• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, December 6, 2025
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

Maari by Maari
July 27, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

Share and Enjoy !

Shares
Twitter

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్‌డమ్’ చిత్రంతో ఘన విజయం సాధిస్తాను : కథానాయకుడు విజయ్ దేవరకొండ

తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.

‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “గత సంవత్సర కాలంగా ‘కింగ్‌డమ్’ గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.

కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, “నేను చేసింది ఒక్క సినిమానే అయినా.. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. దర్శకుడు గౌతమ్ గారు ‘కింగ్‌డమ్’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. విజయ్ దేవరకొండ గారికి తన వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ పడిన కష్టాన్ని త్వరలో ప్రేక్షకులు స్క్రీన్ పై చూడబోతున్నారు. అనిరుధ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాగవంశీ గారు ఒకే సమయంలో ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నా.. ప్రతి సినిమాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. జూలై 31న విడుదలవుతున్న ‘కింగ్‌డమ్’ మీ అందరికీ నచ్చుతుందని, మీ హృదయం లోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఈ ‘కింగ్‌డమ్’ సినిమా మా రెండున్నరేళ్ల కష్టం. నేను, గౌతమ్ 2018లో జెర్సీ సినిమా చేసి జాతీయ అవార్డు అందుకున్నాం. ఆ తర్వాత గౌతమ్ ఐదేళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఇది. రెండున్నరేళ్ల నుంచి ప్రొడక్షన్ లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్ స్టర్ సినిమాని చూపించబోతున్నాము. మీరు ట్రైలర్ లో చూసింది శాంపిల్ మాత్రమే. విజయ్ దేవరకొండ గారి అభిమానులు గత నాలుగైదు సంవత్సరాలలో ఏం మిస్ అయ్యారో.. ఆ ఇంటెన్సిటీ ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ గారి కళ్ళలో ఏ ఇంటెన్సిటీ చూశారో.. అది ఇందులో ఉంటుంది. విజయ్ గారి కోసం నేను, గౌతమ్ 100 శాతం ఎఫర్ట్ పెట్టి.. మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. జూలై 31 విడుదలవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లకు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.”

‘కింగ్‌డమ్’ కథ చాలా బలంగా, అద్భుతంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది. కేవలం యాక్షన్ తో నిండి ఉండటమే కాకుండా.. పాత్రల మధ్య బంధాన్ని చూపించే బలమైన భావోద్వేగాలను కలిగి ఉంది. సూరిగా విజయ్, శివగా సత్యదేవ్ కనిపిస్తున్నారు. ఆ పాత్రల మధ్య సన్నివేశాలు కట్టిపడేస్తున్నాయి. ఇవి లోతైన మరియు అర్థవంతమైన అనుభూతిని ఇస్తున్నాయి. మొత్తానికి బలమైన భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన కథను ‘కింగ్‌డమ్’లో చూడబోతున్నామని ట్రైలర్ తో అర్థమవుతోంది.

విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రజెన్స్ తో గత కొద్ది సంవత్సరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా భావోద్వేగాలను పండించడంలో ఆయన దిట్ట. ఇప్పుడు ‘కింగ్‌డమ్’ ట్రైలర్ వెండితెరపై విజయ్ అందించే గొప్ప విందును ప్రతిబింబిస్తుంది.

ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. బలమైన నాటకీయతను, భావోద్వేగ క్షణాలతో మిళితం చేస్తూ కథను చెప్పడం గౌతమ్ శైలి. ‘కింగ్‌డమ్‌’లోనూ తనదైన శైలిని చూపిస్తున్నారు.

జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ లు తమ కెమెరా పనితనంతో ప్రతి ఫ్రేమ్ ను అందంగా, అర్థవంతంగా చూపించారు. ఎడిటర్ నవీన్ నూలి తన పనితీరుతో ట్రైలర్‌ను మరింత శక్తివంతంగా మరియు ఆకర్షణీయంగా మలిచారు.

ఇప్పటికే ‘హృదయం లోపల’, ‘అన్నా అంటేనే’ గీతాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. ట్రైలర్ లో అద్భుతమైన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళారు.

ట్రైలర్ తో ‘కింగ్‌డమ్’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతోన్న ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకరా స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

Kingdom Trailer Out Now: raised the expectations to the max.

The official trailer of Kingdom starring Vijay Deverakonda has landed and looks like a blockbuster ride. Directed by Gowtam Tinnanuri and Produced by Naga Vamsi and Sai Soujanya. Film gears up for its release on July 31, 2025

The trailer tells the story in a very strong and striking way. It is not just full of action but also has many emotional moments that show the bond between the characters. The scenes between Vijay’s Suri and Satyadev’s Siva stand out with great chemistry giving the film a deep and meaningful feel. You can clearly sense the emotions and high stakes in the story.

Vijay’s performance is already being hailed as his most riveting in recent years packed with raw aggression, emotional range and sheer screen presence. This trailer sets the tone for the big treat he delivers on the silver screen

Gowtam brings his own style to Kingdom, mixing strong drama with smooth storytelling and emotional moments. Editor Navin Nooli adds sharp, perfect cuts that make the trailer even more powerful and engaging.

Composer Anirudh Ravichander has returned with a background score that elevates every scene . Having already delivered hits like Anna Antene and Hridayam Lopala his music sets a tone for Kingdom’s emotional and narrative arcs

Cinematography by Jomon T. John & Girish Gangadharan and editing by the Navin Nooli .

Produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios.

Looks Like All stars are aligning for a massive blockbuster on July 31.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

Next Post

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

Next Post
సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన "ఫైటర్ శివ" ఫస్ట్ లుక్ పోస్టర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా షూటింగ్ పూర్తి

వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా షూటింగ్ పూర్తి

by Maari
December 6, 2025
0

విధాత తొలి కాపీ సిద్ధం

విధాత తొలి కాపీ సిద్ధం

by Maari
December 2, 2025
0

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఖరారు

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఖరారు

by Maari
December 1, 2025
0

Kalyan Padala Trended Nationally on Twitter X With 250K+ Tweets After Becoming Final Captain of Bigg Boss Telugu 9

Kalyan Padala Trended Nationally on Twitter X With 250K+ Tweets After Becoming Final Captain of Bigg Boss Telugu 9

by Maari
December 1, 2025
0

సందడి చేసిన సినీనటి సంయుక్త మీనన్

సందడి చేసిన సినీనటి సంయుక్త మీనన్

by Maari
November 30, 2025
0

ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ జాదవ్ పయెంగ్  అరుదైన గౌరవం.. ‘సంకల్ప కిరణ్’ పురస్కారంతో సన్మానం

ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ జాదవ్ పయెంగ్ అరుదైన గౌరవం.. ‘సంకల్ప కిరణ్’ పురస్కారంతో సన్మానం

by Maari
November 29, 2025
0

తిరుపతిలో సందడి చేసిన దేవగుడి చిత్ర యూనిట్

తిరుపతిలో సందడి చేసిన దేవగుడి చిత్ర యూనిట్

by Maari
November 29, 2025
0

థియేటర్లలో దూసుకెళుతోన్న ‘ప్రేమలో రెండోసారి’.. త్వరలో ప్రముఖ ఓటీటీలో విడుదల

థియేటర్లలో దూసుకెళుతోన్న ‘ప్రేమలో రెండోసారి’.. త్వరలో ప్రముఖ ఓటీటీలో విడుదల

by Maari
November 27, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.