• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

తమిళ దర్శకుడు తీసిన తెలుగు నేటివిటి కథ ‘విడుదల-2’: నిర్మాత చింతపల్లి రామారావు.

admin by admin
December 18, 2024
in Cinema, Latest News, Movies, news, special
0
తమిళ దర్శకుడు తీసిన తెలుగు నేటివిటి కథ ‘విడుదల-2’: నిర్మాత చింతపల్లి రామారావు.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు నిర్మాత చింతపల్ల రామారావు ఈ సందర్భంగా ఆయన బుధవారం చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.

విడుదల-2 చిత్రం ఎలా ఉండబోతుంది?
పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’. మనతో మిళితమైన అంశాలతో కూడిన కథ.. ఇలాంటి కథలు మన నేటివిటికి సరిపోతుంది అని ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నాను. యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. అణగారిని వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం అందరిని పెట్టుబడి దారి వ్యవస్థ నుంచి ఎలా బయటపడేలా చేశారు అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ చిత్రం తెలుగు నేటివిటికి ఎలా సరిపోతుంది?
ఈ చిత్రం తమిళంలో తీసిన తెలుగు నేటివిటి కథ. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ.
విజయ్‌సేతుపతి పాత్ర ఎలా ఉండబోతుంది?
నటుడిగా ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈ చిత్రంలో పెరుమాళ్‌కు పాత్రకు ఆయన నూటికి నూరు శాతం సరిపోయాడు.
నక్సెలైట్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్‌ ఆయన పండించిన విధానం అద్భుతం. నటుడిగా విజయ్‌ సేతుపతి ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం ఆయన పేరు మరింత పెరుగుతుంది. ప్రజాసంక్షేమం కోసం కోరిన వ్యక్తి తమ వాళ్లను కుటుంబాన్ని కూడా వదిలి ఎలాంటి త్యాగాలు చేశాడు? అనేది ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది.
ఇళయరాజా సంగీతం గురించి?
ఈ చిత్రానికి ఆయన నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో ఆయన సంగీతంతో ప్రళయరాజాలా అనిపిస్తాడు.

ఇంకా ఈ చిత్రంలో ప్రధాన హైలైట్స్‌ ఏమిటి?
ఈ చిత్రంలో పీటర్‌ హెయిన్స్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌పై చూడని పోరాటాలు సమాకూర్చాడు, మంజు వారియర్‌ సహజ నటన ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. విజయ్‌, మంజు వారియర్‌ మధ్య ఎమోషన్స్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలు అందర్ని కంటతడిపెట్టిస్తాయి.

మీరు ఈ చిత్రాన్ని తీసుకోవడానికి మహారాజా చిత్రం సాధించిన విజయం కూడా కారణం అనుకోవచ్చా?
మహారాజా చిత్రం విజయం సాధించడం కూడా ఒక కారణం. ఈ కథాంశం కూడా నాకు నచ్చడంతో ఈ సినిమా తీసుకున్నాను.
సీక్వెల్స్‌కు హిట్స్‌ అవుతున్నాయి ఆ సెంటిమెంట్‌ కూడా ఉంది. ఆ కోవలోనే ఈ చిత్రం కూడా విజయం సాదిస్తుంది. అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల చేస్తున్నాం.
విడుదల పార్ట్‌ వన్‌తో పొలిస్తే పార్ట్‌-2 ఎలా ఉంటుంది?
పార్ట్‌ వన్‌ కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్‌ మాత్రమే జరిగింది. కథ అంతా విడుదల-2లోనే ఉంటుంది పార్ట్‌ వన్‌కు పదిరెట్టు అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో విజయ్‌ సేతుపతి అత్యంత ఉన్నతమైన నటనను చూస్తారు. ఆయన ప్రతి ఫ్రేమ్‌లో ఉంటాడు.
ఇందులో హింస ఎక్కువగా కనిపిస్తుంది? అభ్యంతరాలు ఏమీ రాలేదా?
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. కానీ ఇది కొత్తగా క్రియేట్‌ చేసిన కథ కాదు. పూర్తి స్థాయి రియలిస్టిక్‌గా ఉంటుంది.
పార్ట్‌-3 ఉంటుందా?
పార్ట్‌-3 దర్శకుడి ఆలోచనను బట్టి ఉంటుంది.

