• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, March 22, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల

Maari by Maari
March 22, 2026
in Cinema, Latest News, Movies, news
0
ఘనంగా ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ (Arere.. Arere..) మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల వేడుకకు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజర‌య్యారు.

ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, హీరో పూరి ఆకాష్, సినీ ప్రముఖులు సమీర్, సాగర్, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు, మిమిక్రి శివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఆడియోను విడుదల చేసి చిత్రబృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ…
“దియా ఒక వండర్‌ఫుల్ టాలెంట్. ఈ అరెరే.. అరెరే.. మ్యూజిక్ ఆల్బమ్ చాలా హృద్యంగా ఉంది. ఆమె గాత్రం, నటన రెండింట్లోనూ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కొత్త ప్రతిభలు ముందుకు రావడం తెలుగు సంగీత రంగానికి మంచి సంకేతం. ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ…
“ఇది డిజిటల్ యుగం. ప్రతిభ ఉన్నవారు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తమ టాలెంట్‌తోనే ముందుకు రావచ్చు. దియా అలాంటి ప్రతిభావంతురాలు. ఈ పాటలో ఆమె చూపించిన భావ వ్యక్తీకరణ, గాత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్ మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను” అని పేర్కొన్నారు.

నటి, సింగర్ దియా మాట్లాడుతూ…
“ఈ ఆల్బమ్ రూపుదిద్దుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా మీద నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించిన గౌరవనీయ అతిథులందరికీ నేను రుణపడి ఉంటాను. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే నాకు పెద్ద బలం” అని అన్నారు.

నటుడు పూరి ఆకాష్ మాట్లాడుతూ…
“దియాతో ‘మహబూబ’ సినిమాలో కలిసి పనిచేశాను. ఈ పాటలో నటించిందనుకున్నాను, కానీ ఆమె స్వయంగా పాడిందని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆమె చాలా ప్రతిభావంతురాలు. ఇలాంటి యంగ్ టాలెంట్‌ను అందరూ ప్రోత్సహించాలి. ఈ పాటను ప్రేక్షకులు సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

నటుడు, మిమిక్రి శివారెడ్డి మాట్లాడుతూ…
“దియాకు వద్ద టాలెంట్‌తో పాటు మంచి మనసు కూడా ఉంది. ఈ ఆల్బమ్ కోసం పనిచేసిన ప్రతి కళాకారుడి కృషి అభినందనీయం. ప్రేక్షకులు ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఈ ఆల్బమ్‌ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నిర్మాత నూతన్ చెకురి మాట్లాడుతూ…
“ఎప్పటి నుంచో ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ చేయాలన్న దియా కోరిక ‘అరెరే.. అరెరే..’ ద్వారా నెరవేరింది. ఆమె ప్రతిభపై నాకు ఉన్న నమ్మకం ఈ ప్రాజెక్ట్ ద్వారా మరింత బలపడింది. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఆల్బమ్ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాను” అని తెలిపారు.

దర్శకుడు క్రాంతి వర్మ మాట్లాడుతూ…
“ఈ సాంగ్ కోసం మా టీమ్ అంతా ఎంతో శ్రద్ధగా పని చేసింది. భావోద్వేగాలతో కూడిన అందమైన విజువల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతో రూపొందించాం. దియా అద్భుతమైన సహకారం అందించారు. ప్రేక్షకులు ఈ ఆల్బమ్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ శరవణ వాసుదేవన్ మాట్లాడుతూ..
“ఈ సాంగ్‌ను దియా గారు చాలా చక్క‌గా పాడారు. టీమ్‌లోని ప్ర‌తి ఒక్క‌రి కృషితో పాట ఇంత బాగా వ‌చ్చింది. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన పెద్ద‌లంద‌రికీ పేరుపేరున ధ‌న్య‌వాద‌లు” అని అన్నారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, కొత్త తరహా భావోద్వేగాలతో రూపొందిన ‘అరెరే.. అరెరే..’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, డియా గాత్రం ఈ మ్యూజిక్ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభినందించారు.

ఈ మ్యూజిక్ వీడియోకు క్రాంతి వర్మ దర్శకత్వం వహించగా, కె & ఎం రైటింగ్స్ కథను అందించారు. నిర్మాతగా నూతన్ చెకురి, సంగీతాన్ని శరవణ వాసుదేవన్ సమకూర్చారు. డీఓపీగా చందు ఏజే, ఎడిటర్‌గా ఆర్.ఎం. విశ్వనాథ్ కుచనపల్లి పనిచేశారు. పోస్టు ప్రొడక్షన్ పనులను పిక్సెల్‌పారెట్ పోస్టు నిర్వహించింది.

