న్యూ కాన్సెప్ట్ చిత్రాలను, కొత్తతరహా న్యూ ఏజ్ చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల వచ్చిన ఆ తరహా చిత్రాల విజయాలే అందుకు ఉదాహరణ. ఇక ప్రస్తుతం సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో సన్సేషన్ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్ చిత్రంతో యూట్యూబ్ సన్సేషన్, మీమ్ కంటెంట్ క్రియేటర్ మౌళి తనూజ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ సన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమకు నమస్కారం’ ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్లింప్స్ వచ్చిన స్పందన అనూహ్యం. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ‘మహాదేవ నాయుడు’గా ఆయన చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా శుక్రవారం మహాదేవ నాయుడు పాత్రకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడయోను చూస్తే ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో తెలుస్తోంది. ప్రముఖ నటి భూమిక మరో ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రావాడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి. భీమ శంకర్ దర్శకుడు.
. ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్.. లవ్ బ్రేకప్ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్లఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పుకునే ఫన్నీ బాధలు అన్ని ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఇక ఫైనల్‌గా ఫణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్‌కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్ అవుతాయి.టోటల్‌గా ప్రేమకు నమస్కారం అనే టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో యూత్‌తో పాటు అందరికి కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ముఖ్యంగా నేటి యువత లవ్, బ్రేకప్‌అప్, ఇలా అన్ని అంశాలను పూర్తి వినోదభరితంగా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. నేటి యువత బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ చిత్రంలో నటుడు హీరో శివాజీ పాత్రలో ఎంతో కీలకంగా ఉంటుంది. సినిమా ఆద్యంతం కనిపించే పాత్ర ఇది. ఆయన పాత్రలో కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. కోర్టు సినిమాలో ఆయనకు ఎంతో పేరు వచ్చిందో ఈ సినిమాలో అంతకు మించిన పేరు వస్తుంది. ఆయన పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. మహాదేవ నాయుడుగా ఆయన నట విశ్వరూపం చూస్తారు’ అన్నారు.నిర్మాత మాట్లాడుతూ ” వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. కొత్తదనం, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌మెంట్ ఈ చిత్రంలోని ప్రత్యేకతలు. శివాజీ గారి పాత్ర ఆయన కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మహాదేవ నాయుడు పాత్రకు అందరికి నచ్చే విధంగా ఉంటుంది. అన్నారు.
షణ్ముఖ్ జస్వంత్, శివాజీ, భూమిక, ఉల్కగుప్తా, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్, రంగస్థలం మహేష్, మణిచందన, కమల్, క్రాంతి, నీల రమణ, శోభన్, సుభాష్, కొటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ కిషోర్ బోయిడపు, సంగీతం: గ్యానీ, ఎడిటర్: కేసీబీ హరి, లిరిక్స్: సరస్వతి పుత్రి రామజోగయ్య శాస్త్రి, దినేష్ కాకెర్ల, ఆర్ట్: రవికుమార్, కొరియోగ్రఫీ: శ్రావణ్, విశాల్, ప్రొడక్షన్: రమేష్ వర్మ, నిర్మాతలు: అనిల్ కుమార్ రావాడా, భార్గవ్ మన్నె రచన-దర్శకత్వం: భీమ శంకర్.
Shivaji to Play “Mahadeva Naidu” in Prema Ku Namaskaram
YouTube sensation Shanmukh Jaswanth is making his silver screen debut as a lead actor with Prema Ku Namaskaram. Directed by V. Bhima Shankar, the film stars Ulka Gupta as the female lead and is produced by Anil Kumar Ravada and Bhargav Manne under the AB Cinemas banner.
The makers recently unveiled the title glimpse, which received an overwhelming response. Adding to the buzz, actor Shivaji will be seen in a powerful role as Mahadeva Naidu. A special video introducing his character was released, highlighting his intense performance. Actress Bhumika Chawla also plays an important role in the film.
Speaking about the project, director Bhima Shankar said that the film is a youthful love entertainer that connects with today’s generation through themes of love, heartbreak, and emotions. He added that Shivaji’s character is crucial to the story, blending comedy, sentiment, and strong emotions.
Producer Anil Kumar Rawada stated that Prema Ku Namaskaram will stand out for its fresh concept and entertaining treatment, and that Shivaji’s role will be remembered as one of the highlights of his career.
The film also features Brahmaji, Srikanth Iyengar, Arun Adith, Rangasthalam Mahesh, and others. Music is composed by Gyaani, cinematography is handled by Kishore Boyidapu, and editing is by KCB Hari
CAST
Shanmukh Jaswanth
Sivaji
Bhoomika
Ulka Gupta
Brahmaji
Srikanth Iyyangar
Arun Adith
Rangasthalam Mahesh
Manichandana
Kamal
Kranthi
Neela Ramana
Shoban
Subash
Koteswara Rao
CREW
Writer, Director: V Bhima Shankar
Producers: Anil Kumar Ravada, Bharghav Manne
DOP: Kishore Boyidapu
Music: Gyaani
Editor: KCB Hari
Lyrics: Saraswathi Putra Ramajogayya Sastry, Dinesh Kakkerla
Art Director: Ravi Kumar
Co- Director: Lakshmi Dharun
Associate Director: Siva Kundrapu
Costume Designer: Sony Jho Priya
Cashier, Accountant: Raghu Gundepangu
Choreography: Shravan, Vishal
Publicity Designer: Pardu Creations
PRO: Maduri Madhu
Sound Effects: JR Ethiraj
Digital Promoter: #media Manoj
Production Executive : Ramesh Varma









