• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, February 2, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“హ్యాపీ ఎండింగ్” సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు – హీరో యష్ పూరి

Maari by Maari
January 31, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“హ్యాపీ ఎండింగ్” సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు – హీరో యష్ పూరి

Share and Enjoy !

Shares
Twitter

“చెప్పాలని ఉంది”, “అలాంటి సిత్రాలు”, “శాకుంతలం” వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో యష్ పూరి.

  • మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ “హ్యాపీ ఎండింగ్” కథను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం. సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్టర్ శాపంతో ఇబ్బందులు పడినా..ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు. ఈ సినిమాలో ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కొత్త వేలో కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్, మ్యూజిక్, డీవోపీ వర్క్..ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ ప్రతిభ “హ్యాపీ ఎండింగ్” సినిమాలో చూస్తారు. సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు. చాలా మంది తమ ప్రమోషన్స్ లో బిగినింగ్ మిస్ అవ్వొద్దు, క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు అంటారు. కానీ ఈ సినిమాలో నిజంగానే బిగినింగ్, ఇంటర్వెల్ ఎంత ముఖ్యమో క్లైమాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు మా డైరెక్టర్. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. నేను ట్రైలర్ రిలీజ్ రోజే చెప్పాను మా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని. టీమ్ అంతా అదే నమ్మకంతో ఉన్నాం.
  • మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా “హ్యాపీ ఎండింగ్”. శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్ లో చూపించాం కానీ మా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. ఉంటే యూఏ సర్టిఫికెట్ రాదు. నేను యు సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నా. యుఏ ఇచ్చారు. సో పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. నాలాంటి న్యూ హీరోకు యంగ్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని చెప్పగలను. వాలెంటైన్స్ డే జరిగే వారంలో మా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. లవ్ ను మేము కొత్తగా సెలబ్రేట్ చేస్తున్నాం. పొయెటిక్, అండర్ స్టాండింగ్, స్పిరిచువల్ లవ్ ఉంటుంది. అది థియేటర్స్ లో చూడండి. మనం ఏదైనా విషయాన్ని ఓపెన్ గా చెబితే దాన్ని బోల్డ్ అనొచ్చు. అంతే గానీ అది ఫిజికల్ గా చూపించడం కాదు. శాపం అనేది లేకుంటే ఈ సినిమా కథ ప్రారంభం కాదు. ఒక యువకుడి ఫీలింగ్స్ బయటకు రాకుండా మనసులోనే ఉండిపోతే అతను ఎలా ఉంటాడు అనేది మా సినిమాలో హీరో హర్ష్ క్యారెక్టర్.
  • “హ్యాపీ ఎండింగ్” సినిమాలో పాటలు, కామెడీ బాగా వచ్చాయి. ట్రైలర్ బాగుందని చెబుతున్నారు. అయితే వీటన్నింటినీ కనెక్ట్ చేస్తూ కథలో బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. అదే ఈ సినిమా కథకు అసలైన పాయింట్. శాపం అనేది ఒక చిన్న డ్రైవింగ్ ఫోర్స్ మాత్రమే. కానీ కథలో చివరగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది ఎమోషన్ కే. శాపం ఉంటుంది కాబట్టి వాడు లవ్ ను ఫిజికల్ గా తన ప్రేయసితో చెప్పడు. వేరే పద్దతుల్లో పొయెటిక్ గా తెలియజేస్తాడు. అన్నీ దినుసులు ఉన్న ధమ్ బిర్యానీ లాంటి సినిమా ఇది.
  • సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. వినయంగానే చెబుతున్నాం మా సినిమా సక్సెస్ అవుతుందని. సినిమా ప్రారంభంలోనే శాపాన్ని రివీల్ చేస్తూ ఫస్టాఫ్ సరదాగా విష్ణుతో నేను చేసే కామెడీతో సాగుతుంది. సెకండాఫ్ లో ఎదురయ్యే కొన్ని ఘనటల వల్ల సినిమా ఎమోషనల్ అవుతుంది. నా క్యారెక్టర్ పేరు హర్ష్. కానీ అతని వ్యక్తిత్వం హార్ష్ గా ఉండదు. కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నా. సెన్సార్ అయ్యాక కూడా నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి కొంతమంది సినిమా బాగుందంటూ మాట్లాడారు. సినిమా నచ్చడం వల్లే నాకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.
  • “హ్యాపీ ఎండింగ్” సినిమాకు డెమో షూట్ చేశాం. 8 నిమిషాల ఆ షూట్ ఔట్ పుట్ చూశాక కౌశిక్ కు నా మీద నాకు కౌశిక్ మీద మా ఇద్దరి మీదా సిల్లీ మాంక్స్ వాళ్లకు నమ్మకం ఏర్పడింది. మిగతా సినిమాల వాళ్లు ఇలా డెమో షూట్స్ చేస్తారో లేదో తెలియదు గానీ డెమో షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేశాను. సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ లో దాదాపు అంతా కొత్త వాళ్లే. ఈ యంగ్ టీమ్ కు నిర్మాత అనిల్ గారు సపోర్ట్ గా నిలిచి షూట్ కు పంపారు. ఔట్ పుట్ చూశాక ఆయన హ్యాపీగా ఉన్నారు. నేను నాలుగు సినిమాలు చేశాను. నేను హీరోగా చేసిన గత సినిమాలోనూ స్టోరీనే హీరో అనుకుంటా. ఈ సినిమాలోనూ నేను సెకండ్ హీరో. ఫస్ట్ హీరో కథే.
  • కమర్షియల్ హీరోగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అయితే ఇప్పుడే వందమంది విలన్స్ ను స్క్రీన్ మీద కొట్టినట్లు చూపిస్తే ఎవరూ నమ్మరు. హీరోగా స్థిరపడిన తర్వాత పక్కా కమర్షియల్ స్టైల్ లో మూవీస్ చేస్తా. త్వరలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా.
  • Happy Ending is Dum Masala Biryani kind of film, satisfies everyone with entertainment and right dose of drama: Hero Yash Puri
