వరుణ్ సందేశ్ హీరోగా హీరోయిన్ షగ్నశ్రీ వేణున్ దర్శకత్వం వహిస్తున్న “హలో ఇట్స్ మీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్
ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్నశ్రీ వేణున్ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా “హలో ఇట్స్ మీ”. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నారు. షగ్నశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శన్ మదమంచి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ 2 ఎస్ సినిమాస్, శ్సాస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వీఎస్ కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో
నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ – నేను షగ్నతో గతంలో ఓ షార్ట్ ఫిలిం చేశాను. అందులో నాది ఆమెకు ఫాదర్ రోల్. అప్పటి నుంచి డాడీ అని పిలుస్తుంటుంది. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మా తల్లిదండ్రి రాజశేఖర్ అని పేరు పెడితే, ఈ కళామతల్లి శుభోదయం సుబ్బారావు అనే పేరు పెట్టింది. అన్నారు.
నటుడు డా. భద్రమ్ మాట్లాడుతూ – హలో ఇట్స్ మీ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. వరుణ్ సందేశ్ గారితో నేను గతంలో నింద అనే మూవీలో నటించాను. ఆయన పర్ ఫార్మెన్స్ కు ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో కూడా ఆయన నటనకు పేరొస్తుంది. షగ్న ఈ సినిమాను ఎంతో పట్టుదలగా రూపొందించింది. ఈ నిర్మాతలకు ఎన్నో వ్యాపారాలు ఉన్నా సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో వచ్చారు. అన్నారు.
నటుడు జశ్వంత్ మాట్లాడుతూ – హలో ఇట్స్ మీ చిత్రంలో మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమా చూశాక ఒక అబ్బాయి ఎలాంటి తప్పు చేయకూడదో ఒక అమ్మాయి ఎలాంటి తప్పు చేయకూడదో తెలుసుకుంటారు. ఈ సినిమాతో దర్శకురాలిగా షగ్నకు మంచి పేరొస్తుంది. అన్నారు.
నటి నందిని మాట్లాడుతూ – నటిగా నా ఫస్ట్ మూవీ ఇది. తొలి చిత్రమే నా ఫేవరేట్ హీరో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, హీరోయిన్ షగ్న, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.
డీవోపీ బ్రహ్మతేజ మరిపూడి మాట్లాడుతూ – ఈ చిత్రాన్ని షగ్న అన్నీ తానై వన్ మ్యాన్ ఆర్మీలా రూపొందించింది. మనకు ఆ మధ్య విపరీతంగా చలి వాతావరణం వచ్చింది. ఆ టైమ్ లో మేము నైట్ షూటింగ్ చేశాం. ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతాయి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన మాట్లాడుతూ – హలో ఇట్స్ మీ వంటి ఒక మంచి మూవీలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు సమాజంలో యూత్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్ని ఈ చిత్రంలో ఆకట్టుకునేలా చూపిస్తున్నారు. వరుణ్ సందేశ్ గారు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాక మ్యూజిక్ డైరెక్టర్ గా నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. ఆయనకు కూడా మా పాటలు అన్నీ బాగా నచ్చాయి. అన్నారు.
ప్రొడ్యూసర్ సంజీవ్ మాట్లాడుతూ – ఈ సినిమా అనౌన్స్ చేశాక నాకు నా సర్కిల్ నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సక్సెస్ ఫుల్ గా బిజినెస్ లో ఉన్న మీరు ఫిలింమేకింగ్ లోకి ఎందుకు వచ్చారు. ఇక్కడ సక్సెస్ కు గ్యారెంటీ లేదు అని అన్నారు. అలాగే హీరోయిన్ ను డైరెక్టర్ గా పెట్టి సినిమా ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. షగ్న కథ చెప్పిన విధానంలో ఆమె ప్యాషన్ కనిపించింది. వ్యక్తిగత జీవితంలో కూడా ఏదో సాధించాలనే తపన ఉన్న అమ్మాయి షగ్న. స్వతహాగా కష్టపడి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా మారిన తర్వాత కూడా అక్కడితో ఆగకుండా ఇప్పుడు దర్శకురాలిగా మెగాఫోన్ పడుతోంది. ఇలా ప్యాషన్ ఉన్న వారికి సపోర్ట్ చేసేందుకైనా సినిమా నిర్మించాలని అనిపించింది. వరుణ్ సందేశ్ గారు ఒక బ్రదర్ లా మాతో ఉంటున్నారు. ఆయన ఇచ్చిన సహకారం మర్చిపోలేము. మా టీమ్ అంతా కష్టపడి ప్యాషనేట్ గా మూవీ చేస్తున్నారు. మేము ఈ సినిమా ప్రారంభించినప్పుడు షూటింగ్స్ కు రాలేము, బిజినెస్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను. కానీ ఒక్కరోజు షూటింగ్ కు వెళ్లాక వీళ్లంతా ఇష్టంగా పనిచేస్తున్న తీరు చూసి రోజూ షూటింగ్ కు వెళ్తున్నాం. త్వరలోనే మంచి కంటెంట్ తో మీ ముందుకు సినిమాను రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.
ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ – షగ్న హీరోయిన్ గా, దర్శకురాలిగా ఈ మూవీ కోసం చాలా కష్టపడింది. హీరోయిన్ గా తన క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేస్తూనే, సినిమాను డైరెక్ట్ చేయడం అంటే సులువు కాదు. వరుణ్ గారిని మేము ఇష్టపడతాం. ఆయన ప్రాజెక్ట్ లోకి వచ్చాక మా ఎగ్జైట్ మెంట్ రెట్టింపు అయ్యింది. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణం. వంశీకాంత్ ఇచ్చిన ఆరు పాటలు చాలా బాగుంటాయి. టీమ్ అంతా కష్టపడి చేసిన ఈ సినిమా మీ అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది. అన్నారు.
