• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, April 12, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా “చింతామణి సొంతకథ” సినిమా ప్రారంభం

Maari by Maari
April 12, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
ఘనంగా “చింతామణి సొంతకథ” సినిమా ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

శ్రీరామ్, మహిమా గుప్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “చింతామణి సొంతకథ”.
ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ రాజ్ రూపొందిస్తున్నారు. మిత్రా మూవీ మేకర్స్ బి.రాజీవ్ కుమార్, రాకేష్ కర్రె, డా. ఎన్ వీ రావు, శ్రీనివాస్ పసుపులేటి నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ డా. అద్దంకి దయాకర్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

డా. అద్దంకి దయాకర్ క్లాప్ ఇవ్వగా,
జీహెచ్ఎంసీ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ వందనకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
సోషల్ యాక్టివిస్ట్ డా. శ్రీనివాస్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
నటుడు కాశీ విశ్వనాథ్, రచయిత నివాస్ కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా

నిర్మాత బి.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ – మా మిత్రా మూవీ మేకర్స్ బ్యానర్ పై రెండవ సినిమా గా “చింతామణి సొంతకథ” చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దర్శకుడు ప్రేమ్ రాజ్ ఒక మంచి కథను మాకు చెప్పారు. కథలోని స్ట్రాంగ్ కంటెంట్ ను నమ్మి మేము సినిమా చేసేందుకు ముందుకొచ్చాం. మా సినిమాకు హీరో హీరోయిన్స్ శ్రీరామ్, మహిమా గుప్త పర్పెక్ట్ గా సరిపోయారు. మేము మా బ్యానర్ లో ఏడాదికో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. అన్నారు.

నిర్మాత డా.ఎన్ వీ రావు మాట్లాడుతూ- ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో మిత్రా మూవీ మేకర్స్ సంస్థను స్థాపించి నేను నా ఫ్రెండ్స్ కలిసి సినిమాలు నిర్మిస్తున్నాం. “చింతామణి సొంతకథ” సినిమాను ప్రేమ్ రాజ్ లాంటి అనుభవం ఉన్న దర్శకుడితో నిర్మించడం సంతోషంగా ఉంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నిర్మాత రాకేష్ కర్రె మాట్లాడుతూ- “చింతామణి సొంత కథ” అంటే
సీఎస్ కే.
ఐపీఎల్ సీఎస్ కే లాగే మా సినిమా కూడా విజయం సాధిస్తుంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రేమ్ రాజ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచి సాంగ్స్ ఆకట్టుకుంటాయి.అన్నారు.

లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ గారితో కలిసి పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. పాటలకు మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. ఈ సినిమాలో ఒక సాంగ్ నేను రాస్తున్నా. మా మూవీకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ- దర్శకుడిగా నాకు నాలుగో చిత్రమిది. గతంలో నేను చేసిన మూడు చిత్రాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటాయి.ఇప్పుడు నాలుగో చిత్రంగా కమర్షియల్ పంథాలో క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా చేస్తున్నాను.
క్రైమ్ థ్రిల్లర్ కథైనా ఇందులో భార్య భర్తల మధ్య మంచి డ్రామా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. యూత్ ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ఇప్పుటి ట్రెండ్ కు అనుగుణంగా రూపొందిస్తున్నాం. ప్రేక్షకులు సినిమాను కొత్తగా ఫీలవుతారు. తెలుగు, హిందీ భాషల్లో స్ట్రైట్ మూవీ ఇది. తమిళ, మలయాళ, కన్నడలో డబ్ చేస్తాం.
మా ప్రొడ్యూసర్స్ నలుగురు నాలుగు పిల్లర్స్ లా నిలబడి ఈ మూవీ నిర్మిస్తున్నారు. హీరోయిన్ మహిమా గుప్తకు ఈసినిమాతో మంచి పేరొస్తుంది. హీరో శ్రీరామ్ మా మూవీకి ముఖచిత్రం లాంటివారు. కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానంటూ ముందుకొచ్చారు. మీ అందరి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నాం.అన్నారు.

