• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, February 13, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ SPEED220

Maari by Maari
September 6, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Reviews, special
0
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ SPEED220

Share and Enjoy !

Shares
Twitter

యూత్ ను ఎంగేజ్ చేసే సినిమాలకి క్రేజ్ ఎక్కువ. అందుకే కొత్త దర్శకులు, నిర్మాతలు యూత్ ఫుల్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తుంటారు. దాని వల్ల బాక్సాఫీస్ వద్ద కూడా కొంత నిర్మాతలు గట్టేక్కే పరిస్థితి వుంది. అందుకుతోడు ఓటీటీకి ఇలాంటి స్టోరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తాజాగా ఇలాంటి కథ… కథనాలతో తెరకెక్కిందే.. SPEED220. దీనని విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి, తాటికొండ మహేంద్రనాథ్ తదితరులు నటించారు. డెబ్యూ దర్శకుడు హర్ష బీజగం దర్శకత్వం వహించారు. రా లవ్ స్టోరీ.. స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రా లవ్ స్టోరీ యూత్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: సూర్య(హేమంత్), చందు(గణేష్) ఇద్దరూ మంచి స్నేహితులు. ఊళ్లో వాళ్లకి తలలో నాలుకలా ఉంటూ అందరికీ సహాయం చేస్తూ ఎంతో అన్యోన్యంగా బతికేస్తూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన భిక్షపతి(తాటికొండ మహేంద్రనాథ్) అనే ఓ జమీదారు ఇంట్లో పనిచేస్తూ… ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆయనకు మాయ(భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్) అనే ఓ ఆధునకి భావాలు కలిగిన యువతి ఉంటుంది. సూర్య, గణేష్, మాయ ముగ్గురు చిన్నప్పటి నుంచే చదువుకుంటూ పెరిగి పెద్దవారవుతారు. అయితే మాయ సూర్య, చందులను ఒకరికి తెలియకుండా ఒకరితో సాన్నిహిత్యంగా ఉంటుంది. సూర్యకి చింటూ అనే ఓ చిన్న కుర్రాడితో అటాచ్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ కుర్రాడు అనుమానాస్పదస్థితిలో చనిపోతాడు. అలాగే మాయ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. దాంతో సూర్య ఓ పిచ్చివాడిలాగ తయారై తిరుగుతూ వుంటారు. అలా తిరుగుతున్న సమయంలో అతని మీద హత్యాయత్నం జరుగుతుంది. దాంతో సూర్య అలర్ట్ అవుతాడు. తనను చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అసలు చింటూ, మాయలు చనిపోవడానికి కారణం ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: రా లవ్ స్టోరీలకు యూత్ లో మంచి ఆదరణ వుంటుంది. గతంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 కానీ, అర్జున్ రెడ్డి కానీ బాక్సాఫీస్ వద్ద ఎంత బంపర్ హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇలాంటి కథలను తెరకెక్కించేటప్పుడు స్క్రీన్ ప్లే ప్రధాన భూమిక పోషిస్తుంది. తెలిసిన కథలే అయినా… వాటికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని తెరమీద చూపిస్తే… యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు చెప్పినట్టు ఇది ఓ డిఫరెంట్ జోనర్ సినిమా. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి చుట్టూ… స్వచ్ఛమైన ప్రేమకోసం ఓ ఇద్దరు నిజాయతీగల యువకులు తిరిగే కథ. దానిని తెరమీద కొన్ని బోల్డ్ సీన్స్ తోనూ… ‘రా’ రొమాన్స్ ను యువతను ఆకర్షించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కొంతవరకూ ఫలించిందనే చెప్పొచ్చు. దానికి కారణం… ప్రీతి సుందర్ అందచందాలే అని చెప్పొచ్చు. ఎక్కడా బోరింగ్ లేకుండా ఇద్దరు యువకులతో ప్రీతి చేసిన రొమాన్స్ ను యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో అంతా… లవ్, రొమాన్స్ ను చూపించిన దర్శకుడు… సెకెండాఫ్ లో మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. సినిమా నిడివిని కూడా చాలా తక్కువ వుండటంతో సినిమా ఎక్కడా బోరింగ్ లేకుండా సాగిపోతుంది. ఈ సినిమా చూడటానికి ఆర్ ఎక్స్ 100 ఛాయలున్నా… ఓ సారి చూసేయొచ్చు. ఇధొక యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమా.

