యువ హీరో రూపేష్ కథానాయకుడిగా పరిచయం అవుతూ ఆయన నిర్మాతగా మారి పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘షష్టి పూర్తి’. రాజేంద్ర ప్రసాద్, అర్చన ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ:
‘షష్టి పూర్తి’ సినిమా కథ విషయానికొస్తే.. శ్రీరామ్ (రూపేష్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. నీతి, నిజాయితీ, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే టైపు. దానితో అతను కొన్ని రకాల ప్రాబ్లెమ్స ను ఫేస్ చేస్తుంటారు. మరోవైపు ఓ సమస్యతో అనుకోకుండా అతని ఇంట్లోకి జానకి (ఆకాంక్ష సింగ్) ప్రవేశిస్తోంది. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడతాడు. జానకికి శ్రీరామ్ ఊర్లో ఉండే ఓ వ్యక్తి ఆమెకు సంబంధించిన భూమిని కౌలుకు తీసుకొని ఆమెకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందలు పెడుతుంటాడు. తన సమస్యను శ్రీరామ్ కు చెబుతుంది. అతను ఆమె ప్రాబ్లెమ్ ను పరిష్కరిస్తాడు. అయితే వీళ్లిద్దరు పెళ్లి చేసుకునే క్రమంలో రూపేష్ ఇంట్లో అనుకోని ప్రాబ్లెమ్స్ వస్తాయి. అతని తల్లిదండ్రులు ఇద్దరు విడిపోతారు. చివరకు ఎలా కలిసారు అన్నదే మిగతా కథ.
షష్టి పూర్తి పూర్తి కుటుంబ కథా చిత్రం. ప్రస్తుతం మన సమాజంలో జరగుతున్న అంశాలనే తీసుకొని దర్శకుడు పవన్ ప్రభ ఈ సినిమాను తెరకెక్కించాడు. షష్టి పూర్తి అనేది మనకు తెలుగు వాళ్లకు ప్రత్యేకం. మనకు ప్రభవ నుంచి అక్షయ వరకు 60 తెలుగు సంవత్సరాలున్నాయి.
ఒక వ్యక్తి తాను జన్మించిన సంవత్సరం నుంచి మరోసారి అదే యేడాది రావడానికి 60 యేళ్లు పడుతుంది. దాన్ని మనం షప్టి పూర్తిగా జరుపుకుంటాము. అలా మన జీవితంలో షష్టి పూర్తికి ప్రత్యేక స్థానం ఉంది. దాన్నే టైటిల్ గా పెట్టుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి ఇలాంటి సెన్సిబుల్ మూవీ వచ్చి చాలా కాలమే అవుతుంది. అక్కడక్కడ కమర్షియల్ గా ఒకటి రెండు ఫైట్స్ ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ హృద్యంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓ వ్యక్తి కారణంగా విడిపోయిన తల్లిదండ్రులను హీరో ఎలా కలిపి షష్టి పూర్తి చేసాడనేది ఆసక్తికరమైన అంశమనే చెప్పాలి. కథకు తగ్గట్టు ఇళయరాజా ఇచ్చిన సంగీతం బాగుంది. యువన్ శంకర్ రాజా అందించిన ఎరోటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. హీరోగా రూపేష్ నటన బాగుంది. డాన్స్ విషయంలో అక్కడక్కడ తడబడ్డ.. నటన విషయంలో ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్నవాడిలా మెప్పించాడు. కాస్త సాన పెడితే టాలీవుడ్ కు మంచి హీరో దొరికినట్టే. నిర్మాతగా కూడా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనా ఒదిగిపోయి నటించడం ఆయన స్టైల్. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో మెప్పించాడు. అర్చన మరోసారి ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో మెప్పించింది. రూపేష్ హీరోగానే కాకుండా నటుడిగా తొలిసినిమాతోనే మెప్పించాడు. ఎంతో అనుభవం నటుడిగా మెచ్యుర్ట్ యాక్టింగ్ తో మెప్పించాడు. కొన్ని చోట్ల తడబడ్డ తొలి సినిమాలో ఇలాంటి బరువైన పాత్ర చేయడం మెచ్చుకోదగ్గ అంశం. హీరోయిన్ గా నటించిన ఆకాంక్ష సింగ్ చూడ్డానికి క్యూట్ గా ఉంది. సినిమాలో తన యాక్టింతో మెప్పించింది. మిగిలిన నటీనటుల తమ పరిధి మేరకు మెప్పించారు.
‘షష్టి పూర్తి’… క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
రేటింగ్: 3