వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్ గా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కానిస్టేబుల్’.
గత ఏడాది అక్టోబర్ 10న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి బుక్ మై షో లో 9.6 రేటింగ్ లభించింది. ప్రేక్షకుల ఆదరణతో ఇప్పుడు ఈటీవీ విన్ లో సమస్త ఓటిటి
ప్లాట్ ఫామ్ లో జనవరి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, “కొన్ని అనివార్య కారణాలవల్ల ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి మా చిత్రం రావడానికి ఆలస్యమైనది. ఈ సినిమా ఓటిటి లో అత్యధికంగా ప్రజాదారణ పొందుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాకు మీరు ఇచ్చే రేటింగ్ ద్వారా నేను తదుపరి సినిమాలు చేయడానికి ఆస్కారం అవుతుంది” అని అన్నారు.
దర్శకుడు ఆర్యన్ మాట్లాడుతూ, “లేట్ అయినా సరే చాలా అత్యున్నత ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి మా సినిమా రాబోతుంది. ఈ ఆదరణ తదుపరి చేయబోయే సినిమాలకు ఆసక్తిని పెంచుతుందని” అని అన్నారు.
ఈ చిత్రంలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, బి.జి.ఎం. గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ,
సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపేంద్ర పవర్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్ ఎస్. కె..










