• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నవ్వించే… సుందరం మాస్టర్

Maari by Maari
February 23, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Reviews, special
0
నవ్వించే… సుందరం మాస్టర్

Share and Enjoy !

Shares
Twitter

వైవా హర్ష… మంచి కామెడీ టైమింగ్ ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న హర్ష… ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై మంచి కామెడీ నటుడిగా గుర్తింపు పొందారు. చాలా సినిమాల్లో తన హస్యంతో అలరించిన హర్ష… ఇప్పుడు లీడ్ రోల్ పోషించి… తనే సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించడానికి ‘సుందరం మాస్టర్’గా మన ముందుకు వచ్చాడు. డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం… ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని మాస్ మహరాజ్ రవితేజ నిర్మాణ సంస్థ ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై సంయుక్తంగా తెరకెక్కించారు. విడుదలకు ముందే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. మరి థియేటర్లలో సినిమాని ప్రేక్షకులు ఏమాత్రం ఏంజాయ్ చేస్తున్నారో రివ్యూలో చూద్దాం పదండి.

కథ: సుదరం మాస్టర్ (వైవా హర్ష) ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఎక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే(కమెడియన్ హర్ష వర్ధన్) పాఠశాలకు వచ్చి… అక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరినీ పరిశీలించి… సుందరం మాస్టర్ ని ఓ పని కోసం ఎంచుకుంటారు. అదేంటంటే… బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గత 90 ఏళ్లుగా మిరియాల మెట్ట అనే ఓ ఊరు ఉంది. ఆ ఊళ్లోకి బయటి వాళ్లకి ప్రవేశం లేదు. మొదటిసారి వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశారు అంటూ… ఆ ఊర్లో ఏదో విలువైనది ఉంది… దాన్ని కనుక్కోవడానికి నిన్ను పంపుతున్నాము. ఆరు నెలల్లో దానిని కనిపెడితే నీకు డీయీవో ప్రమోషన్ వస్తుందని చెబుతాడు ఎమ్మెల్యే. దాంతో అసలే కట్నం మీద అత్యాశతో వున్న సుందరం మాస్టర్… డీయీవో అయితే మరింత ఎక్కువ కట్నం వస్తుందని ఆశపడి ఆ ఊరికి వెళ్లడానికి ఒప్పుకుంటారు. ఎక్కడో అడవుల్లో ఉన్న ఆ కుగ్రామానికి సుందరం మాస్టరు వెళతాడు. అయితే ఆ ఊళ్లో వాళ్లందరికి ఇంగ్లీష్ మాట్లాడటం పర్ ఫెక్ట్ గా వచ్చని తెలుసుకుని సుందరం ఒకింత ఆశ్చర్యపోతాడు. తాను ఇంగ్లిష్ ఆల్ఫబెట్స్ తో మొదలు పెడితే… వాళ్లకు ఇంగ్లీష్ మాట్లాడటం పర్ ఫెక్ట్ గా వచ్చని తెలుసుకుని… ఆ తరువాత స్పెల్లింగ్స్ నేర్పించడం మొదలు పెడితే… అవి కూడా వచ్చని వారు చెప్పడంతో సుందరం మాస్టర్ ఒకింత డైలమాలో పడతాడు. తమకు ఇంగ్లిష్ నేర్పించడానికి వచ్చిన టీచర్… అసలు టీచరే కాదని… తనకు ఇంగ్లిష్ రాదని, అతన్ని ఇంగ్లీష్ లో తిట్టి… 15 రోజులు టైం ఇచ్చి తర్వాత నీకు పరీక్ష పెడతాము… పాస్ అయితే ఓకే, లేకపోతే ఉరేసి చంపేస్తాం అంటారు ఊరి పెద్ద(బాలకృష్ణ నీలకంఠాపురర్). ఆ ఊర్లోనే ఓజా అనే ఓ వ్యక్తి సుందరంకి హెల్ప్ చేస్తా అని ఆ ఊరి గురించి.. 1920లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మా దగ్గర దొరికే మిరియాల కోసం మమ్మల్ని బానిసలుగా చేసుకుంటే… ఓ దొర వచ్చి బ్రిటిష్ వాళ్ళని పంపించేసి అతను ఇక్కడే సెటిల్ అయి, మాకు ఇంగ్లీష్ నేర్పించాడు. అతని కొడుకు కొన్ని ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్స్ చెప్పాడు, అతను చనిపోవడంతో మాకు ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశామని, బయట వాళ్ళు వచ్చి మా మీద దాడి చేయకూడదని మా ఊరు దారులన్నీ తీసేసాం అంటూ ఆ ఊరి గురించి అన్ని విషయాలు చెప్తాడు. సుందరం ఎలాగోలా ఓజా సహాయంతో ఆ ఊరివాళ్ళు పెట్టే పరీక్ష పాస్ అయి… ఆ ఊర్లో దొరికే విలువైన దాని గురించి వెతుకుతుంటే, కొంతమంది ఆ ఊరి గ్రామ దేవత విగ్రహం అని చెప్పడంతో చూడటానికి వెళ్తే అక్కడ ఆ విగ్రహం ఉండదు. అసలు ఆ విగ్రహం ఏమైంది? నిజంగానే విగ్రహం విలువైందా? సుందరం మాస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ భాషకు స్పెల్లింగ్స్ నేర్పించాడా? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? వాళ్ళకి నలుపు రంగు అంటే ఎందుకిష్టం? ఆ ఊరి నుంచి సుందరం మాస్టర్ ఎప్పుడు బయటకి వచ్చాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: దర్శకుడు ఎంచుకున్న కథ… కథనం వైవిధ్యంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ ఉన్న కథలు మనం చూసుండం. మనం నిత్యం ఏదో ఒక సందర్భంలో ఇంకా కొన్ని మారుమూలన ఉండే కుగ్రామాల గురించి… కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయడం లాంటివి రియల్ లైఫ్ లో కూడా నిత్యం పత్రికల్లో చదువుతూనే ఉంటాం. అలాగే మిరియాల మెట్ట అనే ఊరిని తీసుకొని వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలనే కథతో సుందరం మాస్టర్ పాత్రని రాసుకున్నారు. మొదటి హాఫ్ అంతా సుందరం మాస్టర్ గురించి, అతను అక్కడికి వెళ్లి పడే బాధల గురించి ఫుల్ కామెడీగా చూపించారు. ఇంటర్వెల్ కి విగ్రహం మాయమవ్వడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఆ విగ్రహం గురించి, అక్కడ కల్మషం లేని మనుషులు, ప్రకృతి, మానవత్వం.. లాంటి ఎమోషన్స్ తో సాగుతుంది. ఆ ఊరి వాళ్లకి స్వతంత్రం వచ్చినట్టు కూడా తెలియకపోవడం, గాంధీ ఎలా ఉంటారు అని తెలియకపోవడం, అసలు బయట ఒక ప్రపంచం ఇంతలా మారిందని తెలియకపోవడం, క్రికెట్, ఇప్పుడు ఉన్న డబ్బుల గురించి తెలియకపోవడం, గాంధీ ఇతనే అని 500 నోటు సుందరం మాస్టర్ చూపిస్తే… ఆ నోటుని చింపేసి గాంధీ ఫోటో మాత్రం తీసుకోవడం.. లాంటి సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. అయితే ఇవే సీన్స్ లో కొన్ని మాత్రం ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఆ ఊరిని బ్రిటిషర్లు నుండి కాపాడిన దొరగా బ్రహ్మానందం ఫేస్ ని గ్రాఫిక్స్ లో వాడుకొని కథ చెప్పడం బాగుంది. ఓవరాల్ గా మొదటి హాఫ్ హాస్యంతోనూ… సెకెండాఫ్ ని కొంత ఫిలాసఫీతోనూ నడిపించారు ‘సుందరం మాస్టర్’. ఇలాంటి కొత్త జోనర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులను సుందరం మాస్టర్ కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాడు.

