మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. “పళ్లి చట్టంబి” సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ – “పళ్లిచట్టంబి” చిత్రానికి తెలుగు వెర్షన్ సాంగ్స్ రాశాను. టొవినో థామస్ కు నేను రూసిన మూడో చిత్రమిది. గతంలో మాయానది, వ్యూహం అనే ఆయన సినిమాలకు పాటలు రాశాను. టొవినో థామస్ అంటే ఆలిండియా ఫేమస్. కయదు ఫస్ట్ సినిమా అల్లూరి. ఆ చిత్రానికి నేను అన్ని సాంగ్స్ రాశాను. జేక్స్ బిజోయ్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కంపోజ్ చేసిన తుడరుమ్, కొత్తలోక తర్వాత ఈ సినిమాకు సాహిత్యాన్ని అందిస్తున్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు
యాక్టర్ శత్రు మాట్లాడుతూ – నేను మలయళంలో నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా కథ దర్శకుడు చెప్పినప్పుడు సర్ ప్రైజ్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ మూవీలో నేనొక కీ రోల్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ కు డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను. టొవినోతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. అన్నారు.
అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘశ్యామ్ – నాకు సపోర్ట్ గా నిలిచి ఈ వేదిక మీద నిల్చునేలా చేసిన మా ఏలూరు శ్రీను, బన్నీ వాస్, మారుతి, విశ్వప్రసాద్, వివేక్..ఇలా పెద్దలందరికీ థ్యాంక్స్. “పళ్లిచట్టంబి” ఒక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్. దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ మూవీ కోసం మా టీమ్ అంతా చాలా కష్ట పడ్డాం. మంచి ఔట్ పుట్ వచ్చింది. టొవినో, కయదుతో నేను రెండో సినిమా చేస్తున్నా. తెలుగులో మా మూవీ రిలీజ్ కు బన్నీ వాస్ గారు సపోర్ట్ చేస్తున్నారు. థియేటర్స్ లో మా సినిమాను చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ వెట్రి మాట్లాడుతూ – “పళ్లిచట్టంబి” ప్రేక్షకులు తప్పక చూడాల్సిన మూవీ. ఈ సినిమాను డైరెక్టర్ డిజో అద్భుతంగా తెరకెక్కించాడు. జేక్స్ ఇచ్చిన మ్యూజిక్ ఈ మూవీకి ఆకర్షణగా నిలుస్తుంది. తెలుగు రిలీజ్ కు సపోర్ట్ చేస్తున్న బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ చాణక్య మాట్లాడుతూ – మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ డిజో అందరికీ నచ్చేలా సినిమా తెరకెక్కించాడు. మరికొద్ది రోజుల్లోనే మా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ చైతన్య మాట్లాడుతూ – మా మూవీ ఈవెంట్ కు ఇంతమంది అతిథులు రావడం సంతోషంగా ఉంది. నిర్మాతలుగా ఇది మా తొలి ప్రయత్నం. మా మూవీని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ చరణ్ మాట్లాడుతూ – మేము నెల్లూరు నుంచి కేరళ వెళ్లి మలయాళంలో ఇలాంటి పెద్ద మూవీ చేయడం హ్యాపీగా ఉంది. టొవినో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మాతో కలిసిపోయారు. ఆయన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. కయదు లోహర్ ఆమె కెరీర్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసింది. శత్రు ఇంపార్టెట్ రోల్ చేశారు. తెలుగు రిలీజ్ కు సపోర్ట్ చేస్తున్న బన్నీ వాస్ అన్నకు థ్యాంక్స్. డైరెక్టర్ మారుతి మాకు మంచి ఫ్రెండ్. ఆయన ఈ రోజు రాలేకపోయారు. ఈ సినిమా మేకింగ్ లో మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు మేఘశ్యామ్. ఆయన వల్లే ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా చేయగలిగాం. ఈ చిత్రంతో మా సంస్థకు మంచి సక్సెస్ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – మారుతి గారు ఈ ప్రొడ్యూసర్స్ టీమ్ ను పరిచయం చేశారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత ఒక ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నారని తెలిసింది. కొచ్చి తీసుకెళ్లి ఈ సినిమా చూపించారు. మన తెలుగు వాళ్లు కేరళ వెళ్లి ఇలాంటి ఒక భారీ చిత్రాన్ని నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమా టెక్నికల్ చాలా క్వాలిటీగా హ్యూజ్ గా ఉంటుంది. తెలుగు ఆడియెన్స్ కు ఒక కొత్త కమర్షియల్ మూవీ అవుతుంది. మలయాళం మూవీస్ అంటే మనం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ గాన భావిస్తాం కానీ పళ్లిచట్టంబి ఒక భారీ మంచి కమర్షియల్ మూవీ. తెలుగులో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. మా దగ్గరకు పదేళ్ల క్రితం వచ్చి మాతో ట్రావెల్ అయిన మేఘశ్యామ్ ఈ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. టొవినో గారు చేసిన 2018 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాం. మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో ఆయన పర్ ఫార్మెన్స్, ఫైట్స్ ఆకట్టుకుంటాయి. నాకు మోహన్ లాల్ గారిని చూసినట్లు అనిపించింది. ఈ సినిమా తర్వాత కయదుకు మరింతమంది ఫ్యాన్స్ పెరుగుతారు. డైరెక్టర్ ఈ మూవీని తీసిన విధానం, ఎడిటింగ్ చేయించిన విధానం బాగా నచ్చింది. ఒక న్యూ కమర్షియల్ మూవీ చూడాలంటే పళ్లిచట్టంబి థియేటర్స్ లో చూడండి. అన్నారు.
డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ మాట్లాడుతూ – నేను డైరెక్ట్ చేసి నాలుగో చిత్రమిది. తెలుగు ఆడియెన్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో నేను చేసిన గత చిత్రం జనగణమన కు తమ అప్రిషియేషన్ ఇచ్చారు. డైరెక్టర్ రాజమౌళి గారు మా మూవీ గురించి స్పందించారు. పళ్లిచట్టంబి కూడా మీకు నచ్చేలా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సింపుల్ స్టోరీ ఇది. మనుషులంతా ఒక్కటే అనేది ఈ మూవీ ప్రధాన కథాంశం. లవ్, లివ్, లవ్ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాను. పళ్లిచట్టంబి అనేది ఒక టర్మ్. కథలో టైటిల్ రోల్. అందుకే టైటిల్ ను మార్చకుండా ప్రతి భాషలోనూ ఇదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నాం. కేరళలో 50వ దశకంలో జరిగిన ఘటన ఈ సినిమాకు నేపథ్యం. పొలిటికల్ గా ఎన్ని మార్పులు వచ్చినా మనుషులుగా మన జీవిత సంఘర్షణ మారలేదు. ఆ ఒరిజినాలిటీ స్క్రీన్ మీదకు తెచ్చేందుకు పీరియాడిక్ గానే సినిమాను రూపొందించాం. అన్నారు.
హీరోయిన్ కయదు లోహర్ మాట్లాడుతూ – పళ్లిచట్టంబి నాకు ఒక స్పెషల్ మూవీ. ఈ సినిమాలో రెబెకా అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ క్యారెక్టర్ నా మనసుకు ఎంతో దగ్గరైంది. రెబెకా అందంతో పాటు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులు ఇష్టపడతారు. ఒకరకంగా నాకు డ్రీమ్ రోల్ ఇది. ఇలాంటి మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ డిజోకు థ్యాంక్స్. ఈ మూవీ కోసం మా టీమ్ అంతా సుదీర్ఘమైన ప్రయాణం చేసింది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. మనమంతా సక్సెస్ పార్టీ చేసుకుంటాం. టొవినో మంచి కోస్టార్. అతనితో కలిసి నటించడం ఇన్స్ పైరింగ్ గా ఉంటుంది. పళ్లిచట్టంబి లేకుంటే రెబెకా లేదు. పళ్లిచట్టంబి బ్యూటిఫుల్ మూవీ. ఈ నెల 10న థియేటర్స్ కు వెళ్లి చూడండి. ఈ సినిమా చూసి థియేటర్స్ నుంచి ఒక మంచి ఎమోషన్ తో బయటకు వస్తారు. ఆ ఫీలింగ్ మీ మనసులో ఉండిపోతుంది. అన్నారు.
హీరో టొవినో థామస్ మాట్లాడుతూ – నేను డైరెక్టర్ డిజో ఈ ప్రాజెక్ట్ చేయాలని గత కొన్నేళ్లుగా అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. 50వ దశకం నేపథ్యంగా సాగే చిత్రమిది. అప్పటి వాతావరణం కనిపించేలా సినిమాను రూపొందించేందుకు చాలా రీసెర్చ్ చేశాం. 50వ దశకం సినిమా 2026లో ప్రేక్షకులకు నచ్చేలా చేశాం. ఎంతో ప్యాషనేట్ టీమ్ తోడు లేకుంటే ఇలాంటి మూవీ తెరకెక్కించడం సాధ్యం కాదు. డిజో, నేను ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేయాలని కూడా డిస్కషన్స్ చేసుకున్నాం. ఈ మూవీ షూటింగ్ టైమ్ కు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు డిజో. ప్రొడ్యూసర్ చరణ్, చైతన్య, చాణక్య ఒక టీమ్ లా వర్క్ చేసుకుంటూ తమ కలల్ని నిజం చేసుకుంటున్నారు. నౌఫల్, బ్రిజీష్ లాంటి మంచి ప్రొడ్యూసర్స్ లేకుంటే పళ్లిచట్టంబి లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. వాళ్లిద్దరు మూవీకి బ్యాక్ బోన్ లా ఉన్నారు. ఒక ముఖ్య పాత్రలో నటించిన శత్రు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. కయదు ఈ సినిమాలో నటించేటప్పుడు చాలా ప్రిపేర్ అయ్యేది. అప్పుడే నటన పట్ల ఆమెకున్న ప్యాషన్ చూశాను. ఒకేసారి అనేక భాషల్లో నటించడం ఈజీ కాదు. కయదు ఇతర భాషల ఆడియెన్స్ ను కూడా మెప్పిస్తోంది. అలాంటి మంచి కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి పళ్లిచట్టంబి మనందరి మూవీ కాబోతోంది. అన్నారు.
నటీనటులు – టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, శత్రు, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు
టెక్నికల్ టీమ్
————–
కాస్ట్యూమ్స్ – మంజూష రాధకృష్ణన్
మేకప్ – రషీద్ అహ్మద్
ప్రొడక్షన్ డిజైన్ – దిలీప్ నాథ్
ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ – టిజో టోమీ
మ్యూజిక్ – జేక్స్ బిజోయ్
స్క్రిప్ట్ – ఎస్ సురేష్ బాబు
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – మేఘశ్యామ్, తంజీర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్
డైరెక్టర్ – డిజో జోస్ ఆంటోనీ









