• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

శింబు, వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్

admin by admin
October 17, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
శింబు, వెట్రిమారన్ ‘సామ్రాజ్యం’ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శింబు కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ సినిమా నిర్మిస్తున్నారు. ‘రాక్ స్టార్’ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో ‘అరసన్’, తెలుగులో ‘సామ్రాజ్యం’ టైటిల్ ఖరారు చేశారు.

‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ చేతుల మీదుగా సోషల్ మీడియాలో తెలుగు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ అందించారు. “శింబు బెస్ట్ ఇంకా తెరపైకి రావాల్సి ఉందని, వెట్రిమారన్ కంటే వెండితెరపై అతడిని ఇంకెవరు బాగా చూపిస్తారని” ఎన్టీఆర్ పేర్కొన్నారు. ప్రోమో లేదా టీజర్ రెండు మూడు నిమిషాల నిడివిలో ఉంటాయి. అందుకు భిన్నంగా ఐదున్నర నిమిషాల వీడియో విడుదల చేసింది ‘సామ్రాజ్యం’ చిత్ర బృందం.

‘సామ్రాజ్యం’ ప్రోమో ప్రారంభంలో విజువల్స్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కోర్టు బయట తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఓ వ్యక్తి కథ చెబుతున్న దృశ్యంతో ప్రోమో ప్రారంభమైంది. ‘సార్… నేను చెప్పబోయే మ్యాటర్ మొత్తం రియాలిటీ. నరికినోళ్లు, చచ్చినోళ్ళు, స్థలం, పేరు, టైం, ఊరు… మొత్తం రియాలిటీనే. కానీ మీరు అలా చూపించకండి. ఈ సినిమాలో వచ్చేదంతా ఉట్టి భూటకం అని కార్డు వేస్తారు కదా! అలా వేయండి’ అని శింబు చెబుతుంటారు. ఆ పాత్రలో ఎన్టీఆర్ అయితే అదరగొడతారని చెబుతారు. ఆ తర్వాత కోర్టులో వాయిదాకు సమయం కావడంతో వెళతారు. ముగ్గురు మనుషుల్ని అత్యంత కిరాతకంగా నరికి చంపిన కేసులో ఆయన ముద్దాయి. అయితే తాను ఎవరినీ చంపలేదని, తనపై అన్యాయంగా కేసు బనాయించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేస్తారు శింబు. ప్రోమోలో రెండు భిన్నమైన గెటప్పుల్లో ఆయన కనిపించారు. కోర్టు సన్నివేశాల్లో కాస్త నెరిసిన గడ్డంతో, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో యువకుడిగా ఉన్నారు. ఆ కేసు ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. 

ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘వడచెన్నై’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ‘వడ చెన్నై’ ప్రపంచంలో ఎవరికీ చెప్పని కథ అంటూ ప్రోమో చివర్లో వేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు ‘వి క్రియేషన్స్’ అధినేత కలైపులి ఎస్ థాను. ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.
‘సామ్రాజ్యం’ చిత్రానికి కెమెరా: వేల్ రాజ్, ఎడిటర్: కె రామర్, ఆర్ట్ డైరెక్టర్: జాకీ, స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్, మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్.

Man Of Masses NTR unveils STR-Vetrimaaran’s Saamrajyam promotional teaser

Actor Simbu and director Vetrimaaran are collaborating on a new film under V Creations, produced by the renowned Tamil filmmaker Kalaipuli S. Thanu. The music is composed by ‘Rockstar’ Anirudh Ravichander. The film is titled ‘Arasan’ in Tamil and ‘Saamrajyam’ in Telugu.

The Telugu promotional teaser was launched on social media by ‘Man of Masses’ NTR, who conveyed his best wishes to the team. He praised Simbu, saying, “Simbu’s best is yet to come, and no one can portray him better on the big screen than Vetrimaaran.” Unlike the usual 2–3 minute promos, the ‘Saamrajyam’ team released a promo that is over 5 minutes long.

The promo begins with Anirudh’s gripping background score even before the visuals appear. The opening scene shows Tamil director Nelson Dilipkumar outside a court while a man narrates a story to him. Simbu’s character says, “Sir, what I’m going to tell you is all real. The people killed, the dead, the place, the names, the time, the town, everything is real. But don’t show it like that. You should still put up a card saying everything in the film is fictional.” It is said that NTR would have been perfect for that role.

The scene then shifts to a courtroom, where Simbu appears as an accused in a brutal triple murder case. He pleads before the judge that he never killed anyone and was falsely implicated.

Simbu appears in two contrasting looks. He has a slightly greying beard in the courtroom scenes and appears younger in the flashbacks. The details of the actual case will be revealed in the movie.

Vetrimaaran’s earlier film ‘Vada Chennai’, starring Dhanush, received both critical acclaim and audience appreciation. The ‘Saamrajyam’ promo ends with a line saying, “A story never told to anyone in the world of Vada Chennai.” The Telugu version will be released in association with Suresh Productions. The first schedule of filming is complete, and the second schedule will begin soon.

Previous Post

కోలాహలంగా నామినేషన్ దాఖలు చేసిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్

Next Post

యూత్ ను ఫుల్ ఎంటర్టైన్ చేసే K-Ramp

Next Post
యూత్ ను ఫుల్ ఎంటర్టైన్ చేసే K-Ramp

యూత్ ను ఫుల్ ఎంటర్టైన్ చేసే K-Ramp

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”

by admin
October 26, 2025
0

`గీతా సుబ్ర‌మ‌ణ్యం` ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా `ఎ క‌ప్ ఆఫ్ టీ`..`వాట్ హాపెండ్`  ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

`గీతా సుబ్ర‌మ‌ణ్యం` ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా `ఎ క‌ప్ ఆఫ్ టీ`..`వాట్ హాపెండ్` ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

by admin
October 26, 2025
0

HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు

HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు

by admin
October 26, 2025
0

“స్కై” నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

“స్కై” నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

by admin
October 24, 2025
0

కొలువుదీరిన టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

కొలువుదీరిన టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

by admin
October 24, 2025
0

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

by admin
October 23, 2025
0

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

by admin
October 22, 2025
0

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

by admin
October 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.