• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, December 31, 2025
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఏప్రిల్ 4న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “సీతన్నపేట గేట్” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – ప్రొడ్యూసర్ ఆర్ శ్రీనివాస్

Maari by Maari
March 25, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, special, sports
0
ఏప్రిల్ 4న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “సీతన్నపేట గేట్” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – ప్రొడ్యూసర్ ఆర్ శ్రీనివాస్

Share and Enjoy !

Shares
Twitter

స్ట్రాంగ్ కంటెంట్ తో ఏప్రిల్ 4న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “సీతన్నపేట గేట్” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – ప్రొడ్యూసర్ ఆర్ శ్రీనివాస్

వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సీతన్నపేట గేట్”. ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వై రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథతో రూపొందిన “సీతన్నపేట గేట్” సినిమా ఏప్రిల్ 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈరోజు ఈ సినిమా ప్రెస్ మీట్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ వై రాజ్ కుమార్ మాట్లాడుతూ – మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మన సమాజంలో చాలా వరకు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటున్నాయి. కొన్నిసార్లు ఇవి అక్రమ సంబంధాలుగా మారుతున్నాయి. ఇలాంటి కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా సీతన్నపేట గేట్ సినిమాను రూపొందించాను. తెలుగు, కన్నడలో స్టార్ హీరోస్ తో సినిమాలు రూపొందించిన ఆర్ఎస్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థలో నేను మూవీ చేయడం హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్స్ తో సీతన్నపేట గేట్ సినిమా కథనం సాగుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

అతిథిగా వచ్చిన దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ – ఆర్ఎస్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద సంస్థ. ఎన్టీఆర్ తో సుబ్బు సినిమాను, నా దర్శకత్వంలో అనుష్క, శ్రీహరి, సుమంత్ కాస్టింగ్ తో మహానంది మూవీ చేశారు. నిర్మాత శ్రీనివాస్ గారు ఎన్నో మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. కన్నడలో స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించారు. అలాంటి సంస్థ నుంచి సీతన్నపేట గేట్ సినిమా వస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్ కు సరిపోయేలా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. సీతన్నపేట గేట్ సినిమా దర్శకుడు రాజ్ కుమార్, ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ – సినిమాలకు పెద్దా చిన్నా అనేది లేదు. కంటెంట్ బాగుండాలి. కంటెంట్ లేని సినిమా వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించినా అది ప్రేక్షకులకు నచ్చదు. కథ బాగున్న చిన్న సినిమాలు కూడా ఆదరణ పొందుతాయి. ఇప్పుడు థియేటర్స్ కు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు అంటున్నారు. కానీ ఇప్పటికీ సగటు మధ్య తరగతి, పేద వారికి సినిమానే చవకైన వినోదం. నేను డిస్ట్రిబ్యూటర్ గా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్..ఇలా అందరి స్టార్స్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎన్టీఆర్ తో సుబ్బు, సముద్ర గారితో మహానంది మూవీస్ నిర్మించాను. కన్నడలో స్టార్ హీరోస్ తో పలు చిత్రాలు నిర్మించాను. సీతన్నపేట గేట్ సినిమా కథ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు చెప్పగానే ఆకట్టుకుంది. మంచి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఇవాళ్టి సొసైటీలో జరుగుతున్న ఘటనలకు ప్రతిరూపంగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సీతన్నపేట గేట్ సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

హీరో వేణుగోపాల్ మాట్లాడుతూ – సీతన్నపేట గేట్ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ఆర్ శ్రీనివాస్, మా డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నేను చాలా మాస్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ తో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరవుతానని ఆశిస్తున్నా. ఏప్రిల్ 4న థియేటర్స్ లోకి వస్తున్న మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైలాగ్ రైటర్ బయ్యవరపు రవి మాట్లాడుతూ – సీతన్నపేట గేట్ సినిమాకు డైలాగ్స్ రాయమని డైరెక్టర్ రాజ్ కుమార్ నన్ను అప్రోచ్ అయినప్పుడు ఈ కథ చాలా యూనిక్ గా అనిపించింది. వందల ఏళ్ల క్రితమే కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని చెప్పాడు. కానీ ఈ కథలో ఈ ఆర్థిక సంబంధాలు కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాలుగా ఎలా మారుతున్నాయో దర్శకుడు చూపించారు. ఇవాళ్టి యువత ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే మంచి మెసేజ్ కూడా అంతర్లీనంగా కథలో ఉంటుంది. అన్నారు.

