యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన “దీవాన” మూవీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు అందరి దగ్గర నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా, కల్ట్ ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు టీజర్ తో ఏర్పడుతున్నాయి. బేబి, అర్జున్ రెడ్డి వైబ్స్ టీజర్ లో కనిపించడంతో అటు ట్రేడ్ సర్కిల్స్ నుంచి కూడా సంప్రదింపులు బాగా జరుగుతున్నాయి. “దీవాన” టీజర్ లో హర్షిత్, స్మేహ మణిమేగలై జంట ఫ్రెష్ గా ఉండటం, బ్యూటిఫుల్ విజువల్స్, బీజీఎంగా వచ్చిన ప్రేమ ఇది ప్రేమ సాంగ్ కూడా అందరికీ ఇన్ స్టంట్ గా నచ్చేసింది.
స్టూడెంట్స్ థియేటర్స్ కు ఎక్కువగా వచ్చే సమ్మర్ సీజన్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా యూత్ ఆడియెన్స్ టార్గెట్ గా మంచి సక్సెస్ కొట్టేలా కనిపిస్తోంది. “దీవాన” చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. “దీవాన” సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.










