువంటి సౌండ్ ఉందో సినిమాలో కూడా అటువంటి సౌండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మీడియా తో పాటు ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తూ మూవీ యూనిట్ ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సహ నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. రవి నాకు బెస్ట్ ఫ్రెండ్.తను మంచి కాన్సెప్ట్ ఉన్న కథ చెప్పడంతో ఈ సినిమా తీద్దామనుకున్నాను. అయితే నాకు నిర్మాత మురళీ కృష్ణ గారు సపోర్ట్ గా రావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు, హైదరాబాద్ లలో శర వేగంగా షూటింగ్ జరుపుకొని ఇదే సంవత్సరంలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

చిత్ర దర్శకుడు టి.వి రవి నారాయణన్ మాట్లాడుతూ..
డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ మీద ఈ సినిమా నడుస్తుంది. .ఈ కథను కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్ మురళి కృష్ణ గారికి చెప్పగానే కథ నచ్చి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అందుకు వారికి నా ధన్యవాదాలు.ఈ సినిమాను ఊటీ బ్యాక్ డ్రాప్ లో తీద్దాం అనుకున్నాము. అయితే ఊటీ కంటే అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రాహుల్ శ్రీ వాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్ గా కార్తీక్ బి. కొడగండ్ల చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి ,పెళ్లి సినిమా పృద్వి రాజ్ తో పాటు నికితశ్రీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇంకా ఇందులో నటిస్తున్న మిగతా నటీ, నటులు అందరిని త్వరలో తెలియజేస్తాము. అందరూ బాగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్తున్నాము. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

నటి నిత్య శ్రీ మాట్లాడుతూ.. ఇది నా మూడవ సినిమా. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

నటీ నటులు
30 ఇయర్స్ పృద్వి, పృద్వి రాజ్, నాగమహేష్, జయవాణి, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, మీసాల లక్ష్మణ్, మాణిక్యం, పసునూరి శ్రీనివాస్, దువ్వాసి మోహన్, టార్జాన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : జి.యం.కె. ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : జి.మురళీ కృష్ణ
కో-ప్రొడ్యూసర్ : కల్యాణ్ చక్రవర్తి
దర్శకత్వం : టి.వి.రవి నారాయణన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : రాహుల్ శ్రీ వాత్సవ్
సంగీతం : కార్తీక్ బి. కొడగండ్ల
ఎడిటింగ్ : శివ బొడ్డు
మాటలు : బి.వెంకటేష్ కనక,
ఆర్ట్ డైరెక్టర్ : సుమిత్ పటేల్
కో డైరెక్టర్ : మనోజ్ నాయుడు
మేనేజర్: వేగి వెంకట్రావు.
పి.ఆర్.ఓ : సాయి సతీష్, రాంబాబు

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

సురేష్ బాబు ప్రశంసలు అందుకున్న “ఒక్కడే.1″టీజర్

Next Post

హైదరాబాద్‌ కొండాపూర్ హ‌నీహ‌నీ కిడ్స్ 2వ స్టోర్ ప్రారంభం.

Next Post
హైదరాబాద్‌ కొండాపూర్ హ‌నీహ‌నీ కిడ్స్ 2వ స్టోర్ ప్రారంభం.

హైదరాబాద్‌ కొండాపూర్ హ‌నీహ‌నీ కిడ్స్ 2వ స్టోర్ ప్రారంభం.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

by Maari
March 6, 2026
0

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

by Maari
March 5, 2026
0

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

by Maari
March 5, 2026
0

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

by Maari
March 5, 2026
0

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

by Maari
March 5, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

by Maari
March 4, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.