• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, November 17, 2025
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

Maari by Maari
October 22, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, special, sports
0
‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

‘సూపర్ డూపర్‌’ గీతంతో మాస్ విందు ఇచ్చిన ‘మాస్ జాతర’ చిత్ర బృందం

‘మాస్ జాతర’ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, నాలుగో గీతంగా ఉత్సాహభరితమైన మాస్ పాట ‘సూపర్ డూపర్‌’ను విడుదల చేసింది. రవితేజ మాస్ కి, శ్రీలీల ఎనర్జీకి తగ్గట్టుగా స్వరపరిచిన ఈ బ్లాక్ బస్టర్ ట్యూన్ అందరినీ కట్టిపడేస్తోంది. ‘మాస్ జాతర’ చిత్రాన్ని, ఆల్బమ్ ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ఈ ‘సూపర్ డూపర్‌’ గీతముంది.

రెండు ఉత్సాహభరితమైన పాటలు, ఓ మంచి మెలోడీతో ఇప్పటికే ‘మాస్ జాతర’ ఆల్బమ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా విడుదలైన మాస్ ని ఉర్రూతలూగించే ఈ ‘సూపర్ డూపర్‌’ గీతం, ఆ స్థానాన్ని మరింత పదిలం చేసింది. మునుపటి మాస్ మహారాజా రవితేజను గుర్తుచేసేలా, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే స్వాగ్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలీల తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో మరోసారి తెరపై వెలుగులు వెదజల్లారు. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ మాస్ గీతాన్ని ప్రేక్షకులు మెచ్చే నిజమైన వేడుకలా మలిచాయి.

‘సూపర్ డూపర్’ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ ని మెప్పించడంతో పాటు, అందరినీ కాలు కదిపేలా చేసేలా ఎంతో హుషారుగా ఈ గీతముంది. భీమ్స్ సిసిరోలియోతో కలిసి రోహిణి సోరట్ ఆలపించడం ఈ పాటకు మరింత హుషారుని తీసుకొని వచ్చింది. గీత రచయిత సురేష్ గంగుల అందరూ పాడుకునేలా ఉల్లాసభరితమైన సాహిత్యాన్ని అందించి ఆకట్టుకున్నారు. సంగీతం, గానం, సాహిత్యం అన్నీ చక్కగా కుదిరి.. ‘సూపర్ డూపర్’ను ఓ గొప్ప మాస్ గీతంగా తీర్చిదిద్దాయి.

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ‘మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుండి ‘మాస్ జాతర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు పాటలకు విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన నాలుగో గీతం ‘సూపర్ డూపర్’, సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. కొద్దిరోజులుగా ప్రత్యేక ఇంటర్వ్యూలతో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ కూడా త్వరలో రానుంది. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మాస్ జాతర
తారాగణం: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను భోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

“Super Duper” from Mass Jathara: A High-Voltage Mass Treat by Ravi Teja, Sreeleela & Bheems Ceciroleo!

After delivering three chartbusters with Tu Mera Lover, Ole Ole, and Hudiyo Hudiyo. Team Mass Jathara shifts gears back to full-on mass mode with this high-energy number, Super Duper. This blockbuster tune perfectly blends Ravi Teja’s mass appeal with Sreeleela’s energy, making it the ideal commercial song for both the film and its album.

Following two energetic tracks and a melody, it’s time once again for a pulsating mass number. Ravi Teja brings back his trademark vintage swag with effortless energy, while Sreeleela lights up the screen with her dazzling moves and infectious energy. Together, their chemistry transforms this song into a true celebration for audiences.

Super Duper carries Bheems Ceciroleo’s signature energy and foot-tapping beats. A perfect dance number that promises massive appeal. Sung by Bheems Ceciroleo and Rohini Sorrat, the track delivers a high-voltage musical experience, complemented by Suresh Gangula’s catchy and peppy lyrics.

Directed by Bhanu Bhogavarapu, known for penning several Telugu blockbusters, Mass Jathara is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, with Srikara Studios presenting the film.

Ever since its announcement, Mass Jathara has been creating nonstop buzz. With back-to-back hit songs and engaging team interactions, excitement is only building.. Especially as the highly anticipated trailer is just around the corner. The film promises to be a complete mass feast for audiences, hitting theatres on October 31st.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

Next Post

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

Next Post
ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ట్రైలర్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

by Maari
November 16, 2025
0

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

ఫన్ అండ్ ఎమోషనల్… సంతాన ప్రాప్తిరస్తు

by Maari
November 14, 2025
0

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
November 11, 2025
0

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

by Maari
November 11, 2025
0

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

యువతను మెప్పించే గర్ల్ ఫ్రెండ్

by Maari
November 7, 2025
0

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో..  చూసి కాసేపు నవ్వుకోండి…!

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. చూసి కాసేపు నవ్వుకోండి…!

by Maari
November 7, 2025
0

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది-మంచు మనోజ్

by Maari
November 5, 2025
0

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

పురుషః చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

by Maari
November 5, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.