ఇందులో మాయ పాత్రలో చేసిన భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్ గురించి. ఆమె నటన సినిమాకి హైలైట్. బోల్డ్ సీన్స్ లో అందంగా కనిపించింది. ఉత్తరాది అమ్మాయే అయినా… తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పక్కింటి అమ్మాయిలాగ కనిపిస్తుంది. మల్లిడి హేమంత్ రెడ్డి సూర్య పాత్రలో రఫ్ గా కనిపించి ఆకట్టుకుంటారు. భగ్న ప్రేమికుడిగా మంచి నటనే కనబరిచారు. అలాగే గణేష్ కూడా చందు పాత్రలో మెప్పించారు. సుప్రియ పాత్రలో చేసిన శర్మ జాహ్నవి పల్లెటూరి అమ్మాయి పాత్రలో లంగా వోణిలో ఆకట్టుకుంటుంది. జమిందారుడు భిక్షపతిగా, హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన తాటికొండ మహేంద్రనాథ్ నటన కూడా పర్వాలేదు. చింటూ పాత్రలో కనిపించిన చిన్నకుర్రాడు కూడా తన పాత్రకు న్యాయం చేశారు.

దర్శకుడు హర్ష… ఇలాంటి సినిమాని ఎంచుకోవడం మంచిదే. స్వచ్ఛమైన లవ్ కోసం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన ఓ ఇద్దరు యువకులు, ఓ యువతిల మధ్య జరిగే ట్రయాంగిల్ కథ.. కథనాలు ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. అయితే వీరితో కలిసి పెరిగిన అమ్మాయి… పెరిగి పెద్దయిన తరువాత ఎందుకు అలా ఆధునిక భావాలతో సెంటిమెంట్ కు తావులేకుండా పెరగాల్సివచ్చిందో కనీసం తండ్రితోనైనా చెప్పించి వుంటే బాగుండేది. పైగా నా కూతురు కామంతో మీ ఇద్దరితో ఇలా ఆడుకుందని చెప్పించడం అంతగా నప్పలేదు. ఆమె అలా పెరగడానికి కారణం… ఓ బలమైన కారణం వుండేలా చూడాల్సింది. అప్పుడు ప్రేక్షకులకు మరింత కన్వెన్సింగ్ గా వుండేది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. రొమాంటిక్ సన్నివేశాలను, హీరోలను, హీరోయిన్లను అందంగా చూపించారు. పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించారు. నేపథ్య సంగీతం బాగుంది. ఓ ఐటెం సాంగు కూడా యూత్ కోసం పెట్టినట్టువుంది. అది కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని చాలా క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Tags: Speed 220 movie Telugu Review
Previous Post

ఆకట్టుకుంటున్న ‘మంగంపేట’ ఫస్ట్ లుక్..

Next Post

‘ఉరుకు పటేల’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వినోదాత్మకంగా ఉంటుంది- హీరో తేజ‌స్ కంచ‌ర్ల‌

Next Post
‘ఉరుకు పటేల’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వినోదాత్మకంగా ఉంటుంది- హీరో తేజ‌స్ కంచ‌ర్ల‌

‘ఉరుకు పటేల’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వినోదాత్మకంగా ఉంటుంది- హీరో తేజ‌స్ కంచ‌ర్ల‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

by Maari
February 12, 2026
0

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
February 11, 2026
0

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
February 11, 2026
0

లవ్ స్టోరీలో ఇది కె.జి.ఎఫ్. లాంటి చిత్రం: నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

లవ్ స్టోరీలో ఇది కె.జి.ఎఫ్. లాంటి చిత్రం: నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

by Maari
February 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.