కట్టప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న తమిళ నటుడు సత్యరాజ్… వరుస సినిమాల్లో అటు తమిళంలోనూ… ఇటు తెలుగులోనూ నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నారు. తాజాగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రిబాణధారి బార్బరిక్’లోనూ ప్రధాన పాత్ర పోషించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సత్యం రాజేష్, వశిష్ట సింహా, యాంకర్ ఉదయభాను, క్రాంతి కిరణ్, మేఘన, సాంచి రాయ్, తమిళనటులు రాజేంద్రన్, వీటీవీ గణేష్ తదితరులు ఇతరపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ: సైకియాట్రిస్ట్ శ్యామ్… చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయిన తన మనుమరాలు నిధి(మేఘన)ను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వుంటారు. ఆ చిన్నారి ఉన్నట్టుండి మిస్ అవుతుంది. దాంతో శ్యామ్… పోలీసులను ఆశ్రయిస్తాడు. చిన్నారి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది. మరోవైపు రామ్(వశష్ట సింహా) చిన్నతనంలో తండ్రిని కోల్పోయి అమ్మ సంరక్షణలో బీటెక్ పూర్తిచేసి ఎలాగైనా అమెరికా వెళ్లి మంచిగా డబ్బులు సంపాధించాలని చూస్తుంటాడు. అమెరికా వెళ్లడం అంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఆ డబ్బు సమకూరే వరకూ పద్మ(యాంకర్ ఉదయభాను) దగ్గర క్యాబ్ అద్దెకు తీసుకుని నడుపుతూ వుంటాడు. అదే సమయంలో పద్మ… మేనల్లుడు దేవా(క్రాంతి కిరణ్) కూడా తన మేనత్త కూతరుని ప్రేమిస్తూ… అత్తదగ్గరే క్యాబ్ నడుపుతూ వుంటాడు. అయితే… ఇతనికి డబ్బు మీద వ్యామోహం ఎక్కువ. డబ్బు సంపాధించాలనే యావతో తలకు మించిన అప్పులు చేసి… వాటిని తీర్చడానికి తొక్కని అడ్డదారులంటూ వుండవు. ఈ క్రమంలో శ్యామ్… రామ్… దేవాల మధ్య ఎలాంటి సంబంధం వుంది? మిస్సింగ్ అయిన శ్యామ్ మనుమరాలు నిధి దొరికిందా? రామ్ విదేశీ కల నెరవేరిందా? వ్యసనాలకు బానిస అయిన దేవా చివరకు ఏమయ్యాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇదొక మైథలాజికల్ టచ్ ఉన్న సస్పెన్స్ క్రైం థ్రిల్లర్. డబ్బు, డ్రగ్స్ , కిడ్నాప్ ల చుట్టూ తిరిగే ఓ సోసియల్ డ్రామా. ఇలాంటి కథ… కథనాలను మనం ఇంతకు మందు వెండితెరపై చాలా చూసే వుంటాం. అయితే దర్శకుడు రాసుకున్న ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్రైం ఎలిమింట్స్ తో సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్… సెకెండాఫ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక ద్వితీయార్థంలో బాలిక మిస్సింగ్ కేసును ఛేదించడంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను చివరిదాకా సీటులో కూర్చునేలా ఎంగేజ్ చేస్తాయి.
ఇంతకు ముందు సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసిన అనుభవంతో సినిమా కథను… కొంత వరకూ ప్రేక్షకులు ప్రిడిక్ట్ చేసినా… స్క్రీన్ ప్లే మాత్రం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అవసరమైన చోట రివర్స్ స్క్రీన్ ప్లేను ప్లే సేసి… సినిమాను మలుపులు తిప్పి… ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యుద్ధాన్ని ఒక్కరోజులో ముగించగల సత్తావున్న మహాభారతంలోని ఘటోత్కచుని కుమారుడైన బార్బరిక్ కి ముడిపెడుతూ… బాలిక మిస్సింగ్ అయిన 24 గంటల్లోనే… మిస్సింగ్ కేసును ఛేదించేలా ఈ సినిమాను ఒక్కరోజులోనే చూపించారు. త్రిబాణధారిలా మారి సికియాట్రిస్ట్ శ్యామ్… తన మనుమరాలు ఆచూకీని ఎలా కనుకగొన్నాడు అనేదే టైటిల్ జస్టిఫికేషన్. మలుపులతో కూడిన ఈ మైథలాజికల్ టచ్ వున్న సస్పెన్స్ థ్రిల్లర్ ను సరదాగా ఈ వారం చూసేయొచ్చు.
సత్యరాజ్ తన ఈజ్ తో ఎప్పటిలాగే నటించి మెప్పించారు. తాత పాత్రలో అతని నటన హార్ట్ టచింగ్ గా వుంటుంది. అతని మనుమరాలిగా నటించిన మేఘన కూడా ఆకట్టుకుంటుంది. వశిష్ట సంహా కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. అతనితో పాటు నటించిన క్రాంతి కిరణ్ పాత్ర కూడా బాగుంది. చైల్డ్ అబ్యూజింగ్ కి గురైన సత్య పాత్రలో సాంచీ రాయ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఈ మధ్య పోలీసు పాత్రలతో సత్యం రాజేష్ ఆకట్టుకుంటున్నాడు. ఇందులో కూడా మంచి గుర్తింపు ఉన్న కానిస్టేబుల్ పాత్రలో నటించి మెప్పించాడు. తమిళ నటుడు రాజేంద్రన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే టీవీ గణేషన్ కూడా ఇందులో ఎస్.ఐ.గా నటించారు. వీరిద్దరూ కొంత కామెడీ టచ్ వున్న పాత్రలు పోషించారు. పద్మ పాత్రలో యాంకర్ ఉదయ భాను చాలా అగ్రెసివ్ పాత్రలో నటించి మెప్పించారు. తనకు అచ్చి వచ్చిన తెలంగాణ యాసలో నటించి మెప్పించారు. మిగిలిన పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు మోహన్ శ్రీవత్స రాసుకున్న కథ… కథనాలు బాగున్నాయి. మంచి ఎంగేజింగ్ మిస్సింగ్ క్రైం థ్రిల్లర్ ను తెరకెక్కించారు. 24 గంటల్లో జరిగే ఈ కథను… చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. క్రైం థ్రిల్లర్స్ కి కావాల్సిన మూడ్ ను కెమెరాలో బంధించి… ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ కుశ్యేందర్ రెడ్డి. సక్సెస్ అయ్యారు. క్రైం థ్రిల్లర్ కి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను బాగా సమకూర్చారు ఇన్ ఫ్యూజన్ బ్యాండ్. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా వుంది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3