యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా హీరోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించిన చిత్రం ‘‘కేడీ : ది డెవిల్’. ఈ మూవీని దర్శకుడు ప్రేమ్స్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ ప్రాజెక్ట్‌ని ఏప్రిల్ 30, 2026న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మంచి ఊపునిచ్చే మాస్ బీట్‌ను విడుదల చేశారు.
నోరా ఫతేహీ, సంజయ్ దత్ కాంబోలో వచ్చే ఈ మాస్ బీట్ యూత్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. ‘జరిపెయ్ నాతో పండుగ జరిపెయ్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటను తెరకెక్కించిన తీరు, కంపోజ్ చేసిన స్టెప్పులు, నోరా ఫతేహీ గ్లామర్ ట్రీట్ ఆడియెన్స్‌కి కిక్కిచ్చేలా ఉన్నాయి.
అర్జున్ జన్య ఇచ్చిన మాస్ బాణీకి, మంగ్లీ గాత్రం మరింతగా తోడైంది. ఈ పాటకు చంద్ర బోస్ అందించిన సాహిత్యం కూడా ఎంతో సరళంగా, వినసొంపుగా ఉంది. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట విజువల్ ట్రీట్‌లా మారింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.










