మాస్టర్ కనిష్క్ మహాబలాహ్ సమర్పణలో శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఓ మాట అనుకుందామా!’. శ్రీనివాస్ అనంతనేని, మోనికా మిశ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, కార్తికేయ దేవ్, అజిజ్ ఖాన్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్‌జీ కథ, దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి పెంటి నాగరాజు, పెంటి నీరజ్ సందీప్ నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లుక్ గ్లింప్స్‌ని సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఓ మాట అనుకుందామా!’ సినిమాలో చాలా మంచి పాత్రలు పోషిస్తున్నామని, ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ సందర్భగా దర్శకుడు భీమ్‌జీ మాట్లాడుతూ.. ముందుగా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ విడుదల చేసిన సీనియర్ నటీనటులు సుహాసిని మేడమ్‌కు, వినోద్ కుమార్ సార్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాలో వారి పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. శ్రీనివాస్ అనంతనేని, మోనికా మిశ్రాల పాత్రలు అందరినీ కట్టిపడేస్తాయి. ఒక సరికొత్త ప్రేమకథని ప్రేక్షకులకు ముందుకు తీసుకురాబోతున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు.
నిర్మాతలు పెంటి నాగరాజు, పెంటి నీరజ్ సందీప్ మాట్లాడుతూ.. భీమ్‌జీ అద్భుతమైన కథతో ‘ఓ మాట అనుకుందామా!’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాకు కథ ఎంతగానో నచ్చింది. ఇందులో సీనియర్ నటులెందరో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసిన సుహాసిని గారికి, వినోద్ కుమార్ గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే టీజర్‌తో వస్తాం. మా బ్యానర్ నుంచి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు.
శ్రీనివాస్ అనంతనేని, మోనికా మిశ్రా, సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, కార్తికేయ దేవ్, అజిజ్ ఖాన్, అన్నపూర్ణమ్మ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి
సమర్పణ: మాస్టర్ కనిష్క్ మహాబలాహ్
బ్యానర్: శ్రీ శుభకర క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ: సుకిృత్ కెఎస్
మ్యూజిక్: అలోష్య పీటర్ – వినోద్ యజమాన్య
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు: పెంటి నాగరాజు (M.A)
పెంటి నీరజ్ సందీప్ (MBA, సింగపూర్)
కథ-దర్శకత్వం: భీమ్‌జీ