త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌తో పాటు స్పాటిఫై, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: క్రాంతి వర్మ
రచన: K&M రైటింగ్స్
నిర్మాత: నూతన్ చేకూరి
సంగీతం: శరవణ వాసుదేవన్
DOP: చందు AJ
ఎడిటర్: RM విశ్వనాధ్ కూచనపల్లి
పోస్ట్ ప్రొడక్షన్: పిక్సెల్ ప్యారెట్ పోస్ట్
టైటిల్ డిజైన్: తులసి కృష్ణ
చీఫ్ AD: కోటి విరూపాక్షి
సహాయ దర్శకులు: గడ్డం యశ్వంత్ చౌదరి, ప్రేమ్ కుమార్, భరత్ రామ్
పీఆర్ఓ: అశోక్ దయ్యాల

Grand Launch of ‘Arere.. Arere..’ Music Video Album in Hyderabad

The grand launch of the music video album ‘Arere.. Arere..,’ featuring singer and actress Diya, took place at Prasad Labs, Hyderabad. Produced under the Butterfly Music banner, the event was graced by several prominent personalities from the Telugu film industry.

The ceremony saw the participation of V.N. Aditya (President of the Telugu Film Directors Association), actor Puri Akash, actors Sameer and Sagar, renowned music director Raghu Kunche, and actor-mimicry artist Siva Reddy as chief guests. They officially released the audio and extended their best wishes to the entire team.

Highlights from the Event:

V.N. Aditya (President, TFDA):
“Diya is a wonderful talent. The ‘Arere.. Arere..’ music album is very heart-touching. Her prowess in both singing and acting is clearly visible. It is a great sign for the Telugu music industry when such new talent comes forward.”

Music Director Raghu Kunche:
“In this digital era, talented individuals don’t need to wait for opportunities; they can carve their own path. Diya’s expression and vocals in this song are sure to captivate the audience. I am confident this track will be a big hit.”

Actress & Singer Diya:

“I am deeply grateful to everyone who helped bring this album to life. My special thanks to the team for believing in me. I am indebted to the guests who came to bless us today. The love and support of the audience are my greatest strengths.”

Actor Puri Akash:
“I worked with Diya in the movie Mehbooba. I initially thought she only acted in this song, but I was surprised to learn she sang it herself. She is incredibly talented, and such young talent deserves everyone’s encouragement.”

Producer Nutan Chekuri & Director Kranthi Varma:
The makers expressed their satisfaction with the final output, noting that the album was created with deep emotion and visual beauty. They thanked Diya for her exceptional cooperation throughout the project.

The music video will soon be available on YouTube, as well as digital streaming platforms like Spotify, Apple Music, and Amazon Music.

Technical Crew:
Singer and Actress: Diya
Direction: Kranthi Varma

Written by: K&M Writings
Producer: Nutan Chekuri
Music: Saravana Vasudevan
DOP: Chandu AJ
Editor: RM Vishwanadh Kuchanapally
Post-Production: Pixel Parrot Post
PRO: Ashok Dayyala

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన సస్పెన్స్ డ్రామా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా… ఇది ప్రతి ఒక్కరి జీవితానికి రిలేట్ అవుతుంది- హీరో కిరణ్ అబ్బవరం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల

ఘనంగా ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల

by Maari
March 22, 2026
0

గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన సస్పెన్స్ డ్రామా  “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా… ఇది ప్రతి ఒక్కరి జీవితానికి రిలేట్ అవుతుంది- హీరో కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన సస్పెన్స్ డ్రామా “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా… ఇది ప్రతి ఒక్కరి జీవితానికి రిలేట్ అవుతుంది- హీరో కిరణ్ అబ్బవరం

by Maari
March 22, 2026
0

ఘనంగా ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్

ఘనంగా ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్

by Maari
March 22, 2026
0

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

by Maari
March 21, 2026
0

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్.. మార్చి 26న మూవీ గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్.. మార్చి 26న మూవీ గ్రాండ్ రిలీజ్

by Maari
March 21, 2026
0

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

by Maari
March 21, 2026
0

టీడీపీ రాజ్యసభ సీటు చింతకాయల విజయ్ కే..?!!

టీడీపీ రాజ్యసభ సీటు చింతకాయల విజయ్ కే..?!!

by Maari
March 21, 2026
0

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో శ్రీకాంత్

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో శ్రీకాంత్

by Maari
March 21, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.