• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఆకట్టుకునే అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ “చిట్టి పొట్టి”

admin by admin
October 3, 2024
in Cinema, Latest News, news, Reviews
0
ఆకట్టుకునే అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ “చిట్టి పొట్టి”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రలు పోషించి నటించిన చిత్రం…”చిట్టి పొట్టి”. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ… దర్శకత్వం వహించారు. చెల్లెలు సెంటిమెంట్ తో… ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సిస్టర్ సెంటిమెంట్… ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ అయ్యాయో రివ్యూలో చూద్దాం పదండి.

 

కథ: కిట్టు(రామ్ మిట్టకంటి) మంచి పోలీసు ఆఫీసర్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్(కస్వి) కూడా ఉంటుంది. ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. కిట్టుకి చిట్టి(పవిత్ర) అనే చెల్లులూ ఉంటుంది. ఆమె అంటే తనకి పంచ ప్రాణాలు. తన జోలికి ఎవరైనా వచ్చినా… ఆమెను ఎవరైనా ఏడిపించినా… వాళ్ల మీద సునామీలా పడిపోయి కొట్టేస్తుంటాడు. ఈ క్రమంలో ఆమె ఓ ఆకతాయి బ్యాచ్ కారణంగా తన ఫొటోలను డీప్ ఫేక్ మార్ఫింగ్ గురవుతుంది. ఆ అవమానానికి తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంది. ఇదే సమయంలో తన చెల్లిని చేసుకోబోయే వ్యక్తి విక్కీ కూడా ఆమెను అనుమానంగా చూస్తాడు. అలాగే తన తండ్రి కుటుంబం చాలా మంది బంధువులకు దూరంగా జీవిస్తూ వుంటుంది. ఇలాంటి క్రమంలో ఓ అన్నగా కిట్టు తన చెల్లిని ఎలా కాపాడుకుని పెళ్లి చేశాడు? చిన్న చిన్న మనస్పర్దలతో ఎప్పుడో దూరమైన మొత్త మూడు తరాల వారిని ఎలా ఒక చోటుకు చేర్చారు? చివరకు తను అనుకున్న పోలీసు పోస్టింగ్ ను సంపాధించాడా? తన ప్రేయసి… అమెరికా వదిలి తనకోసం ఎందుకు వస్తుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

కథ.. కథనం విశ్లేషణ: అన్నా చెల్లెళ్ల అనుబంధం మీద చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అలాంటి సిస్టర్ సెంటి మెంట్ సినిమాకి… నేటితరంలో టెక్నాలజీ వల్ల జరుగుతున్న డీఫ్ ఫేక్ మార్ఫింగ్ వల్ల తన చెల్లి ఎలా అవమానానికి గురైంది… దాన్నుంచి ఎలా ఆమెను బటయపడేశారు… అందుకు బాధ్యులైన వారిని ఎలా శిక్షించాడు అనే ఎలిమెంట్ తో ఈ సినిమాని సిస్టర్ సెంటి మెంట్ తో తెరకెక్కించారు. ఇది నేటితరం యూత్ కు కనెక్ట్ అవుతుంది. అలాగే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో జీవించే టప్పుడు బంధాలు, బంధుత్వాలు ఇవేమీ తెలియవు. పక్కపక్కనే జీవిస్తున్నా… మన స్నేహితులెవరో, మన చుట్టాలెవరో కూడా మనం గుర్తించలేం. అలాంటి తరుణంలో ఓసారి మన బంధువులు ఎక్కడెక్కడ వున్నారో మన ఇంట్లో వున్న పెద్దల ద్వారా తెలుసుకుని… ఓ సారి కలిసి వస్తే… తమ తమ ఏడుతరాల వారిని ఇట్టే గుర్తించొచ్చు. వారిని ఓ చోటుకు చేర్చవచ్చు. అలాంటిదే ఇందులో హీరో కిట్టు చేశారు. ఇలా చేర్చడానికి ఓ సందర్భం కావాలి. అదే తనకు ఎంతో ఇష్టమైన చెల్లి పెళ్లి సందర్భంగా ఎక్కడెక్కడో వున్న బంధుగణాన్ని అంతా వెతికి తీసుకొచ్చి… ఓ చోటుకు క్లైమాక్స్ లో చేర్చడంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ ఎపిసోడ్ అంతా చూస్తే… మనం కూడా ఇలా చేయాలి కదా అనిపించేలా చాలా ఎమోషన్ కు గురవుతాం. చివరి ఇరవై నిమిషాలు ప్రతి ఒక్కరూ ఏమోషన్ కు గురై… కంటతడి పెడతారు.

దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా అన్నా చెల్లెళ్ల అనుబంధం మీద నడిపించేసి… సెకెండాఫ్ అంతా బంధువులు… వారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లే సన్నివేశాలతో చాలా ఎమోషనల్ గా తెరకెక్కంచారు. క్షణికావేశంలో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడి దూరమైన అన్నా చెల్లెళ్లు, బావా బావమర్దులు, వదిన, ఆడబిడ్డలు ఇలా అందరిని ఓ చోటుకు చేర్చడానికి రాసుకున్న ఏమోషనల్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.

 

రామ్ మిట్టకంటి.. అగ్రిసివ్ గా వుండే ఓ అన్నగా… బంధాలు, బంధుత్వాలకు విలువనిచ్చే ఓ కుటుంబంలో పెద్ద కుమారుడిగా… తనకు ఇష్టమైన జాబ్ కోసం కష్టపడే ఓ నిబద్ధత కలిగిన యువకునిగా… లవర్ బోయ్ గా ఇలా అన్ని యాంగిల్స్ లోనూ తన ముద్రను చూపించారు. యాక్షన్ సీన్స్ ను చాలా బాగా చేశాడు. సెంటి మెంట్ ను కూడా బాగా పండించాడు. అతని చెల్లిగా నటించిన పవిత్ర కూడా చాలా బాగా చేసింది. ఇద్దరూ సొంత అన్నా చెళ్లెల్లా అనే విధంగా నటించేశారు. అంతలా వారిద్దరి మధ్య సెంటిమెంట్ పండింది. హీరోయిన్ కస్వి పాత్ర పర్వాలేదు. హీరో స్నేహితులుగా నటించిన వ్యక్తులిద్దరూ బాగా నవ్వించారు. బామ్మలుగా, తాతలుగా, వదిన పాత్రలు పోషించిన వారంతా తమతమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు రాసుకున్న సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అన్నీ బాగా కనెక్ట్ అవుతాయి. ఈ ఆధునిక ప్రపంచంలో జరిగే వింత పోకడలను కూడా టచ్ చేశారు. అలాగే ఎప్పుడో విడిపోయిన బంధుగణాన్ని అంతా ఓ చోటుకు చేర్చడం లాంటి ఎమోషన్ సీన్స్ బాగా చిత్రీకరించారు. ఈ సినిమాకి తనే నిర్మాత కాబట్టి… చాలా క్వాలిటీగా నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సంగీతం బాగుంది. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల పిక్చరైజేషన్ విజువల్ గా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుండాల్సింది. ఫైనల్ గా… చిట్టి పొట్టి… సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా… ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ వారం ఇంటిల్లిపాది కలిసి చూసేయండి.

రేటింగ్: 3

 

 

 

Tags: chitti Pottichitti potti movie reviewRam mittakanti
Previous Post

ప్రిన్స్, నరేష్ అగస్త్య పర్ ఫార్మెన్స్ “కలి” మూవీకి హైలైట్ అవుతుంది – చిత్ర సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి

Next Post

Deccan Film Daily Edition-03-10-2024

Next Post
Deccan Film Daily Edition-03-10-2024

Deccan Film Daily Edition-03-10-2024

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్

by admin
August 31, 2025
0

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఘనంగా ప్రారంభం

by admin
August 29, 2025
0

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధర్మవరం” పోస్టర్ విడుదల

by admin
August 29, 2025
0

Review: బ్రహ్మాండ

Review: బ్రహ్మాండ

by admin
August 29, 2025
0

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… త్రిబాణధారి బార్బరిక్

by admin
August 29, 2025
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల

by admin
August 28, 2025
0

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

by admin
August 28, 2025
0

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

by admin
August 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.