డిమోంటి కాలనీ2… పార్ట్ వన్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా వచ్చినా ‘డిమోంటి కాలనీ2’కి విపరీతమైన క్రేజ్ వుంది. అందులోనూ తమిళంలో గత వారమే విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆ పాజిటివ్ టాక్ రావడంతోనే తెలుగులోనూ ప్రీమిర్స్ వేసి… ఆడియన్స్ నుంచి మంచి స్పందన రాబట్టుకున్నారు. దాంతో ఈ సినిమాని ఈ రోజు థియేటర్లో విడుదల చేశారు. మరి తొలి భాగం లాగే… ద్వితీయ భాగం కూడా ఏమాత్రం ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ: డెబ్బీ (ప్రియా భవానీ శంకర్)… ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది. అదే సమయంలో తను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు శామ్యూల్ రిచర్డ్ అలియాస్ సామ్ (సర్జానో ఖలీద్) విషాదకరమైన ఆత్మహత్య వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. అందుకు ఆత్మలను శోధించిన ప్రముఖ టిబెటియన్ గురువు దావోషి (త్సెరింగ్ దోర్జీ) సహాయం కోరుతుంది. అతని ఆదేశాలను అనుసరించి తన ప్రియుడు శామ్ ఆత్మను చేరుకుని… అతనికి, విడిపోయిన కవల సోదరులు శ్రీని మరియు రఘు (అరుల్నితి ద్విపాత్రాభినయం) మధ్య వున్న ఓ ఆశ్చర్యకరమైన బంధాన్ని తెలుసుకుంటుంది. కవల సోదరులు మధ్య ఉన్న ఆ భయంకరమైన బంధం ఏమిటి? అందుకు కారణాలు ఏమిటి? దానికి కారణమైన అన్‌సంగ్ కింగ్ ఆఫ్ ఎ ఫాలెన్ కింగ్‌డమ్ గురించిన పుస్తకం, ప్రతి ఆరేళ్లకు పునరావృతమయ్యే దుర్మార్గపు శాపం గురించి తెలుసుకుని వాటిని వెలికితీయడం ప్రారంభిస్తుంది. మరి ఆ శాపం ఏంటి? దానికీ డిమోంటి కాలనీకి సంబంధం ఏమిటి? కవల సోదరుల మధ్య ఉన్న ఆ బంధం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డిమోంటి కాలనీ 2… వెంజియన్స్ ఆఫ్ ది అన్ హోలీతో డిమోంటి కాలనీ కథాంశాన్ని అద్భుతంగా అల్లుకున్నారు. రెండు చిత్రాల మధ్య కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ కనెక్షన్ మొత్తం కథనానికి మరింత డెప్త్ ను జోడిస్తుంది. ఇటీవల రిలీజైన ఇండియన్2లో తన నటనకు విమర్శలను ఎదుర్కొన్న ప్రియా భవానీ శంకర్, ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి బాగా ఆకట్టుకుంది. కథను ఎలివేట్ చేసే పాత్రతో చాలా కీలకంగా మారింది. అరుళ్నితి ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. ప్రియా నటనకు బలమైన సపోర్ట్ ను అందించారు. సినిమాకి ఇతని నటన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆద్యంతం సస్పెన్స్‌పై గట్టి పట్టును కొనసాగిస్తూ స్క్రీన్ ప్లే చక్కగా రూపొందించారు. సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్టులు టర్న్ లు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. అంతేకాక ప్రేక్షకులు డిమోంటి కాలనీ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా కథ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. భయానక వాతావరణాన్ని ఇందులో బాగా కనెక్ట్ అయ్యేలా చూయించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు పుస్తకాన్ని చదవేటప్పుడు, పక్షుల ఎపిసోడ్, అక్వారియం ఎపిసోడ్ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తాయి.
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు రాసుకున్న ద్వితీయభాగం కథ… కథనాలు కొత్తగా వున్నాయి. మొదటి పార్ట్ కు లింక్ చేస్తూ… సెకెండ్ పార్ట్ ను చాలా ఇన్నోవేటివ్ గా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఎక్కడా బోర్ గా ఫీల్ అవ్వరు. అజయ్ జ్ఞానముత్తు, వెంకీ వేణుగోపాల్, రాజవేల్ స్క్రీన్ ప్లే, సినిమా సస్పెన్స్ టోన్‌ని ఎఫెక్టివ్‌గా మెయింటైన్ చేస్తూ… ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠతను రేకెత్తించడంలో సక్సెస్ అయ్యారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా టెన్షన్ మరియు ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేలా మ్యూజిక్ ఉంది. కుమారేష్ డి ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ పై బాగా కేర్ తీసుకున్నారు. ఈ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3.25