ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకుడనేవాడు ఐదారు సంవత్సరాలకు ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్న ప్రస్తుత తరుణం లో ఓ యంగ్ డైరెక్టర్ ఏకంగా రెండు సినిమాలతో ఈ వేసవి లో టాలీవుడ్ ను టచ్ చేయబోతున్నాడు. అతను మరెవరో కాదు వంశీ కృష్ణ మళ్ళ. లెజెండరీ స్టార్ యాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో త్వరలో రాబోతున్న “దక్ష” ఓ వైపు…హర్ష, ఇనయ సుల్తానా కాంబినేషన్లో తెరకెక్కిన “మదం” సినిమా మరోవైపు… ఇలా రెండు సినిమాల డైరెక్షన్ బాధ్యతలు దిగ్విజయం గా పూర్తి చేసుకుని , రెండు సినిమాలను ఈ వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నద్ధమయ్యారు
ఈ సందర్భంగా వంశీకృష్ణ మళ్ళ మాట్లాడుతూ “నాకు దక్ష వంటి మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించిన మోహన్ బాబు గారికి, మంచు లక్ష్మి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సెన్సార్ బోర్డు మదం సినిమా చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉందనిపించి రివిజన్ కమిటీ కి సిఫార్సు చేసారు.రివిజన్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వగానే ఈ వేసవి కి థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం.ఆ రెండు సినిమాలు సక్సెస్ బాటలో పయనించి తనకు డైరెక్టర్ గా మంచి నేమ్ తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు వంశీ కృష్ణ మళ్ళ
Young and talented director Vamsee Krishna Malla is all set to make waves in Tollywood with two upcoming films this summer. In today’s era, where a director might direct just one film in five years, Vamsee Krishna Malla is making a remarkable move by directing two films simultaneously. One of these films, Daksha, stars the legendary actor Mohan Babu and Manchu Lakshmi in prominent roles. On the other hand, the film Madham, starring Harsha and Inaya Sultana, is another project he’s directed. Vamsee Krishna Malla has successfully completed the direction of both films and is now preparing for their release this summer.
In this regard, Vamsee Krishna Malla expressed his gratitude, saying, “I am very thankful to Mohan Babu Garu and Manchu Lakshmi Garu for entrusting me with the responsibility of directing such a wonderful film like Daksha. Also, the Censor Board found Madham to be very hard-hitting and recommended it to the revision committee. Once the revision committee clears it, we will release the film in theaters this summer. I am hopeful that both these films will succeed and help me establish a good name as a director.”