క్రైం సస్పెన్స్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. సరైన కథ, కథనాలతో గ్రిప్పింగ్ గా తెరమీద చూపించగలిగితే… ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించొచ్చు. అందుకే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని కొత్త దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎంచుకుంటూ ఉంటారు. రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్స్ ని గానీ… ఫిక్షనల్ గా గానీ… స్టోరీలైన్ ను తీసుకుని వాటిని ఇంట్రెస్టింగ్ గా వెండితెరపై ఆవిష్కరిస్తే… ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయం. తాజాగా గతంలో జైళ్ల శాఖలో డిప్యూటి జైలర్ గా పనిచేసిన రామ్ గన్ని అనే నూతన దర్శకుడు ‘ది ట్రయల్’ పేరుతో తెలుగులో ఓ ఫస్ట్ ఇంటరాగేటివ్ సినిమాని తెరకెక్కించారు. ఇందులో స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ పోషించారు. ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ముందుగా మీడియాకోసం ప్రీమియర్ షోను ప్రదర్శించింది చిత్రం బృదం. మరి టాలీవుడ్ లో ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిలింగా విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిందో చూద్దాం పదండి.
కథ: అజయ్(యుగ్ రామ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. రూప(స్పందన పల్లి) పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఎస్.ఐ.గా పనిచేస్తుంటారు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన మ్యారేజ్. చాలా అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల మధ్య ఓ డైరీ విషయంలో డిఫరెన్సెస్ వస్తాయి. వీరిద్దరూ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్శరీ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఓ భవంతిపై గ్రాండ్ గా ఏర్పాటు చేసుకుంటారు. అయితే అక్కడ అజయ్ అనుమానాస్పద స్థితిలో భవనంపై నుంచి కింద పడి చనిపోతారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని… అజయ్ భార్య రూపను ఇంటారాగేషన్ చేయడం మొదలు పెడతారు? అజయ్ ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు? రూప, అజయ్ ల మధ్య డిఫరెన్సెస్ రావడానికి కారణమైన ఆ డైరీలో ఏముందు? ఈ డైరీ కేసు దర్యాప్తునకు ఎంత వరకూ ఉపయోగపడింది? ఇందులో ఇంటాగాగేషన్ అధికారిగా వ్యవహరించిన రాజీవ్(వంశీ)కి, రూపకి ఉన్న కనెక్షన్ ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే ‘ది ట్రయల్’ సినిమాని చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇలాంటి కథలకు స్టోరీలైన్ చాలా సింపుల్ గా ఉన్నా… దాన్ని ముందుకు నడిపించే స్క్రీన్ ప్లే మాత్రం ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు కథలో లీనమై పోతారు. ఆ స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్ గా కాకుండా ఆసక్తికరమైన మలుపులతో ఉంటే… ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారు. నూతన దర్శకుడు రామ్ గన్ని ఈ చిత్రానికి రాసుకున్న కథనం కూడా ఇలాగే ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్న మనస్పర్దకి… దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. దర్శకుడు చెప్పినట్టు గతంలో మనం చూసిన అడివి శేష్ నటించిన ఎవరు, హాలీవుడ్ చిత్రాలైన సేవ్ ది క్యాట్, అకిరా కురసోవా లాంటి స్క్రీన్ ప్లే ప్యాట్రన్ తో ఈ సినిమా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఇంట్రాగేషన్ లో రూప ఇచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతాయి. ఫస్ట్ హాఫ్ లో డైరీ ఆధారంగా, సైకియాట్రిస్ట్, అజయ్ కుటుంబ సభ్యులు ఇచ్చే ఆధారాలను బేస్ చేసుకుని విచారణ కొనసాగుతుంది. సెకెండాఫ్ లో వచ్చే ట్విస్టులు మాత్రం సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తాయి. ప్రీ క్లై మాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లే ఆడియన్స ని కుర్చీలో నుంచి కదలకుండా చేస్తుంది. అజయ్ మరణించిన విధానాన్ని సస్పెన్స్ గా చూపించి… ఆ తరువాత అతని మరణం ఎలా సంభవించిందనేదాన్ని చివరిదాకా రివీల్ చేయకుండా రివీల్ చేయకుండా ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీని అయితే పెంచేశాడు దర్శకుడు. ఇలాంటి జోనర్స్ ఇష్టపడే వారికి ‘ది ట్రయల్’ మూవీ నచ్చుతుంది. సినిమా నిడివి కూడా 100 నిమిషాలే కాబట్టే ఓ సారి చూసేయచ్చు.
ఇందులో పోలీసు అధికారిగా హీరోయిన్ స్పందన పల్లి కరెక్ట్ గా యాప్ట్ అయింది. తన హైటు బాగా సరిపోయింది. ఓ పోలీసు అధికారి విచారణ ఎదుర్కొవాల్సి వస్తే… ఆ ఆధికారి ఇంట్రాగేషన్ అధికారులు అడిగే ప్రశ్నలకు ఎంత కాన్ఫిడెంట్ గా సమాధానాలు ఇవ్వచ్చనే దాన్ని మహిళా ఎస్.ఐ.రూప పాత్రలో చాలా తెలివిగా చూపించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో వంశీ కోటు చాలా సీరియస్ గా నటించారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు బాగా యాప్ట్ అయ్యారు. అమాయకమైన సాప్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో యుగ్ రామ్ మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు రామ్ గన్ని రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా వుంది. సుమారు గంటన్నరపాటు కేవలం ఇంటరాగేషన్ మీద ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం మామూలు విషయం కాదు. అలాంటిది చాలా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని ఇంటరాగేషన్ చుట్టూ తిప్పుతూ.. ప్రేక్షకులను కట్టిపడేసాడు. దీనికి నేపథ్య సంగీతం కూడా తోడైంది. సినిమాటోగ్రఫీ క్వాలిటీగా వుంది. హీరో, హీరోయిన్స్ ని బాగా చూపించారు. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా వుంది. ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపకుండా ఖర్చు పెట్టారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3