*‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు అలీ
శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద కృతాక్షి నిర్మాణంలో తెరు చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో మోహన సిద్ధి, శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో రాజ్ తరుణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
*అలీ మాట్లాడుతూ* .. ‘‘చలపతి మీద నమ్మకంతో శ్రీ స్కంద తన సొంత డబ్బులు పెట్టి ‘మన డాక్టర్ బాబే’ చిత్రాన్ని నిర్మించాడు. చలపతి, శ్రీ స్కంద కష్టాన్ని నేను చూశాను. చిన్న చిత్రమా? పెద్ద సినిమానా? అని ఆడియెన్స్ పట్టించుకోరు. కథలో బలం ఉంటే, కంటెంట్ ఉండే ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారు. ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. నవంబర్ 20న విడుదలవుతోన్న చిత్రాన్ని చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నానరు.
*రాజ్ తరుణ్ మాట్లాడుతూ* .. ‘‘మన డాక్టర్ బాబే’ చిత్రంతో నిర్మాతగా, హీరోగా వస్తున్న శ్రీ స్కందకి ఆల్ ది బెస్ట్. తెలుగు హీరోయిన్లను చూస్తుండటం ఆనందంగా ఉంది. అలీ గారితో నటించే అదృష్టం రాకపోయినా.. ఆయనతో స్టేజ్ పంచుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. చలపతికి ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి. డైరెక్టర్ హర్ష గారు చలపతి గురించి ఎంతో గొప్పగా చెప్తుంటాడు. కిషోర్ గొప్ప కెమెరామెన్. నవంబర్ 20న ‘మన డాక్టర్ బాబే’ చిత్రం విడుదల అవుతోంది. థియేటర్లో ఈ సినిమాని చూడండి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ* .. ‘‘మన డాక్టర్ బాబే’ సినిమాకి ప్రీమియర్లు వేశాం. చూసిన వారంతా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. చలపతి గారు ఈ మూవీని గొప్పగా తెరకెక్కించారు. నవ్విస్తూ మంచి సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించారు. ఎమోషన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. చలపతి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. కిషోర్ గారు మాకు మంచి విజువల్స్ ఇచ్చారు. అలీ గారితో నటించడం నా అదృష్టం. మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఆడియెన్స్ పెట్టే డబ్బులు వృథా కావు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన కృతాక్షి, మా బావ గౌతమ్ గారికి, మురళీ గారికి థాంక్స్. అందరూ ఈ చిత్రాన్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*దర్శకుడు చలపతి కుమార్ పువ్వల మాట్లాడుతూ* .. ‘‘శ్రీ స్కంద వల్లే ‘మన డాక్టర్ బాబే’ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. శృతి శంకర్, మోహన సిద్ధి చక్కగా నటించారు. నిర్మాణంలో కృతాక్షి గారు ఎక్కడా, ఎప్పుడూ రాజీ పడలేదు. అలీ గారు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన కామెడీ అద్భుతంగా ఉంటుంది. రాజీవ్ కనకాల గారు, శాంతి గారు అందరూ గొప్పగా నటించారు. మా కోసం వచ్చిన రాజ్ తరుణ్ గారికి థాంక్స్. మా సినిమా నవంబర్ 20న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*శృతి శంకర్ మాట్లాడుతూ* .. ‘‘మా కోసం వచ్చిన రాజ్ తరుణ్ గారికి థాంక్స్. మా చిత్రం నవంబర్ 20న రాబోతోంది. చలపతి గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. శ్రీ స్కంద గారి వల్లే సినిమా ఈ స్థాయికి వచ్చింది. అందరూ మా మూవీని చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అందరినీ నవ్వించేలా మా సినిమా ఉంటుంది. నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*మోహన సిద్ధి మాట్లాడుతూ* .. ‘‘మన డక్టర్ బాబే’ టీజర్, ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. చలపతి గారు మా అందరినీ బాగా చూసుకున్నారు. కిషోర్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు.
*కూర్మావతారం దర్శకుడు హర్షవర్దన్ మాట్లాడుతూ* .. ‘దర్శకుడు చలపతి గారు మంచి వ్యక్తి. ‘మన డాక్టర్ బాబే’ ట్రైలర్ బాగుంది. నవంబర్ 20న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.










