Abc ప్రొడక్షన్ పతాకం పై భాస్కర్, కోటేశ్వర రావు, ప్రధాన పాత్రదారులుగా మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వం లో అప్పిని పల్లె భాస్కర చారి నిర్మించిన చిత్రం విధాత. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొలి కాపీ తో సిద్ధమైంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భాస్కరాచారి మాట్లాడుతూ “ఇది ఒక వైవిధ్య భరిత మైన చిత్రం. ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో పాత్రలన్నీ చాలా సహజ సిద్ధంగా ఉంటాయి. సంగీత పరంగా కూడా మా చిత్రానికి మంచి మార్కులు ప్రేక్షకులు వేస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రాన్ని అతి త్వరలో మీ ముందుకు తీసుకురానున్నాము. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.
చిత్ర దర్శకుడు రాజేంద్ర మాట్లాడుతూ”మా నిర్మాత నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ఓ కొత్త కోణాన్ని వెలుగు చూస్తుంది. ఈ చిత్రంలో నటీనటులు న్యాచురల్ గా నటించారు. ఈ చిత్రం ప్రస్తుత పనులన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కి సిద్ధమైంది. ఈ చిత్రం మాకు మా ప్రొడ్యూసర్ కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.
సుమ ,రాఘవేందర్ రెడ్డి, చిన్ని, దినకర్, అప్పల బట్ల సురేష్ ,ఉదయ్ కుమార్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డ్రమ్స్ రాము,
డాన్స్: బాలు ,
కో డైరెక్టర్లు: అప్పల బట్ల సురేష్, కురుగొండ రాజా, మంజునాథ్ ,చంద్రశేఖర్ నాయుడు
సింగర్స్: సింధుజ శ్రీనివాసన్, నందకిషోర్
నిర్మాత: అప్పిన పల్లె భాస్కరాచారి ,
దర్శకత్వం: మణికంఠ రాజేంద్ర బాబు MFA









