• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, March 1, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

Maari by Maari
February 28, 2026
in Cinema, Latest News, Movies, news, special
0
హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా జానర్స్ కు ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న మొదటి చిత్రం ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ముహూర్తపు షాట్ కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు.
ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్ తో పాటు సీనియర్ నటులు దేవీ ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘‘సినిమా అనేది నాకు ఒక కల. ఒక అభిరుచి. ఒక బాధ్యత. అదే ప్రేమతో ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాను. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నా తొలి చిత్రాన్ని అత్యంత ప్రెస్టేజీయస్‌గా నిర్మిస్తున్నాం. మా మొదటి ప్రాజెక్ట్ ఒక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఈ మూడు ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా ఈ కథను ఎంపిక చేసుకున్నాం. ప్రతి యువకుడి మనసుకు దగ్గరయ్యే భావాలు, ప్రతి కుటుంబం ఆస్వాదించే వినోదం ఈ చిత్రంలో ఉంటాయి. మంచి కథకు ప్రాధాన్యం ఇస్తూ, టెక్నికల్‌గా ఉన్నత ప్రమాణాలతో, నాణ్యమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. కొత్త ప్రతిభకు అవకాశం ఇవ్వడమే కాకుండా, అనుభవజ్ఞులైన టెక్నీషియన్ల సహకారంతో ప్రతి ఫ్రేమ్‌ అందంగా కనిపించేలా కృషి చేస్తున్నాం. ఈ చిత్రం నిర్మాతగా తొలి అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరెన్నో మంచి, అర్థవంతమైన చిత్రాలకు పునాది అవుతుందని నమ్ముతున్నాను.
ప్రేక్షకుల ఆశీస్సులు, మీడియా మిత్రుల ప్రోత్సాహం, సినీ పరిశ్రమలోని అందరి సహకారం మా బలం. మీ అందరి ప్రేమాభిమానాలతో ఈ ప్రయాణం విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నాను”అని అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శకుడు రఘువర్ధన్ కోట్ల తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

Next Post

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

Next Post
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి 'మంగళస్నానం' లిరికల్‌ సాంగ్‌ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

by Maari
February 28, 2026
0

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

by Maari
February 28, 2026
0

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

by Maari
February 28, 2026
0

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

by Maari
February 28, 2026
0

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

by Maari
February 28, 2026
0

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

by Maari
February 28, 2026
0

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు.. గుప్తులు, చోళుల నాణేలు

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు.. గుప్తులు, చోళుల నాణేలు

by Maari
February 28, 2026
0

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

by Maari
February 27, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.