ఎస్.ఎం`4 ఫిలింస్ పతాకంపై బేబీ షాన్వీ శ్రీ షాలిని సమర్పణలో సాగర్, వికాస్, అభిలాష్, రోహిత్, రవితేజ, హరి, శృతి శంకర్, విహారిక చౌదరి, ఉమ, హాన్విక, పల్లవి రేష్మ ప్రధాన తారాగణంగా ఎం.ఎన్.వి. సాగర్ స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు. ఫ్యామిలీ, లవ్, సస్పెన్స్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీపుల్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ టీజర్‌ను విడుదల చేశారు.
అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ… మనం ప్రతి ఒక్కరి జీవితంలోనూ కాలం కొన్ని కథలు రాస్తుంది. మనం ఏదో అవుదామనుకుని కెరీర్‌ను ప్రారంభిస్తే మరేదో అవుతుంటాము. అంటే కాలం మన జీవితంలో కూడా కొన్ని కథలను రాస్తుంది. దాన్ని బట్టే మన జర్నీ ఉంటుంది. దర్శకుడు సాగర్ గారు ఇంత మంచి టైటిల్ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే సగం విజయం సాధించారు. అలాగే ఒక్క కథతో కాకుండా పలు కథలను కలిపి సినిమాగా రాసుకోవడం నిజంగా హేట్సాఫ్. తన ప్రొడక్ట్ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇంత ధైర్యం చేయరు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
చిత్ర రచయిత, దర్శక, నిర్మాత సాగర్ మాట్లాడుతూ…
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ ప్రేమకథలో ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్, భక్తి మిళితం అయి ఉంటాయి. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరూ తమ బెస్ట్ లెవల్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ముందుగా ప్యాడిరగ్ ఆర్టిస్ట్‌లతో చేద్దాం అనుకున్నాము. కానీ కొత్త వారితో అయితే క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అవుతాయిని భావించి కొత్త వారిని తీసుకున్నాం. మొత్తం 6 కథలు ఇందులో కలిసి ఉంటాయి. నేచురాలిటీ కోసం కొత్త వారైనప్పటికీ వారితోనే డబ్బింగ్ చెప్పించడం జరిగింది. షూటింగ్ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగింది. సంగీత పరంగా కూడా మంచి క్యాచీ ట్యూన్స్ వచ్చాయి. మొత్తం 5 పాటలు ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. తప్పకుండా అందరినీ అలరించే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన శ్రీధర్ గారికి, సాయి వెంకట్ గారికి యూనిట్ తరపున ధన్యవాదాలు చెపుతున్నాను అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఎస్. ప్రసాద్, ఎడిటింగ్: ప్రదీప్ జె., సంగీతం: మేరుగు అరమాన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎం.ఎం. కుమార్, లిరిక్స్: ఎం.ఎన్.వి. సాగర్, శ్రీనివాస్ తమ్మిశెట్టి, కొరియోగ్రాఫర్: ఎం.ఎన్.వి. సాగర్, వి9 విజయ్, పి.ఆర్.ఓ: బి. వీరబాబు, రచన, నిర్మాత, దర్శకత్వం: ఎం.ఎన్.వి. సాగర్.
Gloriously “kalam raasina kathalu”
Teaser Launch Ceremony
Sagar, Vikas, Abhilash, Rohit, Ravi Teja, Hari, Shruti Shankar, Viharika Chaudhary, Uma, Hanvika, Pallavi Reshma are the main cast of M.N.V. Sagar’s self-written and directed film ‘Kalam raasina Kathalu’. The teaser release ceremony of this film, which is made in the genre of family, love and suspense, was held at Film Chamber in Hyderabad on Wednesday. People’s Media executive producer kasula Sridhar, who was the chief guest of the event, released the teaser.
Later Sridhar said… Time writes some stories in each of our lives. If we start our career thinking we are something, we become something else. That means time also writes some stories in our life. Our journey depends on it. I am very happy that director Sagar chose such a good title. Half the victory is achieved here. Also, writing multiple stories together as a movie instead of just one story is really hateful. Unless he has a lot of faith in his product, he would not dare to do this. I hope that this film will be successful and bring good name to all the unit.
Film writer, director and producer Sagar said…
Family emotions, suspense and devotion are mixed in this love story set in a rural setting. All the artists and technicians gave their best level performance. We thought we’d do it with Pading artists first. But we took new people as we felt that with new people, the characters will be elevated. All 6 stories are included in it. Dubbing was done with them even though they were newbies for naturalness. The shooting took place in the surrounding areas of Machilipatnam. In terms of music, there are good catchy tunes. There will be 5 songs in total. Post production is also complete. I am sure that it will be a movie that will entertain everyone. On behalf of the unit, I would like to thank Shridhar and Sai Venkat for accepting our invitation.
Camera for this film: S. Prasad, Editing: Pradeep J., Music: Merugu Araman, Background Score: M.M. Kumar, Lyrics: M.N.V. Sagar, Srinivas Tammishetti, Choreographer: M.N.V. Sagar, V9 Vijay, PRO: B. Veerababu, Writer, Producer, Director: M.N.V. Sagar.