సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్
అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మా రాముడు అందరివాడు. శ్రీరామ్, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. మనిష్ కుమార్ సంగీత దర్శకత్వంలో వినోద్ సినిమాటోగ్రాఫర్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్, డ్రామా, సస్పెన్, ఎమోషన్స్ చిత్రంలో క్యారీ చేస్తూ ఈ చిత్రం రానుంది. నర్ర సాయికుమార్ కోరియోగ్రఫీ చేయగా గీత మాధురి, రమ్య బెహర, నల్గొండ గద్దర్ నరసన్న, మనీష్ కుమార్ ఈ చిత్రంలోని పాటలను తన స్వరాన్ని అందించారు. త్వరలో ప్రేక్షకులను వెండి తెరపై అలరించనున్న ఈ చిత్ర టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో లాంచ్ కావడం జరిగింది.
ఈ సందర్భంగా నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ముందుగా మంచి టైటిల్ తో ప్రేక్షకుల ముందు రావడం గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో ఎంతో పెద్ద హీరోలు పెట్టుకునే స్థాయిలో ఈ చిత్ర టైటిల్ చాలా బావుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా బావుంటే దూసుకెళ్లిపోయే రోజులు. అటువంటి ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాత లక్ష్మణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో గద్దర్ నరసన్న పాట పాడటం ప్రత్యేకం. సినిమా బృందం అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థిస్తున్నాను” అన్నారు.
దర్శకుడు మైకిల్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ సినిమాలోని 4 పాటలు అన్ని నేను రాసాను, దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ సినిమా కోసం లక్ష్మణ్ గారు ఎంతో పట్టుదలతో నటించారు. హీరో శ్రీరామ్ ఈ సినిమాకు ముందుగా నాంది పలికారు. చాలా కష్టపడి చిన్న స్థాయి నుండి హీరో స్థాయికి వచ్చారు. నటి స్వాతి నవరసాలు పండిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. మా సినిమాను ప్రోత్సహించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. అందరూ మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత లక్ష్మణ్ రావు మాట్లాడుతూ… “మా చిత్ర టీజర్, ఆడియో లాంచ్ వేడుకకు విచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీరామ్, నటి స్వాతి ఇంకా ఎంతో మంది పేరుగాంచిన నటీనటులకు అందరికీ సినిమాలో నటించినందుకు థాంక్స్. అలాగే దర్శకుడు మైకిల్ తన ప్రాణం పెట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. అలాగే మా కోసం వచ్చిన బాబు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందచేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటి స్వాతి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి సినిమాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన బాబు మోహన్ గారికి థాంక్స్. ఈ సినిమా నాతోనే మొదలైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశాను. ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రం. లక్ష్మణ్ రావు గారు ఈ సినిమా రావడానికి ముఖ్య కారణం. మా సినిమాకు అందరూ 5 భాషలలో సపోర్ట్ చేయాలి. మా సినిమాలో కథ హీరోగా నిలుస్తుంది” అన్నారు.
గద్దర్ నరసన్న మాట్లాడుతూ… “నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరుపేరున నమస్కారం. శ్రీరామ్ మంచితనంతో నేను ఆయనకు అభిమానిగా మారిపోయాను. ఆయన సినిమా కోసం కాదు, అతని స్నేహం కోసం ఈ సినిమాలో పనిచేశాను. హైదరాబాద్ వస్తె కచ్చితంగా శ్రీరామ్ ను కలుస్తాను. మా రాముడు అందరివాడు అనే సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ” అన్నారు.
సమ్మెట గాంధీ మాట్లాడుతూ… “మా రాముడు అందరివాడు అనే టైటిల్ చాలా గొప్పది. నాకు ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. మా హీరో శ్రీరామ్ అందరివాడు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం వారి బాధ్యత . అలాగే లక్ష్మణ్ గారు విలన్ పాత్రలో చాలా బాగా నటించారు. చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి, సినిమాను ఆదరించండి. సుమన్ గారు మంచి పాత్రలో కనిపిస్తున్నారు. మరోసారి ఈ చిత్రంలో పని చేసిన అందరికీ థాంక్స్” అన్నారు.
నాగ మహేష్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన బాబు మోహన్ గారికి, అతిథులకు, మీడియా వారికి నమస్కారం. ఈ సినిమాలో నేను ఒక మంచి పాత్ర పోషించాను. సినిమాలో ఎందరో పేరున్న నటులు నటించారు. ఈ సినిమాతో దర్శకుడు మంచి పేరు సంపాదించుకుంటారు. అలాగే సినిమా కోసం ఎక్కడ వెనకాడకుండా ఖర్చుపెట్టి సినిమాకు వెన్నుముకలా నిలబడ్డారు లక్ష్మణ్ గారు, హీరోగా నటించిన శ్రీరామ్, హీరోయిన్ గా నటించిన స్వాతి పెద్ద హీరో హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
గౌతం రాజ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. చిన్న సినిమాలు విజయం అయితే అందరూ బావుంటారు. ఈ సందర్భంగా ఈ చిన్న సినిమాను అందరూ ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని హీరో మంచి మనసు ఉన్నవాడు, అందరివాడు. జీవితంలో అతను ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. అలాగే సీనియర్ నటులు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ” అన్నారు.
నటీనటులు : శ్రీరామ్, స్వాతి, హీరో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు.
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : యద్దనపూడి మైకిల్
నిర్మాతలు : అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు
అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్
సినిమాటోగ్రాఫర్ : వినోద్
సంగీత దర్శకుడు : మనిష్ కుమార్
కోరియోగ్రఫీ : నర్ర సాయికుమార్









