• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

admin by admin
June 26, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, special
0
సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఈ సందర్భంగా మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ అనే ఓ ఈవెంట్‌ను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘విజయ్ ఆంటోని గారిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను. ఆయనకు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. నేను అలాంటి వారు తీసే చిత్రాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాను. అందుకే నేను ‘మార్గన్’ మూవీని తీసుకుని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఆయన ప్రొడక్షన్ కంపెనీ, వాల్యూ, మేకింగ్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం.’ అని అన్నారు.

విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ .. ‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప నిర్మాత. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా మొదటి సక్సెస్. లియో జాన్ పాల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు. ఇందులో చాలా లేయర్లు ఉంటాయి. నేను కంటెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే కథ రివీల్ అవుద్ది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది. నేను ఈ సినిమాకు సంగీతాన్ని అందించాను. భద్రకాళి, లాయర్ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాను. నేను ప్రస్తుతం ఆరేడు సినిమాల్ని నిర్మిస్తున్నాను. మా ‘మార్గన్’ ప్రస్తుతం తమిళ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మా సిస్టర్ సన్ అజయ్ ధీషన్ బిచ్చగాడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అతడ్ని ఈ చిత్రంతో నటుడిగా పరిచయం చేస్తున్నాను. భాష్యశ్రీ గారి పాటలు, మాటల వల్ల ఇది పూర్తి తెలుగు సినిమాగా అనిపిస్తోంది. బ్రిగిడ, దీప్శిఖ గొప్పగా నటించారు. జూన్ 27న రాబోతోన్న మా ‘మార్గన్’ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

అజయ్ ధీషన్ మాట్లాడుతూ .. ‘మా ‘మార్గన్’ మూవీ రేపు (జూన్ 27) రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్‌లా ఉండదు. ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. మా డైరెక్టర్ లియో జాన్ పాల్ నా మీద ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చారు. నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చినా ఫాతిమా గారికి, విజయ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

బ్రిగిడ మాట్లాడుతూ .. ‘మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ గారికి థాంక్స్. ‘మార్గన్’తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రతీ సారి తెలుగు ఆడియెన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఈ చిత్రంతోనూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జూన్ 27న మా ‘మార్గన్’ రాబోతోంది. అందరూ చూడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి థాంక్స్’ అని అన్నారు.

దీప్శిఖ మాట్లాడుతూ.. ‘‘మార్గన్’ చిత్రంలో నా పాత్ర అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి, లియో జాన్ పాల్ గారికి థాంక్స్. మా సినిమాను సురేష్ బాబు గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ టీంతో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ.. ‘విజయ్ ఆంటోని గారితో నా ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 127 నిమిషాల నిడివితో రాబోతోన్న ఈ చిత్రం ప్రతీక్షణం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. బ్రిగిడ, దీప్శిఖ, అజయ్ పాత్రలు అద్భుతంగా ఉంటాయి. నన్ను నమ్మి అవకాశం ఇస్తున్న విజయ్ ఆంటోని గారికి థాంక్స్. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్

సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు: లియో జాన్ పాల్
నిర్మాత: విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్
ప్రెజెంట్స్: సర్వాంత్ రామ్ క్రియేషన్స్, జె.రామాంజనేయులు
సంగీతం: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ: యువ ఎస్
ఆర్ట్ డైరెక్టర్: రాజా ఎ
PRO: సాయి సతీష్

I really admire Vijay Antony’s passionate filmmaking: Suresh Babu at Maargan Pre-Release Live Interrogation Event

Actor and producer Vijay Antony stars in Maargan, a film directed by Leo John Paul. It is being produced by Vijay Antony Film Corporation, and proudly presented in Telugu by J. Ramanjaneyaulu under the Sarvanth Ram Creations banner. The film is set to release in Telugu on June 27, with Suresh Babu distributing it.

The teaser and trailer have already raised expectations among audiences. In anticipation of the release, the film’s team hosted a unique promotional event titled ‘Maargan’ Pre-Release Live Interrogation.

*During the event, producer Suresh Babu said:* “I’ve been following Vijay Antony’s journey for quite some time—from music director to actor, producer, and director. He is deeply passionate about cinema, and I enjoy watching films made by such individuals. That’s why I decided to bring Maargan to Telugu audiences. I really appreciate his production quality, values, and filmmaking style.”

*Vijay Antony shared:* “I sincerely thank Suresh Babu sir for releasing our film in Telugu. He’s a remarkable producer, and I hope to collaborate with him in the future. The fact that he’s releasing our film is already a big success for us. Director Leo John Paul has crafted this film beautifully. Maargan isn’t a typical serial killer movie, it has many layers. I can’t say too much or it might give away the plot. But from the first frame to the last, it keeps the audience engaged. I composed the music for this film. I’m also scoring music for Bhadrakali and Lawyer. I’m currently producing around six films. We’re releasing Maargan simultaneously in Tamil and Telugu.

My sister’s son, Ajay Dhishan, who previously worked as an assistant director on Bichagadu, is making his acting debut with this film. Thanks to lyricist Bhashyasree for his lyrics and dialogues making this feel like a full-fledged Telugu film. Actors Brigida and Deepshikha have also delivered strong performances. Please watch Maargan on June 27.”

*Ajay Dhishan, who is debuting in this film, said:* “Our movie Maargan is releasing tomorrow (June 27). Don’t miss it! It’s not a regular crime thriller—it offers a unique experience. From start to finish, it’s a true edge-of-the-seat thriller. I’m grateful to director Leo John Paul for trusting me with this opportunity, and I thank Vijay Antony sir and Fatima ma’am for believing in me.”

*Brigida expressed:* “Thanks to Suresh Babu sir for releasing our film in Telugu. I’m very happy to be coming in front of the Telugu audience with Maargan. They’ve always supported me, and I hope they continue to do so with this film as well. Thank you to Vijay Antony sir for giving me this opportunity.”

*Deepshikha stated:* “I believe audiences will love my character in Maargan. I’m thankful to Vijay Antony sir and Leo John Paul sir for this opportunity. Working with this team has been a great learning experience. Vijay Antony’s music in this film is simply amazing. Please watch our film and show your support.”

*Writer Bhashyasree said:* “There’s nothing more to say about my journey with Vijay Antony—it speaks for itself. Maargan, with a runtime of 127 minutes, is thoroughly engaging from start to finish, with no dull moments. The roles played by Brigida, Deepshikha, and Ajay are all excellent. I thank Vijay Antony sir for trusting me once again. This is a film meant to be experienced in theatres—please make sure to watch it!”

Previous Post

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

Next Post

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.