• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, April 24, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సారంగదరియా… ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా…!!!

Maari by Maari
July 12, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
సారంగదరియా… ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా…!!!

Share and Enjoy !

Shares
Twitter


వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ… వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు రాజా రవీంద్ర. అందుకే దశాబ్దాలు గడిచినా.. వెండితెరపై కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్ర పోషించి నటించిన చిత్రం ‘సారంగదరియా’. ఈ చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు. నూతన దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేసే కృష్ణ కుమార్(రాజా రవీంద్ర)కి అర్జున్(మొయిన్ మొహ‌మ‌ద్‌), సాయి(మోహిత్ పేడాడ) అనే ఇద్దరు కుమారులు, అనుపమ(యశస్విని) అనే ఒక కుమార్తె ఉంటారు. అర్జున్… కావ్య(దేవి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఇద్దరి క్యాస్టులు వేరు వేరు కావడంతో అమ్మాయి తండ్రి అంగీకరించకపోవడంతో లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. దాంతో తాగుడుకు బానిస అవుతాడు. రెండో కుమారుడు సాయి… అదే ఊరికి చెందిన ఫాతిమ(మధులత)ను ప్రేమిస్తుంటారు. అయితే వీరిద్దరిది మతాలు వేరు కావడంతో అందుకు ఫాతిమా తండ్రి అంగీకరించడు. కూతురు అనుపమ(యశస్విని)ని అదే గ్రామానికి చెందిన రాజు(శివ చందు) ప్రేమిస్తుంటాడు. అయితే తనకున్న వ్యక్తిగత కారణాల వల్ల అనుపమ రాజు ప్రేమను అంగీకరించదు. అయినా రాజు… అనుపమను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో రాజు తండ్రికి.. అనుపమ గురించి ఓ భయంకరమైన నిజం తెలిసి… కృష్ణ కుమార్ కుటుంబాన్ని అవమానిస్తాడు. దాంతో కృష్ణ కుమార్… అనుపమను తీవ్రంగా మందలించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది. ఈ క్రమంలో అనుపమ ఈ అవమానాల నుంచి బయటపడటానికి తను ‘మిస్ బ్యూటీ క్వీన్ కాంపిటీషన్’లో పాల్గొని కిరీటాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది. మరి అనుపమ అందుకోసం ఎలా ప్రిపేర్ అయ్యింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురయిన సవాళ్లు ఏంటి? అసలు అనుపమకున్న వ్యక్తిగత ఇబ్బందులు ఏంటి? దాని వల్ల ఆమె కుటుంబం ఇలాంటి అవమానాలు ఎదుర్కొంది? దానిని నుంచి బయటపడేందుకు ఆమె అనుకున్న మిస్ బ్యూటీ కాంపిటీషన్ లో టైటిల్ ను నెగ్గిందా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: ఫ్యామిలీ డ్రామా స్టోరీలకు కథ సమకాలీన అంశానికి సంబంధించినదై ఉండాలి. దానిని డ్రైవ్ చేయడానికి కావాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు బాగా ఎంగేజ్ అవుతారు. అలాగే డ్రామా పండాలి అంటే… పాత్రల మధ్య ఎమోషన్స్ ఉండాలి. అందుకు తగ్గట్టుగా సంభాషణలు పలకాలి. అప్పుడే ఫ్యామిలీ డ్రామా చిత్రాలు సిల్వర్ స్క్రీన్ పైన ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. బాక్సాఫీస్ ను కళకళలాడిస్తాయి. ఈ ‘సారంగదరియా’ చిత్రం కూడా మంచి ప్లాట్ తో తెరకెక్కింది. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి ప్లాట్ ను వెండితెరపై చూసుండం. అలాంటి ప్లాట్ ను తీసుకుని దర్శకుడు… ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా కథను ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా తెరకెక్కించారు. ఓ సిన్సియర్ లెక్చరర్… అతనికి ఉన్న ముగ్గురు సంతానం… ముగ్గురూ ఓ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే… వారి భవిష్యత్తును చక్కదిద్దడానికి ఓ తండ్రి పడే కష్టాల సమాహారమే ఈ చిత్రం సారాంశాం. ఇలాంటి కథ… కథనాలను వెండితెరపై చూపించాలి అంటే మొదట ఈ సినిమా నిర్మాతలకు గట్స్ ఉండాలి. దానిని తెరమీద కన్వెన్సింగ్ గా చూపించడానికి దర్శకుడు కూడా పకడ్బంధీ సరంజామాతో రెడీ అవ్వాలి. అప్పుడే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు కూడా ఈ సినిమాని వెండితెరపై చూపించడానికి ఇలాంటి అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యే చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారు. అందుకు ప్రతి ఒక్క ఆడియన్ కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశానికి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చుతుంది.


అయితే కాస్త నోటెడ్ నటీనటులు ఉండి వుంటే… ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే సూచనలుండేవి. ఒక్క రాజా రవీంద్ర, కాదాంబరి కిరణ్, హర్షవర్దన్, శ్రీకాంత్ అయ్యంగార్, కమేడియన్ అనంత్, విజయమ్మ తదితరులు మాత్రమే క్యారెక్టర్స్ ఆర్టిస్టులున్నారు. లీడ్ రోల్ పోషించిన వారంతా వెబ్ సిరీస్, యూట్యూబ్ లో నటించిన అనుభవం ఉన్నవారే. మొయిన్ మొహమ్మద్ మాస్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నారు. లీడ్ రోల్ పోషించిన రాజా రవీంద్ర తనదైన శైలిలో ఓ లెక్చరర్ ఎలా ఉంటారో అలా నాచురల్ గా కనిపించి మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా సెకెండాఫ్ లో ఎంట్రీ ఇచ్చి మెప్పించారు. కొత్త నటుడు మోహిత్ కూడా తనదైన కొంటెతనం, అల్లరి యువకుని పాత్రలో ఆకట్టుకున్నారు. లీడ్ రోల్ పోషించిన యశస్విని కూడా క్లైమాక్స్ లో బాగా ఆకట్టుకుంటుంది. ఇక మిగతా పాత్రలన్నీ ఓకే.

దర్శకుడు రాసుకున కథ… కథనాలు బాగున్నాయి. చాలా యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలకు ఇది పర్ ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. లెజెండ్రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.., ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది.. నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ సినిమాలోని కథ, పాత్రల లోతుని చూపిస్తున్నాయి. నిర్మాతలు ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ తీసుకుని ధైర్యంగా బడ్జెట్ పెట్టడం ఓ సాహసమే అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3.25

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“హలో బేబీ”కి పురస్కార్ నంది అవార్డు

Next Post

ఘనంగా ఇండియా ఫైల్స్ ఆడియో వేడుక

Next Post
ఘనంగా ఇండియా ఫైల్స్ ఆడియో వేడుక

ఘనంగా ఇండియా ఫైల్స్ ఆడియో వేడుక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

పరమపద సోపానం… గ్రిప్పింగ్ థ్రిల్లర్

పరమపద సోపానం… గ్రిప్పింగ్ థ్రిల్లర్

by Maari
April 24, 2026
0

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

by Maari
April 23, 2026
0

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

by Maari
April 23, 2026
0

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
April 22, 2026
0

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను –  ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

by Maari
April 21, 2026
0

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

by Maari
April 21, 2026
0

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

by Maari
April 20, 2026
0

మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” గ్లింప్స్ విడుదల

మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” గ్లింప్స్ విడుదల

by Maari
April 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.