నింద దర్శకుడు రాజేశ్ జగన్నాథం (ఆర్జే) మాట్లాడుతూ – ఒక యంగ్ హీరోయిన్ తను నటిస్తూ, దర్శకత్వం చేయడం చాలా అరుదు. షగ్నను మనమంతా అప్రిషియేట్ చేయాలి. సంజీవ్, సందీప్, సంకీర్త్ ఎంతో ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. వాళ్లతో నేను ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా చేస్తున్నాను. వరుణ్ వరుసగా థ్రిల్లర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో అతను ఒక మంచి ఫ్యామిలీ, రోమ్ కామ్ జానర్ లో చూస్తాం. అన్నారు.
హీరోయిన్, డైరెక్టర్ షగ్న శ్రీ వేణున్ మాట్లాడుతూ – డైరెక్టర్ గా ఇది నా మొదటి సినిమా. మంచి కథా కథనాలతో సినిమా చేస్తున్నాను. ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఈ మూవీ రిలేట్ అవుతుంది. యూత్ అంతా మా చిత్రానికి కనెక్ట్ అవుతారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు హీరోయిన్ దర్శకత్వంలో సినిమా ఎందుకని నెగిటివ్ గా మాట్లాడారు. మా ప్రొడ్యూసర్స్ నాపై నమ్మకం ఉంచి, ఎవరి సందేహాలు వినకుండా సినిమా చేశారు. సినిమాను దర్శకత్వం చేయడంలో ఆడా, మగా తేడా ఏం లేదు. మనం అనుకున్న సీన్ అనుకున్నట్లు రూపొందించామా లేదా అనేది కావాలి. అందుకు టీమ్ అంతా సపోర్ట్ చేయాలి. నాకు అలాంటి మంచి సపోర్టింగ్ టీమ్ దొరికింది. వరుణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు ఈ కథ కొన్ని గంటలు చెప్పాను. సహనంగా విన్నారు. అలాగే ఎక్కువ టైమ్ షూటింగ్ చేసేవారు. ఇంకొద్ది రోజులే షూటింగ్ మిగిలి ఉంది. మా ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, నా డైరెక్షన్ టీమ్, మా ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరో దర్శన్ మదమంచి మాట్లాడుతూ – షగ్న ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ క్యారెక్టర్ లో తప్పకుండా పర్ ఫార్మ్ చేయాలని అనుకున్నాను. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. నాకు ఇలాంటి ఆఫర్ వచ్చేందుకు కొన్నేళ్ల టైమ్ పట్టింది. ప్రతి ఆర్టిస్టుకు తనదైన టైమ్ తప్పకుండా వస్తుంది. ఈ రోజు నేను వేదిక మీద నిలబడ్డా. రేపు మీరూ నిలబడతారు. ఈ సినిమాతో మా అందరినీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. అన్నారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – నా రీసెంట్ ప్రాజెక్ట్ నయనం అందరి ఆదరణ పొందుతోంది. ఇటీవల వరుసగా థ్రిల్లర్స్ చేస్తూ వస్తున్నాను. అలాంటి టైమ్ లో హలో ఇట్స్ మీతో ఒక మంచి ఫ్యామిలీ, లవ్ మూవీ చేస్తున్నాను. ఇది క్లీన్ ఫ్యామిలీ మూవీ. యువతీ యువకులు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది షగ్న బ్యూటిఫుల్ గా ఈమూవీలో చూపించింది. ఆమె స్టోరీ నెక్ట్స్ లెవెల్ లో చెప్పింది. అప్పుడే డైరెక్టర్ గా ఆమెను నమ్మాను. షగ్న తప్పకుండా మంచి సినిమా చేస్తుందని బిలీవ్ చేశాను. నా రీసెంట్ ప్రాజెక్ట్ నయనం కూడా లేడీ డైరెక్టర్ స్వాతి చేశారు. నాకు హిట్ ఇచ్చారు. షగ్న కూడా ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నాను. నా మూవీస్ కొత్తబంగారు లోకం, హ్యాపీడేస్ సాంగ్స్ కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఆడియెను మిస్ అవుతున్నాను అనుకున్నాను. ఈ చిత్రంలోని పాటలతో ఆ కొరత తీరనుంది. ఈ మూవీ సాంగ్స్ ను కొన్నేళ్ల వరకు వింటూనే ఉంటారు. వంశీకాంత్ అంతమంచి ఆడియో ఇచ్చారు. ప్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ సందీప్, సంజీవ్, సంకీర్త్ లకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలి. అన్నారు.
నటీనటులు – వరుణ్ సందేశ్, షగ్న శ్రీ వేణున్, దర్శన్ మదమంచి, ఆమని, కల్పలత, డా.భద్రమ్, నందినీ, దీపక్, శుభోదయం సుబ్బారావు, తదితరులు
టెక్నికల్ టీమ్
——————
కాస్ట్యూమ్స్ – దర్శిత్
కొరియోగ్రాఫర్ – శ్రవణ్ ముప్పిరి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – బ్రహ్మతేజ మరిపూడి
సంగీతం – వంశీకాంత్ రేఖన
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – వీఎస్ కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్
స్టోరీ, డైరెక్షన్ – షగ్న శ్రీ వేణున్










