• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యువతను ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో రూపొందిన టీనేజ్ లవ్ స్టోరీ మధురం

ఏప్రిల్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

admin by admin
March 30, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, special, sports
0
యువతను ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో రూపొందిన టీనేజ్ లవ్ స్టోరీ మధురం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం *మధురం*. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 18న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. ‘ శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ అధినేత బంగార్రాజు గారు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే దర్శకుడు రాజేష్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా కెమెరామెన్ మనోహర్ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ చేశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు. మధురం ఎ మెమొరబుల్ లవ్.. ఇట్స్ ఎ క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది” అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. ‘1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాం. మా నిర్మాత బంగార్రాజు మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. అలాగే మా డిఓపి మనోహర్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది” అని చెప్పారు.

నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ.. “రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఏప్రిల్ 18న సినిమా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే నితిన్ గారు రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది” అని అన్నారు.

హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ..”ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరిని అలరిస్తుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అని చెప్పారు.

నటీనటులు ; ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్, బస్ స్టాప్ ఫేం కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ తదితరులు ..

కెమెరామెన్; మనోహర్ కొల్లి,
మ్యూజిక్; వెంకీ వీణ, పాటలు; రాఖీ,
ఎడిటర్; ఎన్టీఆర్,
నిర్మాత; యం. బంగార్రాజు, కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; రాజేష్ చికిలే,
పి. ఆర్.ఓ; జి కె మీడియా (కుమార్, గణేష్).

The teenage love story movie Madhuram is set to hit the screens on April 18th

 

Uday Raj and Vaishnavee Singh play the lead roles in the film Madhuram, produced by M. Bangarraju under the banner of Sri Venkateswara Entertainment. The film directed by Rajesh Chikile comes with the tagline “A Memorable Love.” Madhuram tells a teenage love story and has already completed its shooting and post-production work. The movie is now gearing up for its theatrical release on April 18th.

On the occasion, hero Uday Raj said, “Sri Venkateswara Entertainments’ head Bangarraju garu gave me the opportunity to act in this film and supported the production without compromising on quality. Director Rajesh has done a wonderful job. Our cinematographer Manohar has delivered excellent visuals, and music director Venky Veena has composed superb songs. Madhuram is a memorable love story, a clean youth and family entertainer. I believe this film will be enjoyed by everyone and will be a turning point for me.”

Film director Rajesh Chikile shared, “This is a teenage love story set in the 1990s. We have depicted the school atmosphere, games, riots, and fights from that time, bringing them to the eyes of today’s generation. Watching this film will remind people of their school and college days. We worked hard to bring this film to life, and our producer Bangarraju garu provided unwavering support. Our DOP Manohar has done a fantastic job with the visuals. I believe this film will connect with everyone.”

Producer M. Bangarraju added, “We have made this film as a romantic love entertainer. We have completed the post-production and censor procedures, and the film will be released on April 18. The teaser launched by Nithiin has already received a great response. We are confident that the film will be loved by everyone.”

Heroine Vaishnavee Singh said, “This is a youthful entertainer. My character in this film will entertain everyone. Uday Raj has supported me a lot. I thank the director and producer for giving me the opportunity in such a great concept.”

The cast includes Uday Raj, Vaishnavee Singh, Bus Stop fame Koteswara Rao, Divya Sri, Samyu Reddy, Jabardasth Aishwarya, Usha, Appu, Ram, and others.

Cinematography: Manohar Kolli
Music: Venky Veena
Songs: Rakhi
Editor: NTR
Producer: M. Bangarraju
Story-Dialogues-Screenplay-Director: Rajesh Chikile
P.R.O: GK Media (Kumar, Ganesh)

Tags: MadhuramThe teenage love story movie Madhuram is set to hit the screens on April 18th
Previous Post

“శివ శంభో చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈటెల రాజేంద్ర”

Next Post

ఉగాది శుభాకాంక్షలతో డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫ్రై డే” పోస్టర్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

Next Post
ఉగాది శుభాకాంక్షలతో డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫ్రై డే” పోస్టర్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

ఉగాది శుభాకాంక్షలతో డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "ఫ్రై డే" పోస్టర్ రిలీజ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.