  • Yash Puri, who made a mark with his performances in ZEE5’s web film Alanti Sitralu, the comedy Cheppalani Undhi and the recently released epic drama Shaakuntalam is gearing up for the release of another film Happy Ending. This light-hearted coming of age tale, directed by Kowshik Bheemidi has god good buzz with the interesting promotional content. Yogesh Kumar, Sanjay Reddy, Anil Pallala are bankrolling the film under Hamstech Films and Silly Monks Studios.
  • Yash Puri interacted with media today. The interview provides insights into the storyline, genre, and unique elements of “Happy Ending,” showcasing Yash Puri’s enthusiasm and confidence in the film’s success.
  • “Happy Ending” explores the concept of curses from mythology, depicting how these curses would impact a modern-day young man. The film aims to showcase the entertaining efforts of the protagonist to face the curse. Despite the challenges faced by the character, the movie maintains a lighthearted and entertaining tone. Not a single minute of the film carries a message; it’s all about fun and entertainment. The characters portrayed by Jhansi and Ajay Ghosh will be presented in a new light. Additionally, the film features notable contributions from various departments such as editing, music, and cinematography. Yash Puri encourages the audience not to miss the last 15 minutes of the movie, promising an emotional and psychological drive.
  • “Happy Ending” integrates a concept from three thousand years ago into a modern-day setting, offering a blend of old and new elements to resonate with contemporary audiences. Yash Puri emphasizes that the film includes youthful content related to the curse’s theme but doesn’t contain adult content, allowing for a UA (Universal Adult) certificate. The movie is designed to appeal to both children and adults, and Yash Puri believes it will be enjoyed with friends. The film’s release during the week of Valentine’s Day aims to celebrate different forms of love.
  • The protagonist’s character, Harsha, embodies the struggles of a young man who keeps his feelings inside due to a curse. Despite the curse being a driving force in the plot, Yash Puri asserts that the film’s real essence lies in the human emotion depicted in the story. The protagonist expresses his love poetically rather than physically, adding a layer of depth to the narrative.
  • Yash Puri expresses confidence in the film’s success, emphasizing the emotional connection with the audience as the real strength of the story. The film, he believes, offers a combination of humor, songs, and an engaging storyline with a strong emotional core. Yash Puri shares that feedback from those who have seen the movie has been positive, contributing to his belief in the film’s success.
  • Reflecting on the film’s journey, Yash Puri mentions shooting a demo that played a crucial role in convincing the producers. The movie features a predominantly new cast and crew, and Yash Puri acknowledges the support of producer Anil, who backed this young team and was pleased with the results. Yash Puri expresses his excitement about the film and hints at the announcement of a new project soon.
  • Yash Puri concludes by stating that while his goal is to become a commercial hero, he recognizes the importance of establishing himself first before venturing into strictly commercial styles. He hints at upcoming projects and envisions a path toward achieving his goals.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘మెకానిక్‌’ లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలను ప్రజలు ఆదరించాలి: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Next Post

రొమాంటిక్ కామెడీ తో “మిస్ పర్ఫెక్ట్” ఆకట్టుకుంటుంది – హీరో అభిజీత్

Next Post
రొమాంటిక్ కామెడీ తో “మిస్ పర్ఫెక్ట్” ఆకట్టుకుంటుంది – హీరో అభిజీత్

రొమాంటిక్ కామెడీ తో "మిస్ పర్ఫెక్ట్" ఆకట్టుకుంటుంది - హీరో అభిజీత్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

by Maari
February 2, 2026
0

హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

by Maari
February 2, 2026
0

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

by Maari
February 2, 2026
0

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది –  దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది – దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

by Maari
February 1, 2026
0

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

by Maari
February 1, 2026
0

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

by Maari
January 31, 2026
0

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

by Maari
January 31, 2026
0

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

by Maari
January 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.