• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, February 13, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“డీమాంటీ కాలనీ 2” సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్ – హీరో అరుల్ నిథి

Maari by Maari
September 1, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
“డీమాంటీ కాలనీ 2” సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్ – హీరో అరుల్ నిథి

Share and Enjoy !

Shares
Twitter

హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ 2” సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు హీరో అరుల్ నిథి. గత నెల 23న “డీమాంటీ కాలనీ 2” తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. ఈ సినిమాను ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “డీమాంటీ కాలనీ 2” బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సంతోషాన్ని వ్యక్తం చేశారు హీరో అరుల్ నిథి.

– డీమాంటీ కాలనీ 2 సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. తెలుగులో మా సినిమా స్కేల్ తో చూస్తే చాలా పెద్ద సక్సెస్ ప్రేక్షకులు ఇచ్చారు. ఇక తమిళంలో మా సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది. మాతో పాటు విక్రమ్ గారి తంగలాన్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

– డీమాంటీ కాలనీ 2 సినిమాను తెలుగు ఆడియెన్స్ దగ్గరకు ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు బాగా తీసుకెళ్లారు. తెలుగులో మంచి ప్రమోషన్ చేశారు. మా కంటే ఎక్కువగా మా సినిమాను ఆయన బిలీవ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన వల్లే తెలుగులో మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అందుకుంది. తెలుగులో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసేందుకు సురేష్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని అనివార్యమైన పనులతో హైదరాబాద్ రాలేకపోయాం. త్వరలోనే హైదరాబాద్ వచ్చి సక్సెస్ మీట్ నిర్వహిస్తాం.

– డిమాంటీ కాలనీ 2 పర్పెక్ట్ సీక్వెల్ అనే పేరు వస్తోంది. డీమాంటీ కాలనీ 2తో పాటు 3, 4 సినిమాలు రాబోతున్నాయి. ఈ ఫ్రాంచైజీలో డీమాంటీ కాలనీ 3 బిగ్ స్పాన్ మూవీ అవుతుంది. ఎన్నో ట్విస్టు లు టర్న్ లతో ఈ సినిమా ఉండబోతోంది. కొత్త కొత్త స్టోరీస్ , క్యారెక్టర్స్ డీమాంటీ కాలనీ 3లో యాడ్ అవుతాయి. డీమాంటీ కాలనీ 2 సక్సెస్ మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. టెక్నికల్ గా సామ్ సీఎస్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. రీ రికార్డింగ్ తర్వాత సినిమాలోని కంటెంట్ చాలా ఎఫెక్టివ్ గా మారింది. సామ్ కు థ్యాంక్స్ చెబుతున్నాం.

– ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశాను. శ్రీని క్యారెక్టర్ డీమాంటీ కాలనీ 1లో ఉన్నదే కంటిన్యూ అయ్యింది. రఘు అనే క్యారెక్టర్ కొత్తగా యాడ్ చేశాం. రఘు క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. తనొక బిగ్ ఆర్కిటెక్చర్. కాబట్టి స్టైల్ గా ఉంటాడు. రిచ్ కిడ్ కాబట్టి కేర్ లెస్ గా బిహేవ్ చేస్తుంటాడు. శ్రీని క్యారెక్టర్ కు కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ రఘు. ద్విపాత్రాభినయం చేయడం కష్టమే. గతంలో నేను డ్యూయర్ రోల్ చేశాను. బాగా నటించాననే పేరొచ్చింది. డీమాంటీ కాలనీ 2కు మా డైరెక్టర్ అజయ్ మంచి స్క్రిప్ట్ చేశాడు.

– నా కెరీర్ లో ఎక్కువగా థ్రిల్లర్స్, సస్పెన్స్ మూవీ చేశాను. అలా కావాలని ప్లాన్ చేయలేదు. ఇక నుంచి వేరే జానర్ మూవీస్ చేయాలని అనుకుంటున్నాను. నా ప్రతిభకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. అయితే డీమాంటీ కాలనీ ఫ్రాంచైజీ ద్వారా ఆ గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నా. నా సోదరుడు ఉదయనిధి స్టాలిన్ నెల క్రితమే డీమాంటీ కాలనీ 2 చూశాడు. సినిమా బాగుందని, మేకింగ్ క్వాలిటీ ఆకట్టుకుందని చెప్పారు. సినిమా షూటింగ్ టైమ్ లో ఎలాంటి భయం కలగలేదు. జీవితంలో కూడా భయపడే పనులేవీ చేయను.