యాక్టర్ కట్టప్ప మాట్లాడుతూ – సీతన్నపేట గేట్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి నిర్మాత శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. మా ఈవెంట్ లో పాల్గొన్న సముద్ర గారికి థ్యాంక్స్. ఆయన దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నా. సీతన్నపేట గేట్ సినిమాకు తెలుగు ప్రేక్షకులు విజయాన్ని అందించాలని కోరుతున్నా. అన్నారు.

డీవోపీ యోగి రెడ్డి మాట్లాడుతూ – సీతన్నపేట గేట్ సినిమా డీవోపీగా నాకు మొదటి మూవీ. ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ కలర్ లో సినిమాటోగ్రఫీ ఉండాలని మేము ప్లాన్ చేశాం. మూవీ చేసేప్పుడు డైరెక్టర్ గారి నుంచి కంప్లీట్ సపోర్ట్ లభించింది. సీతన్నపేట గేట్ సినిమా ఒక కొత్త తరహా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ పాల్గొన్నారు.

నటీనటులు – వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి, యశ్వన్, గంగాధర్, సురభి తివారి, కస్లాయ్ చౌదరి, అనూష జైన్, సుదీక్ష ఝా, తదితరులు

టెక్నికల్ టీమ్

ప్రొడ్యూసర్స్ – వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ (ఆర్. శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – వై రాజ్ కుమార్
పీఆర్ఓ – సురేష్ కొండేటి
మ్యూజిక్ – ఎన్ఎస్ ప్రసు
ఎడిటింగ్ – శివ శర్వాణి
డైలాగ్స్ – బయ్యవరపు రవి
లిరిక్స్ – భాస్కరభట్ల, మణికంఠ సంకు
యాక్షన్ – వింగ్ చున్ అంజి
కొరియోగ్రఫీ – అనీష్, జిన్నా

Share and Enjoy !

Shares
Twitter
Tags: SeethannaPeta Gate
Previous Post

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్స్ రిలీజ్ ఈవెంట్

Next Post

ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రీ రిలీజ్ వేడుక

Next Post
ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ వేడుక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఆద్యంతం వినోదభరితం ‘ అనగనగా ఒక రాజు‘ -కథానాయకుడు నవీన్ పోలిశెట్టి

ఆద్యంతం వినోదభరితం ‘ అనగనగా ఒక రాజు‘ -కథానాయకుడు నవీన్ పోలిశెట్టి

by Maari
December 31, 2025
0

నువ్వు నాకు నచ్చావ్’ క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే!- త్రివిక్రమ్ శ్రీనివాస్

నువ్వు నాకు నచ్చావ్’ క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే!- త్రివిక్రమ్ శ్రీనివాస్

by Maari
December 31, 2025
0

త్రిదండి చినజీయర్ స్వామి వారి దివ్య హస్తాలతో అంబికా దర్బార్ బత్తి కొత్త ప్రాడక్ట్ “రాగస్వర సుప్రభాతం” ఆవిష్కరణ

త్రిదండి చినజీయర్ స్వామి వారి దివ్య హస్తాలతో అంబికా దర్బార్ బత్తి కొత్త ప్రాడక్ట్ “రాగస్వర సుప్రభాతం” ఆవిష్కరణ

by Maari
December 30, 2025
0

“బిగ్ బాస్” నాకు ఎంతో ఇచ్చాడు!! -టాప్4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్

“బిగ్ బాస్” నాకు ఎంతో ఇచ్చాడు!! -టాప్4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్

by Maari
December 29, 2025
0

పతంగ్‌ను థియేటర్‌లో చూసి అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు: దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి

పతంగ్‌ను థియేటర్‌లో చూసి అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు: దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి

by Maari
December 29, 2025
0

“రాజా సాబ్” ట్రైలర్ 2.ఓ రిలీజ్

“రాజా సాబ్” ట్రైలర్ 2.ఓ రిలీజ్

by Maari
December 29, 2025
0

ఘనంగా “GTA మెగా కన్వెన్షన్ 2025”

ఘనంగా “GTA మెగా కన్వెన్షన్ 2025”

by Maari
December 28, 2025
0

డార్లింగ్ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని “రాజా సాబ్” సినిమా చేశాం – ప్రభాస్

డార్లింగ్ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని “రాజా సాబ్” సినిమా చేశాం – ప్రభాస్

by Maari
December 28, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.