“రాజా సాబ్” చూసి గుండెల నిండా ఆనందాన్ని నింపుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు – డైరెక్టర్ మారుతి
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్”. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ నెల 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరోయిన్ రిద్ధి కుమార్ మాట్లాడుతూ – ఈ “రాజా సాబ్” ఈవెంట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ గారిని మిస్ అవుతున్నాం. “రాజా సాబ్” సెకండ్ ట్రైలర్ కు మీరంతా హ్యూజ్ రెస్పాన్స్ అందించారు. ఈ ట్రైలర్ లో చూపించినట్లు రొమాన్స్, యాక్షన్, హారర్ ఎలిమెంట్స్ తో మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. మీరంతా సినిమా చూస్తూ ఒక ఫాంటసీ వరల్డ్ లోకి వెళ్లిపోతారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి మూవ్ మెంట్ ఎంజాయ్ చేశాం. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మారుతి గారికి, విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్. నా కోస్టార్స్ మాళవిక, నిధి అగర్వాల్ తో పాటు రాజా సాబ్ టీమ్ లోని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అన్నారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ – “రాజా సాబ్” షూటింగ్ కోసం వేసిన ఈ సెట్ మాకు మరో ఇల్లులా మారింది. చాలా రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేశాం. నా కెరీర్ లో “రాజా సాబ్” ఒక స్పెషల్ మూవీ. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇంత సరదాగా మరే మూవీ సెట్ లోనూ మేము గడపలేదు. ఈ సినిమా చేశాక నేనూ డార్లింగ్ ఫ్యాన్ అయిపోయా. ఈ రోజు ప్రభాస్ గారిని ఈవెంట్ లో మిస్ అవుతున్నాం. సినిమా బ్యూటిఫుల్ గా వచ్చింది. మీరంతా “రాజా సాబ్” చూసి సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అన్నారు.
ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ – రాజా సాబ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. మా సినిమాను ఈ నెల 9న మీరు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం. అన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతోమంది కొత్త వారికి అవకాశం కల్పించింది. దాదాపు 50 చిత్రాలకు చేరువవుతోంది. ఈ సంస్థలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. రాజా సాబ్ సినిమా విశ్వప్రసాద్ గారికి, నా సోదరి కృతికి పెద్ద హిట్ ఇవ్వాలి. నా స్నేహితుడు మారుతి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. మిగతా దర్శకులు ప్రభాస్ గారిని చూసిన తీరు వేరు, మారుతి ప్రెజెంట్ చేసిన విధానం వేరు. బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ప్రీమియర్స్ పడిన తర్వాత ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్, మారుతి టేకింగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ గురించే మీరంతా మాట్లాడుతారు. ప్రభాస్ గారు మన సినిమాను పాన్ ఇండియాకు తీసుకెళ్లారు. విశ్వప్రసాద్ గారు మిరాయ్ సినిమా బాగా రన్ అవుతున్నా, ఓజీ, ఇతర సినిమాల కోసం థియేటర్స్ ఇచ్చారు. అలాంటి వారి సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలని కోరుతున్నా. రాజా సాబ్ తో పాటు చిరంజీవి, వెంకటేష్ గారి మన శంకరవరప్రసాద్ సంక్రాంతికి వస్తున్న ఇతర సినిమాలన్నీ హిట్ కావాలి. ప్రతి సారీ కోళ్ల మీద పందెం వేస్తారు. ఈ సారి డైనోసార్ మీద పందెం వేయండి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ – రాజా సాబ్ కు పాన్ ఇండియా మాట చిన్నది. ఇది పాన్ వరల్డ్ ఫిలిం. ఈ సినిమా కోసం మారుతి చాలా కష్టపడ్డారు. ఇలాంటి భారీ చిత్రం ప్రొడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. విశ్వప్రసాద్ గారు తన ప్యాషన్ ఎంటో చూపించారు. ఈ సినిమాలోని స్ట్రాంగ్ కంటెంట్ వల్లే మంచి బీజీఎం చేయగలిగాను. ఇది రెగ్యులర్ మూవీస్ కు చేసే బీజీఎం కాదు. రాజా సాబ్ కోసం మారుతి గారు కొత్త ప్రపంచం సృష్టించారు. ఆ వరల్డ్ కు తగినట్లే బీజీఎం చేశాను. రెబల్ సాబ్, సహన సహస ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు నాచె నాచె ఇంకా పెద్ద సక్సెస్ అయ్యింది. ప్రభాస్ అన్న డ్యాన్సులు ఎంత బాగా చేశాడో నాచె నాచెలో చూశాం. డ్యాన్సులే కాదు ప్రభాస్ గారి ఓవరాల్ పర్ ఫార్మెన్స్ రాజా సాబ్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి ఒక బ్యాంగర్ మూవీని మారుతి అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు హిట్ కావాలి. అన్నారు.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – రాజా సాబ్ ఈవెంట్ కోసం అన్ని భాషల నుంచి వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. మూడేళ్ల క్రితం రాజా సాబ్ జర్నీ మొదలైంది. మొదట హారర్ కామెడీ చేయాలని అనుకున్నాం. ఆ తర్వాత మరింత స్కేల్ పెంచి హారర్ ఫాంటసీగా మార్చాం. భారీ సెట్స్ నిర్మించాం. ఇప్పటిదాకా మన ఇండియన్ సినిమాలో ఇంత హ్యూజ్ హారర్ ఫాంటసీ మూవీ రాలేదు. ఒక ప్రెస్టీజియస్ మూవీగా రాజా సాబ్ ను ప్రొడ్యూస్ చేయడంలో మేము సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఈ మూవీ కథలో బాగా కుదిరాయి. టెక్నికల్ గా మేకింగ్ గ్రాండియర్ కు తగిన అన్ని ఎలిమెంట్స్ మూవీలో బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అవన్నీ మీరు మూవీలో చూసి ఎంజాయ్ చేస్తారు. తెలుగు స్టేట్స్ లో అద్భుతమైన బజ్ రాజా సాబ్ కు ఉంది. నార్త్ లో కూడా బెస్ట్ రీచింగ్, బజ్, అప్పీల్ కనిపిస్తోంది. కర్ణాటకలో చాలా బాగుంది. తమిళనాట మాకే కాదు ఏ మూవీకి కూడా భారీ రిసెప్షన్ ఉండదు. తమిళనాట 150 నుంచి 200 స్క్రీన్స్ ప్రస్తుతం లభించాయి. నార్త్ ఇండియాలో 4500 స్క్రీన్స్ లో రాజాసాబ్ రిలీజ్ అవుతోంది. ఏపీలో టికెట్ రేట్స్ హైక్ ఇచ్చారు, తెలంగాణలో రేపటికి అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సంక్రాంతికి 11 సినిమాలు వస్తున్నాయి. అన్నింటికీ థియేటర్స్ కావాలి కాబట్టి పోటీ ఉంది. 8వ తేదీ నుంచి అన్ని ఏరియాల్లో రాజా సాబ్ కు మంచి థియేటర్స్ ఉంటాయి. ప్రభాస్ గారు బాహుబలి ముందు ఎలా కనిపించారో అలా రాజా సాబ్ లో ఆయన్ని చూడబోతున్నారు. సినిమా చివరి 40 నిమిషాలు ఒక గ్లోబల్ మూవీ ఇంపాక్ట్ ఇస్తుంది. మరో 5 నిమిషాల ఫాంటసీ ఎలిమెంట్ ను పండుగ టైమ్ లో యాడ్ చేయబోతున్నాం. రాజా సాబ్ కు మొదటి రోజు గ్లోబల్ గా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ఈ రాజా సాబ్ భవంతి సెట్ దాదాపు ఏడాదిన్నర మాకు మరో ఇళ్లుగా మారింది. హారర్ ఫాంటసీ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాం. సినిమా చూశాను. తమన్ తన మ్యూజిక్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. హీరో క్యారెక్టర్ తో పాటు సరికొత్త క్యారెక్టరైజేషన్స్ మూవీలో చూస్తారు. ప్రభాస్ గారిని ఎలా చూడాలని మీరంతా అనుకున్నారో అలా ఈ సినిమాలో కనిపిస్తారు. రేపు ప్రీమియర్స్ పడుతున్నాయి. మీరు ఎంత ఎనర్జీతో సంతోషంతో థియేటర్ లోపలికి వెళ్తారో, అంతకంటే రెట్టింపు ఆనందాన్ని గుండెల నిండా నింపుకుని బయటకు వస్తారు. సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ మాట్లాడుకుందాం. ప్రభాస్ గారు నన్ను నమ్మారు, ఆయనకు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలనో అంత బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాను. నేను యానిమేషన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. రాజా సాబ్ ఒక డిస్నీ మూవీలా ఉంటుంది. నాచె నాచె సాంగ్ ప్రభాస్ గారికి నాకు ఫేవరేట్ సాంగ్. కథలోని ఆ సిచ్యువేషన్ కు ఈ పాట బాగుంటుందని ముందే అనుకున్నాం. మూడేళ్లు మా దగ్గర ఉన్న సినిమా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసింది. ఇక మీరు మీ రెస్పాన్స్ ఇవ్వాలి. అన్నారు.