మీ తదుపరి చిత్రాలు
శ్రీ శ్రీ రాజావారు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే డ్రీమ్‌గర్ల్‌ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నాం. ఇది కాక మరో రెండు సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నాయి.

Producer Chintapalli Rama Rao on ‘Viduthalai-2’: “This is a Story That Resonates with Telugu Audiences”

As Viduthalai-2, starring Vijay Sethupathi and directed by Vetrimaaran, gears up for its worldwide release on December 20, Telugu producer Chintapalli Rama Rao has shared his excitement about bringing this revolutionary tale to Telugu audiences. In an exclusive interview, he reveals the reasons behind acquiring the rights, the film’s connection to Telugu culture, and what audiences can expect.

Q: What inspired you to acquire the Telugu rights to Viduthalai-2?

Chintapalli Rama Rao: The story. It’s rare to come across a film that blends intense emotions, raw realism, and socio-political relevance in such a powerful way. Though it’s directed by a Tamil filmmaker, the story is deeply rooted in issues that resonate with Telugu audiences. After the success of Viduthalai-1, it was clear that this was a project worth investing in.

Q: How does this film connect with the Telugu audience?

Rama Rao: Viduthalai-2 isn’t just a Tamil film; it’s a universal story of resistance against oppression. The struggles, emotions, and triumphs showcased in the film are reflective of the challenges faced by people in the Telugu states as well. It’s as much a Telugu story as it is a Tamil one.

Q: Vijay Sethupathi is known for his versatile performances. How does he fit into this role?

Rama Rao: Vijay Sethupathi is exceptional. His portrayal of Perumal, a Naxalite leader, is both intense and emotional. The way he embodies the character’s sacrifices and commitment to his cause is nothing short of extraordinary. Telugu audiences will witness one of his finest performances in this film.

Q: What can you tell us about Ilaiyaraaja’s contribution to the film?

Rama Rao: Ilaiyaraaja’s music is the heartbeat of the film. His background score breathes life into every scene, amplifying the emotional depth and intensity. I can confidently say that his work in Viduthalai-2 is unforgettable.

Q: How does Viduthalai-2 compare to its predecessor?

Rama Rao: Viduthalai-1 laid the foundation by introducing the characters and setting up the premise. Viduthalai-2 takes it to the next level, diving into the core of the story with greater intensity and drama. Vijay Sethupathi’s performance in this film is on a completely different level.

Q: There’s talk of violence in the film. Has that raised any concerns?

Rama Rao: The film is based on real events, and the violence depicted is integral to the story. It’s not exaggerated or sensationalized. Instead, it’s portrayed realistically, aligning with the film’s raw and gritty tone.

Q: Is there a possibility of a Viduthalai-3?

Rama Rao: That entirely depends on Vetrimaaran’s vision. For now, the focus is on delivering an impactful sequel with Viduthalai-2.

Q: What are your upcoming projects?

Rama Rao: We are gearing up for the release of Sri Sri Rajavaru and are set to launch a new project titled Dream Girl. Apart from these, two other films are in advanced stages of planning and will go on floors soon.

Q: What’s your message to the audience ahead of the release?

Rama Rao: Viduthalai-2

Previous Post

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

Next Post

వైజాగ్ లో ” వెంకటరామయ్య గారి తాలూకా” చిత్రం ప్రారంభం

Next Post
వైజాగ్ లో ” వెంకటరామయ్య గారి తాలూకా” చిత్రం ప్రారంభం

వైజాగ్ లో " వెంకటరామయ్య గారి తాలూకా" చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.