– ఈ సినిమా పార్ట్ 1లో ఒక క్యారెక్టర్ చేశాను. పార్ట్ 2లో రెండు క్యారెక్టర్స్ చేశాను. పార్ట్ 3లో ఎన్ని క్యారెక్టర్స్ చేయిస్తారో డైరెక్టర్ అజయ్ గారు నిర్ణయం తీసుకోవాలి. డీమాంటీ కాలనీ 3 మరిన్ని సర్ ప్రైజ్ లతో మీ ముందుకు వస్తుందని మాత్రం నమ్మకంగా చెప్పగలను. తెలుగులో మూవీ ఆఫర్స్ ఇప్పటివరకు రాలేదు. నా క్యారెక్టర్ బాగుండి. కథ ఆకట్టుకుంటే తప్పకుండా తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తా. అన్నారు.

Hero Arulnithi Thanks Telugu Audience for making “Demonte Colony 2” a grand success

Hero Arulnithi expressed his gratitude to the Telugu audience for the great success of the horror thriller “Demonte Colony 2.” The film had a grand theatrical release in Telugu on August 23rd. Presented by N. Srinivasa Reddy and brought to the Telugu audience by producers B. Suresh Reddy and B. Manasa Reddy under the banner of Sree Balaji Films, the movie has achieved notable success at the box office. Arulnithi shared his joy in a recent interview.

“I am very happy with the response to ‘Demonte Colony 2.’ The film has been a huge success with the Telugu audience, and it is also performing well in Tamil. Alongside our movie, Chiyaan Vikram’s ‘Thangalaan’ has also received positive feedback.

Producer Suresh Reddy has done an excellent job in promoting ‘Demonte Colony 2’ in Telugu. He believed in our film even more than we did, and we thank him for his support. His efforts have been crucial in the film’s success in Telugu. Although we are currently unable to come to Hyderabad due to unavoidable commitments, we plan to visit soon to organize a success celebration.

‘Demonte Colony 2’ serves as a perfect sequel, and we are excited to announce that ‘Demonte Colony 3’ and ‘Demonte Colony 4’ are in the works. ‘Demonte Colony 3’ will be a significant installment in the franchise, featuring many twists and new characters. We are very satisfied with the success of ‘Demonte Colony 2,’ and Sam CS’s music has been a highlight. The re-recording has made the movie even more impactful, and we extend our thanks to Sam.

In ‘Demonte Colony 2,’ I played a double role. Srini’s character continues from the first film, while we introduced a new character named Raghu. Raghu is very stylish and rich, behaving carelessly, which contrasts sharply with Srini’s character. Playing a double role is challenging, but I believe I performed well. Our director Ajay crafted a compelling script for ‘Demonte Colony 2.’

Throughout my career, I have mostly done thrillers and suspense films. While it was not planned, I am now interested in exploring other genres. My talent has often been questioned, but I hope the ‘Demonte Colony’ franchise will change that. My brother Udayanidhi Stalin saw ‘Demonte Colony 2’ a month ago and praised its quality. I approach my work without fear and aim to continue delivering impactful performances.

In the first part of the movie, I played one character, while in the second part, I took on two roles. It will be up to Director Ajay to decide how many characters I will play in Part 3. I am confident that ‘Demonte Colony 3’ will bring more surprises. Although I have not yet received offers for Telugu films, if an interesting story comes along, I would definitely consider making a straight film in Telugu.”

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

విలక్షణమైన ప్రతిభతో దూసుకెళుతున్న ‘ది డీల్’ హీరో హను కోట్ల

Next Post

ఈనెల 6న సరికొత్త జోనర్ లో వస్తున్న SPEED220

Next Post
ఈనెల 6న సరికొత్త జోనర్ లో వస్తున్న SPEED220

ఈనెల 6న సరికొత్త జోనర్ లో వస్తున్న SPEED220

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

by Maari
February 12, 2026
0

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
February 11, 2026
0

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
February 11, 2026
0

లవ్ స్టోరీలో ఇది కె.జి.ఎఫ్. లాంటి చిత్రం: నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

లవ్ స్టోరీలో ఇది కె.జి.ఎఫ్. లాంటి చిత్రం: నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

by Maari
February 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.