వైవిధ్యమైన సినిమాలు చేస్తూ… తనకంటూ… తెలుగు సినీ పరిశ్రమలో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి. ఈ చిత్రంలో దళిత వ్వస్థలో వున్న వివక్షత మీద చర్చించారు. ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ తెచ్చుకుంది. హీరో రక్షిత్ అట్లూరికి కూడా మంచి పేరు వచ్చింది. దాంతో తాజాగా “నరకాసుర” అనే చిత్రంతో మరో వివక్షతకు గురైన వర్గాన్ని గురించి ఓ మెసేజ్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చాడు. ఇందులో అతని సరసన అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సెబాస్టియన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 3న విడుదలైంది. ఓకేసారి తెలుగు, హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: శివ(రక్షిత్ అట్లూరి) ఓ కాఫీ ఎస్టేట్ లో పనిచేసే ఓ లారీ డ్రైవర్. అతను మీనాక్షి(అపర్ణ జనార్దన్)ని ప్రేమిస్తుంటాడు. అదే టైమ్ లో అతను నాగమ నాయుడు(చరణ్ రాజ్) అనే ఓ రాజకీయనాయకుణ్ని బాగా ఇష్టపడుతూ… అతనికి మెయిన్ అనుచరుడిగా ఉంటారు. అతన్ని గొప్ప రాజకీయ నాయణ్ని చేయాలని ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా మారుతాడు. అదే సమయంలో నాగమ నాయుడి కుమారుడు ఆది నాయుడు(తేజ చరణ్ రాజ్) మీనాక్షిని ఇష్టపడతాడు. అయితే ఉన్నట్టుండి శివ కనిపించకుండా పోతాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు (శ్రీమాన్) వెతకడం ప్రారంభిస్తారు. మరి అలా తప్పిపోయిన శివ కనిపించాడా? అతణ్ని ఎవరు బంధించారు? శివ ఎందుకు ‘నరకాసుర’ వథ చేయాల్సి వచ్చింది? ఈ నరకాసుర వథలో శివకి సహకరించిన వారేవరు? తదితర వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఓటీటీ ప్లాట్ ఫాం వచ్చిన తరువాత కంటెంట్ బేస్డ్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. ఏదో కొత్తదనం ఉంటేగానీ ఆడియన్స్ థియేటర్ కి రావడం లేదు. యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఎంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అయినా… కథ… కథనంలో కొత్తదనం లేకుంటే ప్రేక్షకులు సినిమాని ఆదరించడం లేదు. అందుకే కొత్త దర్శకుడు సెబాస్టియన్… ఓ కొత్త కాన్సెప్ట్ తో ‘నరకాసుర’ను వెండితెరపై ఆవిష్కరించారు. రొటీన్ కథలను నమ్ముకోకుండా… ఓ వైవిధ్యమైన కథను ఆసక్తి గొలిపే స్క్రీన్ ప్లేతో సెల్యులాయిడ్ పై ఆవిష్కరించి ఆడియన్స్ ను అలరించారు. ఓ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని చూపించడంతో పాటు… సమాజంలో వివక్షకు గురైన హిజ్రాల గురించి ఓ మంచి మెసేజ్ ఇవ్వడానికి రాసుకున్న కథ… కథనాలు ఆకట్టుకుంటాయి. గతంలో లారెన్స్ సినిమాల్లో ఇలాంటి వాటిని చూసినా… ఇందులో మాత్రం వారి పాత్రకు ఇచ్చిన ప్రాధానం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వారితో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. వీటికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అలాగే పరస్త్రీ వ్యామోహం తగదని… అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పడమే ‘నరకాసుర‘ వథ అనే అంశాన్ని రివేంజ్ డ్రమాగా ఓ సందేశాత్మకంగా తెరరపై చూపించడం ఆకట్టుకుంటుంది. ఇదొక మాస్ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.
నటీనటుల విషయానికొస్తే… రక్షిత్ అట్లూరి మరోసారి తన మాస్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్సెన్స్ లో మాస్ ఆడియన్స్ ను అలరించాడు. అతనికి జంటగా మీనాక్షి పాత్రలో నటించిన అపర్ణ జనార్ధన్ తన హోమ్లీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. హీరో మరదలుగా నటించిన సంకీర్తన విపిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ఆమె కూడా ఓ కీలకమైన మాస్ యాక్షన్ సీక్సెన్స్ తో ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుని పాత్రలో నటించిన చరణ్ రాజ్ పాత్ర పర్వాలేదు. చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో కనిపించాడు చరణ్ రాజ్. అతని కుమారునిగా నటించిన తేజ్ చరణ్ రాజు కూడా ఆకట్టుకుంటాడు. శత్రు అండ్ అతని టీమ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టకున్నారు. తమిళ నటుడు శ్రీమాన్ చాలా కాలం తరువాత ఇందులో కనిపించి నవ్వించారు. నాజర్ పాత్ర పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే… దర్శకుడు సెబాస్టియన్ రాసుకున్న కథ… కథనాలు చాలా కొత్తగా ఉన్నాయి. డెబ్యూ దర్శకుడే అయినా… కథ… కథనం నడిపించడంలో ఎక్కడా తొట్రుపాటు లేకుండా చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారు. కొంచెం స్క్రీన్ ప్లే విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నా… మేకింగ్ లో మాత్రం ఎక్కడా తగ్గకుండా సినిమాను చాలా క్వాలిటీగా తెరెకెక్కించారు దర్శకుడు సెబాస్టియన్. చిత్రం షూటింగ్ సమయంలో తను ఘోర ప్రమాదానికి గురైనా… ఏమాత్రం వెరవకుండా ఈ సినిమాని ఇంత బాగా తెరకెక్కించినందుకు అభినందించి తీరాల్సిందే. అతనికి సినిమాటోగ్రాఫర్ బాగా తోడ్పాటునందించారు. విజువల్స్ చాలా గ్రాండియార్ గా ఉన్నాయి. లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేయగలిగారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన భూమిక పోషించింది. ప్రతి సన్నివేషాన్ని… తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయగలిగారు సంగీత దర్శకుడు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్నా… సెకెండాఫ్ మాత్రం ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ తో సినిమా పరిగెడుతుంది. దాంతో సెకెండాఫ్ ఎక్కడా బోర్ కొట్టదు. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా ఉన్నతంగా నిర్మించారు. సో గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3