హీరోయిన్ మహిమా గుప్త మాట్లాడుతూ – తెలుగులో నాకు తొలి చిత్రమిది. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. శ్రీరామ్ గారి సరసన నటించే అవకాశం దక్కడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా.అన్నారు.

నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ- ప్రేమ్ రాజ్ నాకు మిత్రుడు.ఈ కథ నాకు తెలుసు. చాలా మంచి స్టోరీ.ఈ చిత్రంలో నేను ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాను. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా అంశాలు ఆకట్టుకుంటాయి.అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – మా డైరెక్టర్ ప్రేమ్ రాజ్ లాగే నేను కూడా ప్రతి సినిమా మొదటి సినిమాగానే భావించి నటిస్తాను. “చింతామణి సొంత కథ” సినిమా మిత్రా మూవీ మేకర్స్ కు హిట్ మూవీ అవుతుంది.
వాళ్లు ఇంకా చాలా సినిమాలు చేయాలి. అందరికీ పని కల్పించాలి. టీమ్ అంతా ప్యాషనేట్ గా కష్టపడి ఒక మంచి సినిమా చేయాలనుకుంటున్నారు. ట్విస్ట్స్, ఎమోషన్స్, యాక్షన్ తో సాగే ‘మీనింగ్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్’ చిత్రమిది. మీ అందరికీ నచ్చే సినిమా ఇవ్వబోతున్నాం. తొలి చిత్రంతోనే టైటిల్ రోల్ దక్కించుకుంది మా హీరోయిన్ మహిమా. తెలుగు ఆడియెన్స్ ప్రతిభ ఉండి కష్టపడే ప్రతి ఒక్కరినీ ఆదరిస్తారు. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు నాని, తదితరులు పాల్గొన్నారు

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

శ్రీకాకుళంలో అట్టహాసంగా ప్రారంభమైన దేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ‘గోయాజ్’ (GOYAZ)!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా “చింతామణి సొంతకథ” సినిమా ప్రారంభం

ఘనంగా “చింతామణి సొంతకథ” సినిమా ప్రారంభం

by Maari
April 12, 2026
0

శ్రీకాకుళంలో అట్టహాసంగా ప్రారంభమైన దేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ‘గోయాజ్’ (GOYAZ)!

శ్రీకాకుళంలో అట్టహాసంగా ప్రారంభమైన దేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ‘గోయాజ్’ (GOYAZ)!

by Maari
April 11, 2026
0

హరుడు ట్రైలర్ విడుదల… మే 8న సినిమా రిలీజ్

హరుడు ట్రైలర్ విడుదల… మే 8న సినిమా రిలీజ్

by Maari
April 11, 2026
0

వైభవంగా”కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

వైభవంగా”కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
April 11, 2026
0

సినిమా రివ్యూ: డైమండ్ డెకాయిట్

సినిమా రివ్యూ: డైమండ్ డెకాయిట్

by Maari
April 10, 2026
0

రఘుకుంచె గేదెలరాజు ఏప్రిల్‌ 24న విడుదల…

రఘుకుంచె గేదెలరాజు ఏప్రిల్‌ 24న విడుదల…

by Maari
April 10, 2026
0

ఏప్రిల్ 24న విడుదల కాబోతున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ చిత్రం

ఏప్రిల్ 24న విడుదల కాబోతున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ చిత్రం

by Maari
April 10, 2026
0

90’s లో TV అంటే ఒక ఎమోషన్… దాన్ని నేటి తరానికి చూపించాలనుకుంటున్నాం – కిరణ్ అబ్బవరం

90’s లో TV అంటే ఒక ఎమోషన్… దాన్ని నేటి తరానికి చూపించాలనుకుంటున్నాం – కిరణ్ అబ్బవరం

by Maari
April 10, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.