షార్ట్ ఫిలింస్ లోనూ, వెండితెరపైనా తన కామెడీతో ఇన్నాళ్లు అలరించిన వైవా హర్ష… ఇప్పుడు కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సుందర్ మాస్టర్ లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ పాత్రలో మరే ఇతర నటుడిని ఊహించుకోలేనంతగా ఒదిగిపోయి నటించారు హర్ష. అతనికి జోడీగా నటించిన దివ్య శ్రీపాద… ఆ ఊర్లో ఓ అనాథ పిల్లగా నటించి తన పాత్రకు న్యాయం చేసింది. గ్రామ పెద్దగా బాలకృష్ణ నీలకంఠాపురం, ఎమ్మెల్యేగా కమెడియన్ హర్షవర్దన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు ఎంచుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఈ తరహా సినిమాలకు ఎలాంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారో… వారిని టార్గెట్ చేసి తీసిన మూవీ ఇది. అలాగే ఈ సినిమాని సాంకేతికంగా కూడా చాలా ఉన్నతంగా నిర్మించారు. ముఖ్యంగా సినిమాని అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశారు. అడవులు, జలపాతం, మధ్యలో కర్రలతో కట్టిన ఇల్లు ఉన్న ఓ చిన్న ఊరు.. ఇవన్నీ సినిమాటిక్ విజువల్స్ లో అద్భుతంగా చూపించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ ఊరిని అద్భుతంగా కట్టింది. నిజంగా ప్రపంచానికి దూరంగా ఓ పల్లెటూరు ఉంటె అలాగే ఉంటుందేమో అనిపించేలా సెట్స్ వేశారు. కథ కూడా కొత్తగా బాగుంది. కథనం కూడా ఆసక్తిగా బోర్ కొట్టకుండా సాగుతుంది. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు . నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

రివ్యూ: ఆకట్టుకునే విలేజ్ డ్రామా… మస్తు షేడ్స్ ఉన్నయ్ రా..!

Next Post

వెరైటీ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్!

Next Post
వెరైటీ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్!

వెరైటీ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల 'తంత్ర' రిలీజ్-డేట్ పోస్టర్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.