పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – మా “దేవగుడి” సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, మూవీకి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందనే ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలోని రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. యాక్షన్ సీక్వెన్సులు, పాటల చిత్రీకరణ బాగుందనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్ గా వచ్చాయి. మంచి రేటింగ్స్ ఇచ్చారు. మా చిత్రంలో రఘు కుంచె గారు చేసిన వీరారెడ్డి పాత్ర హైలైట్ అయ్యింది. ఆయన పర్ పార్మెన్స్ చాలా బాగుందని అంటున్నారు. అలాగే కీ రోల్స్ చేసిన అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనను కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. “దేవగుడి” సక్సెస్ తో మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నారు. అన్నారు.
హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ – కొన్నేళ్లుగా హీరో కావాలని నేను కన్న కలను, పడిన శ్రమను “దేవగుడి” సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్ లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. రివ్యూస్ లో కూడా నా పేరు అభినవ్ అని మర్చిపోయి ధర్మ అనే రాస్తున్నారు. అంటే అంత బాగా వారికి కనెక్ట్ అయ్యాను. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి గారికే చెందుతుంది. ఆయన నటుడిగా నాకు జన్మనిచ్చారు. నేను ఈ సినిమాలో జాతర నేపథ్యంగా చేసిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
నరసింహ తోషి మాట్లాడుతూ – “దేవగుడి” సినిమాకు విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాను చూసి మా ఊరి ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో సంతోషంగా ఫోన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో నటించే అవకాశం దక్కింది. నాతో పాటు మా టీమ్ అందరికీ ఈ విజయం ఎంతో ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. అన్నారు.
హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ – ఒక తెలుగు అమ్మాయిగా “దేవగుడి” చిత్రంతో హీరోయిన్ గా మీ ముందుకు వచ్చాను. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి అని ఆడియెన్స్ పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు అని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు. నేను చేసిన కొన్ని ఫైట్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ కు థియేటర్స్ లో విజివ్ల్ పడుతున్నాయి. అన్నారు.
నటుడు రఘుకుంచె మాట్లాడుతూ – మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా చిన్న సినిమాను కూడా ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ “దేవగుడి” విజయంతో మరోసారి ప్రూవ్ చేశారు. ఈ క్రెడిట్ బెల్లం రామకృష్ణా రెడ్డి గారికే ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమా రిలీజైతే అది ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు, ఎక్కడా కనిపించడం లేదు. కానీ రామకృష్ణారెడ్డి గారు ఎంత శ్రద్ధగా సినిమాను తెరకెక్కించారో, అంతే ప్లానింగ్ తో పబ్లిసిటీ, రిలీజ్ చేసి సినిమాను తెలుగు ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేశారు. ఈ చిత్రంలో దేవగుడి వీరారెడ్డిగా నేను చేసిన పాత్ర నా కెరీర్ లో బెస్ట్ రోల్ అయ్యింది. ప్రతి రివ్యూలోనూ నా పేరుతోనే రాయడం మొదలుపెట్టారు. నటుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. అన్నిటికంటే ముఖ్యంగా మా దర్శకనిర్మాత హ్యాపీగా ఉన్నారు. అదే మాకు నిజమైన విజయం. అన్నారు.
నటీనటులు – అభినవ శౌర్య, నరసింహ తోషి, అను శ్రీ, రఘు బాబు, అన్నపూర్ణమ్మ, రఘు కుంచె, రాకెట్ రాఘవ, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, ఇమ్మానియేల్, ప్రభావతి, రాజశ్రీ నాయర్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————-
బ్యానర్ – పుష్యమి ఫిలింమేకర్స్
సమర్పణ – బెల్లం సుధ రెడ్డి
దర్శక నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి
సంగీతం: ఎస్ , కె మదీన్
డిఓపి: లక్ష్మీకాంత్ కనిక
ఎడిటర్: వి. నాగిరెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:- ప్రవీణ్ రెడ్డి అబ్బవరం









